TarakaRatna: కష్ట కాలంలో తారకరత్న భార్య అలేఖ్యకు అండగా నిలుస్తున్న ఈ వ్యక్తి ఎవరంటే..

ABN , First Publish Date - 2023-01-29T18:34:58+05:30 IST

సినీ నటుడు నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో కుటుంబ సభ్యులు బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రికి ఒక్కొక్కరుగా..

TarakaRatna: కష్ట కాలంలో తారకరత్న భార్య అలేఖ్యకు అండగా నిలుస్తున్న ఈ వ్యక్తి ఎవరంటే..

సినీ నటుడు నందమూరి తారకరత్న (Nandamuri Taraka Ratna Health) ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో కుటుంబ సభ్యులు బెంగళూరులోని నారాయణ హృదయాలయ (Bangalore Narayana Hrudayalaya) ఆసుపత్రికి ఒక్కొక్కరుగా వెళుతున్నారు. బాలకృష్ణ (Bala Krishna) దగ్గరుండి మరీ తారకరత్నను (TarakaRatna) చూసుకుంటున్నారు. శనివారం సాయంత్రం టీడీపీ అధినేత చంద్రబాబు (Chandra Babu) కూడా తారకరత్నకు చికిత్సనందిస్తున్న ఆసుపత్రికి వెళ్లి మెరుగైన వైద్యం అందించాలని కుటుంబీకులకు సూచించారు.

325416483_522830029943790_5795622289688106587_n.jpg

నారా, నందమూరి కుటుంబీకులతో పాటు బెంగళూరులోని ఆసుపత్రిలో పుంగనూరు టీడీపీ ఇన్‌ఛార్జ్, టీటీడీ బోర్డు మాజీ సభ్యులు చల్లా రామచంద్రారెడ్డి కూడా ఉండటం గమనార్హం. చల్లాకు తారకరత్నతో పార్టీపరమైన సంబంధమే కాదు బంధుత్వం కూడా ఉంది. తారకరత్న వివాహం చేసుకున్న అలేఖ్యా రెడ్డి (TarakaRatna Wife Alekhya Reddy) మరెవరో కాదు చల్లా రామచంద్రారెడ్డి పెద్దమ్మ కుమార్తెనే కావడం గమనార్హం. దీంతో.. తారకరత్నకు గుండెపోటు (Taraka Ratna Heart Attack) వచ్చిన విషయం తెలిసి చల్లా కుటుంబం దిగ్భ్రాంతికి లోనైంది. భర్తకు గుండెపోటు రావడం, ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో కుమిలిపోతున్న తారక రత్న భార్య అలేఖ్యారెడ్డిని ఓదార్చుతూ, ధైర్యం చెబుతూ చల్లా భార్య సుప్రియారెడ్డి కూడా బెంగళూరులోని ఆసుపత్రిలోనే ఉన్నారు.

327348399_1534721056939430_2899403853042777017_n.jpg

తారకరత్న ఆరోగ్య పరిస్థితి శనివారం 20 శాతం మెరుగుపడినట్లు డాక్టర్లు చెప్పినట్లు సమాచారం. తారకరత్న ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. తారకరత్నను చూసేందుకు బెంగళూరులోని ఆసుపత్రికి ఆదివారం నాడు జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ వెళ్లారు. కర్ణాటక వైద్యఆరోగ్య శాఖా మంత్రి కె.సుధాకర్ దగ్గరుండి మరీ వారిని ఆసుపత్రికి తీసుకెళ్లారు. తండ్రి పరిస్థితి చూసి తారకరత్న పిల్లలు విలవిలలాడిపోతున్నారు.

326840887_1152901538698214_4230066085439687381_n.jpg

బాలకృష్ణ, చంద్రబాబు వారికి ధైర్యం చెప్పి భరోసా నింపే ప్రయత్నం చేశారు. తారకరత్న తండ్రి మోహనకృష్ణకు కూడా బాలకృష్ణ, చంద్రబాబు, జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ ధైర్యం చెప్పారు. అంతా మంచే జరుగుతుందని, అభిమానుల ప్రార్థనలతో తారకరత్న తప్పకుండా కోలుకుంటాడని తారకరత్న కుటుంబానికి ధైర్యం చెబుతూ నందమూరి కుటుంబం అండగా నిలబడటం హర్షించదగిన పరిణామం.

Updated Date - 2023-01-29T19:28:03+05:30 IST