PSLV-C 55: రేపే నింగిలోకి పీఎస్‌ఎల్‌వీ-సీ 55 రాకెట్‌

ABN , First Publish Date - 2023-04-20T21:09:40+05:30 IST

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో వాణిజ్య రంగ ప్రయోగానికి సర్వం సిద్ధం చేసింది. తిరుపతి జిల్లా శ్రీహరికోట (Sriharikota)లోని షార్‌ నుంచి..

PSLV-C 55: రేపే నింగిలోకి పీఎస్‌ఎల్‌వీ-సీ 55 రాకెట్‌

సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో వాణిజ్య రంగ ప్రయోగానికి సర్వం సిద్ధం చేసింది. తిరుపతి జిల్లా శ్రీహరికోట (Sriharikota)లోని షార్‌ నుంచి ఈ నెల 22న పీఎస్‌ఎల్‌వీ-సీ (PSLV-C)55 రాకెట్‌ ప్రయోగం చేప్టటనున్నారు. ఈ రాకెట్‌ ద్వారా సింగపూర్‌ దేశానికి చెందిన 741 కిలోల బరువు గల టెల్‌ ఈవోఎస్‌-2 ఉపగ్రహంతో పాటు 16 కిలోల బరువైన మరో చిన్న ఉపగ్రహాన్ని రోదసీలోకి పంపనున్నారు. ఈ ప్రయోగానికి సంబంధించిన కౌంట్‌డౌన్‌ (Countdown) శుక్రవారం ఉదయం 11.49 గంటలకు ప్రారంభం కానుంది. కౌంట్‌డౌన్‌ 25.30 గంటలు కొనసాగిన తరువాత రాకెట్‌ (Rocket) షార్‌లోని ప్రధమ ప్రయోగ వేదిక నుంచి నింగిలోకి ఎగరనుంది. గురువారం శాస్త్రవేత్తలు రాకెట్‌ ప్రయోగాత్మక ప్రయోగాన్ని (రిహార్సల్‌) విజయవంతంగా నిర్వహించారు. రిహార్సల్‌లో భాగంగా రాకెట్‌ను మొబైల్‌ సర్వీసు టవర్‌ నుంచి వెనక్కి తీసుకెళ్లారు.

రిహార్సల్‌ అనంతరం ప్రీ కౌంట్‌డౌన్‌ కూడా శాస్త్రవేత్తలు నిర్వహించి రాకెట్‌లోని అన్ని దశల పనితీరును క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రయోగానికి సంబంధించిన మిషన్‌ రెడీనెస్‌ (Mission Readiness) రివ్యూ సమావేశాన్ని (ఎంఆర్‌ఆర్‌) వీడియో కాన్పరెన్స్‌ (Video conference) ద్వారా నిర్వహించారు. ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించిన తరువాత ప్రయోగానికి సంసిద్ధత తెలిపారు. ప్రయోగానికి ముందు 25.30 గంటల పాటు కౌంట్‌డౌన్‌ను నిర్వహించాలని శాస్త్రవేత్తలు నిర్ణయించారు. అన్నీ సజావుగా సాగితే 22న మధ్యాహ్నం 2.19 గంటలకు రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లనుంది.

Updated Date - 2023-04-20T21:09:40+05:30 IST