Gas Leak: ఓఎన్జీసీ గ్యాస్ లీక్.. ఎగిసిపడుతున్న మంటలు

ABN , First Publish Date - 2023-07-15T10:02:34+05:30 IST

జిల్లాలోనిరాజోలు మండలం శివకోడులోని ఆక్వా చెరువు సమీపంలో ఓఎన్జీసీ పైపు నుంచి గ్యాస్ లీకవడం కలకలం రేపుతోంది.

Gas Leak: ఓఎన్జీసీ గ్యాస్ లీక్.. ఎగిసిపడుతున్న మంటలు

అంబేద్కర్ కోనసీమ: జిల్లాలోనిరాజోలు మండలం శివకోడులోని ఆక్వా చెరువు సమీపంలో ఓఎన్జీసీ పైపు నుంచి గ్యాస్ లీకవడం కలకలం రేపుతోంది. గ్యాస్ లీకవడంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వెంటనే గ్యాస్ లీకేజీపై ఓఎన్జీసీ, అగ్నిమాపక సిబ్బందికి స్థానికులు సమాచారం అందించారు. వెంటనే ఓఎన్జీసీ, అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేసేందుకు యత్నిస్తున్నారు. మంటలు ఎక్కువగా వ్యాపించకుండా వాటిని ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నాలు చేస్తున్నారు. మంటలు అదుపులోకి వచ్చిన వెంటనే గ్యాస్‌ లీక్‌పై ఓఎన్జీసీ చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

Updated Date - 2023-07-15T10:02:34+05:30 IST