Home » Nara Lokesh
కాలేజీ రోజులను గుర్తు చేసుకున్నారు. నాటి సరదాలే కాదు.. చిన్న వయసులోనే పెళ్లయిన అమాయకత్వాన్ని, ఏమీ తెలియనితనంనుంచి భర్త చంద్రబాబు దన్నుతో హెరిటేజ్ సారథిగా సాధించిన విజయాలను తలపోశారు. అన్న బాలకృష్ణ డైలాగ్ను వల్లించారు.
వైద్య వృత్తిని ఎంచుకోవడం ద్వారా మానవాళిని సేవించే గొప్ప మార్గాన్ని ఎంచుకున్నారని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఎయిమ్స్ వైద్య విద్యార్థులను ప్రశంసించారు.
సమస్యల పరిష్కారం కోసం తనను కలుస్తున్న బాధితులు మళ్లీ మళ్లీ తిరగకుండా వారికి శాశ్వత పరిష్కారం చూపాలని మంత్రి నారా లోకేశ్..
ఏలూరు జిల్లా నూజివీడులో దివంగత నేత గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమం పాలక టీడీపీలో అంతర్గతంగా కలకలం సృష్టించింది. వైసీపీకి చెందిన మాజీ మంత్రి, అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు ఇంటిపై దాడికి వెళ్లిన జోగి రమేశ్ ప్రత్యక్షమై వారితో రాసుకుని పూసుకుని తిరగడం పార్టీ శ్రేణులను విస్మయపరచింది.
ప్రపంచ ప్రఖ్యాత తబలా విద్వాంసుడు.. పద్మవిభూషణ్ పురస్కారగ్రహీత.. ఉస్తాద్ జాకీర్ హుస్సేన్ (73) (Zakir Hussain) ఇకలేరు. అనారోగ్యంతో అమెరికా శాన్ ఫ్రాన్సిస్కోలోని ఓ ఆసుపత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ మరణించారు. గత వారం ఆయన ఆరోగ్యం క్షీణించడంతో కుటుంబసభ్యులు ఆయనను ఆస్పత్రికి తీసుకెళ్లారు.
పొట్టి శ్రీరాములు సాగించిన మహత్తర పోరాటం మరువలేదని సీఎం చంద్రబాబు అన్నారు. తెలుగువారి ప్రతిష్టకోసం ప్రాణత్యాగం చేసి అమరుడయ్యారని అన్నారు. త్యాగమూర్తుల జీవితాలను మనం ఆదర్శంగా తీసుకోవాలని సీఎం చంద్రబాబు తెలిపారు.
ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన ఫలితాలు సాధించడం లక్ష్యంగా సంస్కరణలు అమలుకావాలని మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేశ్ అన్నారు.
విజ్ఞాన సమాజాన్ని సృష్టించడం మనందరి లక్ష్యమని సీఎం చంద్రబాబు అన్నారు. అందుకోసం అన్నివిధాలుగా విద్యారంగాన్ని అభివృద్ధి చేయాలని, ప్రభుత్వం, ప్రైవేటు అని వేర్వేరుగా చూడొద్దని, రెండింటినీ ప్రోత్సహించాలని నిర్దేశించారు.
ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలిస్తామని ప్రజలకు హామీ ఇచ్చామని, ఉద్యోగాల కల్పనకు ప్రథమ ప్రాధాన్యమిచ్చి పని చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కలెక్టర్లను ఆదేశించారు.
‘‘లోపభూయిష్ఠమైన ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ తెచ్చి పట్టాదారు పాస్పుస్తకాలపై వాళ్ల బొమ్మలు వేసుకున్నారు. ఇప్పుడు వాటన్నింటినీ చక్కదిద్ది, భూమిని పోగొట్టుకున్న అభాగ్యులకు న్యాయం చేయాల్సిన బాధ్యత మనపై ఉంది’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టంచేశారు.