ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలి: రఘురామ

ABN , First Publish Date - 2023-09-17T02:45:06+05:30 IST

రాష్ట్రంలో ప్రాథమిక హక్కుల పునరుద్ధరణ కోసం ఎన్నికలు జరిగే వరకు రాష్ట్రపతి పాలన విధించాలని కోరుతూ రాష్ట్రపతి, ప్రధానికి లేఖలు రాయాలని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు ప్రజలకు

ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలి: రఘురామ

న్యూఢిల్లీ, సెప్టెంబరు 16(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ప్రాథమిక హక్కుల పునరుద్ధరణ కోసం ఎన్నికలు జరిగే వరకు రాష్ట్రపతి పాలన విధించాలని కోరుతూ రాష్ట్రపతి, ప్రధానికి లేఖలు రాయాలని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు ప్రజలకు పిలుపునిచ్చారు. శనివారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. కొందరు పనికిమాలిన నాయకులు చెబుతున్న మాటలు విని ప్రజల హక్కులను హరించే విధంగా పోలీసు లు వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. పోలీసుల తప్పుడు వైఖరిని న్యాయస్థానాల్లో ప్రశ్నిస్తే, కనీసం కోర్టుల్లో కూడా రాజ్యాంగం అమలుకాకపోవడం రాజ్యాంగ ప్రాథమిక సూత్రాల స్ఫూర్తికే పూర్తి విరుద్ధమని ఆవేదన వ్యక్తంచేశారు. స్కిల్‌ డెవల్‌పమెంట్‌ వ్యవహారంలో మాజీ సీఎంపై దర్యాప్తు చేయాలంటే గవర్నర్‌ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని చట్టం చెబుతున్నా పోలీసులు పాటించడం లేదని ఆరోపించారు. చంద్రబాబు భద్రతపై రఘురామ ఆందోళన వ్యక్తం చేశారు. తన తండ్రికి జరిగిన అన్యాయంపై జాతీయ మీడియా సంధించిన ప్రశ్నలకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఏమాత్రం తడుముకోకుండా సమాధానాలు చెప్పారని కితాబునిచ్చారు. టీడీపీ, జనసేన పొత్తుతో తమ పార్టీ పని అయిపోయినట్లేనన్నారు.

Updated Date - 2023-09-17T02:45:06+05:30 IST