Nara Nandamuri Families: నారా, నందమూరి కుటుంబాల కీలక నిర్ణయం

ABN , First Publish Date - 2023-01-09T13:14:14+05:30 IST

సంక్రాంతి (Sankranti) సందర్భంగా చంద్రగిరి మండలం నారావారిపల్లెకు నారా, నందమూరి కుటుంబాలు (Nara Nandamuri Families) రానున్నాయి. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు (Chandra Babu) తన కుటుంబ సభ్యులతో..

Nara Nandamuri Families: నారా, నందమూరి కుటుంబాల కీలక నిర్ణయం

చంద్రగిరి: సంక్రాంతి (Sankranti) సందర్భంగా చంద్రగిరి మండలం నారావారిపల్లెకు నారా, నందమూరి కుటుంబాలు (Nara Nandamuri Families) రానున్నాయి. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు (Chandra Babu) తన కుటుంబ సభ్యులతో కలిసి ఏటా సంక్రాంతికి సొంతూరికి రావడం ఆనవాయితీ. అయితే అమరావతిలో రైతుల దీక్షలో పాల్గొన్న సందర్భంగా ఓ ఏడాది.. కరోనా కారణంగా మరో రెండేళ్లు రాలేదు. మూడేళ్ల తర్వాత సంక్రాంతి పండుగకు రానుండటంతో ఆ గ్రామంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. చంద్రబాబు ఇంటికి (Chandra Babu House) పెయింటింగ్‌ వేసి, ఆవరణలో రంగులతో తీర్చిదిద్దారు.

చంద్రబాబు తల్లిదండ్రుల సమాధులు, కులదైవం నాగాలమ్మ ఆలయం, గ్రామ దేవతల వద్ద పరిసరాలను శుభ్రం చేశారు. పార్కింగ్‌, భద్రతా సిబ్బంది ఉండటానికి టీటీడీ కల్యాణ మండపం, పరిసరాలను శుభ్రం చేశారు. ఈనెల 12వ తేదీన నారా భువనేశ్వరి, నారా బ్రాహ్మణి, నారా దేవాన్ష్‌ రానున్నారు. 13న చంద్రబాబునాయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ రానున్నట్లు సమాచారం. వీరితోపాటు నందమూరి కుటుంబ సభ్యులు కూడా రానున్నారు. సంక్రాంతి పండుగ జరుపుకొని 16వ తేదీన చంద్రబాబు, లోకేశ్‌, 17న నారా భువనేశ్వరి, ఇతర కుటుంబ సభ్యులు తిరుగు ప్రయాణమవుతారని తెలిసింది.

Updated Date - 2023-01-09T15:27:53+05:30 IST