కామాక్ష మ్మా.... నీకు దిక్కెవరమ్మా?!

ABN , First Publish Date - 2023-07-08T03:01:31+05:30 IST

ఈ వృద్ధురాలి పేరు కామాక్షమ్మ...శుక్రవారం పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు రైల్వే స్టేషన్‌ ప్లాట్‌ ఫారంపై దీనంగా కూర్చుని ఉంది. ఆటో యూనియన్‌ నాయకుడు కుక్కల కృష్ణ ఆమెను

కామాక్ష మ్మా.... నీకు దిక్కెవరమ్మా?!

కూతురు రైల్వేస్టేషన్‌లో వదిలేసి వెళ్లిందంటున్న తల్లి

పాలకొల్లు అర్బన్‌ / పాలకొల్లు రూరల్‌, జూలై 7: ఈ వృద్ధురాలి పేరు కామాక్షమ్మ...శుక్రవారం పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు రైల్వే స్టేషన్‌ ప్లాట్‌ ఫారంపై దీనంగా కూర్చుని ఉంది. ఆటో యూనియన్‌ నాయకుడు కుక్కల కృష్ణ ఆమెను వివరాలు అడగ్గా తమది యలమంచిలి మండలం కలగంపూడి అనిచెప్పడంతో తన ఆటోలో తీసుకువెళ్లాడు. ఆగ్రామంలో వృద్ధురాలి దూరపు బంధువులు ఉన్నప్పటికీ స్పందించక పోవడంతో పాలకొల్లు పట్టణ పోలీస్‌ స్టేషన్‌కు తీసుకువెళ్లాడు. అక్కడ కూడా సరైన స్పందన లేకపోవడంతో చేసేదిలేక రైల్వే స్టేషన్‌ ప్లాట్‌ ఫారంపై ఉంచి ఆమెకు ఆహార పానీయాలు అందజేశాడు. విషయం తెలిసిన పాలకొల్లు మానవతా శాఖ వారు వృద్ధాశ్రమంలో ఆశ్రమం కల్పిస్తామనగా ఆమె అంగీకరించలేదు. తన పెద్దకుమార్తెది భీమవరం సమీపంలోని మహదేవపట్నం శివారు చిలుకూరు గ్రామం అని.., చిన్నకుమార్తె, అల్లుడు చెరువులపై కాపలాగా ఉంటున్నారని, గురువారం మధ్యాహ్న సమయంలో తన చిన్న కూతురు తనను తీసుకువచ్చి ఇక్కడ వదిలి వెళ్లిపోయిందని తెలిపింది. శనివారం తన పెద్దకూతురు ఉంటున్న చిలుకూరు గ్రామానికి వెళతానని తెలిపింది. మానవతా సంస్థ అభ్యర్థన మేరకు స్టేషన్‌ వద్ద ఉండే ఆటో యూనియన్‌ నాయకుడు కృష్ణ, పలువురుఆటో డ్రైవర్లు శనివారం వరకు ఆమెను జాగ్రత్తగా చూస్తామని హామీ ఇచ్చారు. మానవతాసంస్థ ద్వారా విషయం తెలుసుకున్న విశ్వమానవ వేదిక వృద్ధ్దాశ్రమం అధ్యక్షుడు మల్లుల సురేష్‌, తమ ఆశ్రమంలో వృద్ధురాలికి నీడ కల్పిస్తానని హామీ ఇచ్చారు.

Updated Date - 2023-07-08T03:01:31+05:30 IST