TarakaRatna: తారకరత్నకు హార్ట్ అటాక్ రావడానికి కారణం తెలిసింది..!
ABN , First Publish Date - 2023-01-27T20:06:15+05:30 IST
టీడీపీ యువ నేత లోకేష్ (Nara Lokesh) ‘యువగళం’ పాదయాత్రలో (YuvaGalam Padayatra) నడుస్తూ తారకరత్న (TarakaRatna Hospitalized) సొమ్మసిల్లిపడిపోవడం, ఆసుపత్రికి తరలించగా వైద్యులు గుండెపోటుగా..
టీడీపీ యువ నేత లోకేష్ (Nara Lokesh) ‘యువగళం’ పాదయాత్రలో (YuvaGalam Padayatra) నడుస్తూ తారకరత్న (TarakaRatna Hospitalized) సొమ్మసిల్లిపడిపోవడం, ఆసుపత్రికి తరలించగా వైద్యులు గుండెపోటుగా (Tarakaratna Heart Attack) నిర్ధారించడంతో టీడీపీ శ్రేణులు, నందమూరి అభిమానులు ఆందోళనకు లోనయ్యారు. అయితే.. నిన్నమొన్నటి దాకా.. అంతెందుకు పాదయాత్ర ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షించిన తారకరత్నకు గుండెపోటు రావడం ఏంటని అభిమానులు విస్మయం వ్యక్తం చేశారు. తారకరత్న హార్ట్‌లో బ్లాక్స్ ఎక్కువగా ఉండటం వల్ల ఆయనకు గుండెపోటు వచ్చిందని చికిత్సనందించిన వైద్యులు తెలిపారు. హార్ట్‌లో కుడి, ఎడమ వైపు 95 శాతం బ్లాక్స్ ఉన్నట్లు పేర్కొన్నారు.
తారకరత్నను కుప్పం హాస్పిటల్ నుంచి మెరుగైన వైద్యం కోసం బెంగళూరులోని ప్రముఖ ఆస్పత్రికి తరలించనున్నారు. కుప్పం మసీదులో లోకేష్‌తో పాటు తారకరత్న ప్రార్థనలు కూడా చేశారు. మసీదు నుంచి బయటకు వస్తూ సొమ్మసిల్లి పడిపోయారు. మాసివ్ స్ట్రోక్ రావడంతో తారకరత్న కుప్పకూలిపోయారు. తారకరత్నను వెంటనే పార్టీ శ్రేణులు కుప్పంలోని ఆసుపత్రికి తరలించారు. తొలుత వైద్యులు యాంజియోగ్రామ్ చేశారు. తారకరత్న ఆరోగ్య పరిస్థితిని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు.
ఇటీవల.. టీడీపీ పార్టీ కార్యక్రమాల్లో నందమూరి తారకరత్న చురుగ్గా పాల్గొంటున్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానని కూడా ఆయన ఇప్పటికే ప్రకటించారు. లోకేష్ పాదయాత్రకు సంబంధించిన ఏర్పాట్లను స్వయంగా కుప్పం వెళ్లి మరీ అన్నీ తానై చూసుకున్నారు. ఇదిలా ఉండగా.. పార్టీ నేతలను కూడా తారకరత్న కలుపుకుని పోతున్నారు. హిందూపురం మాజీ ఎమ్మెల్యే సీసీ వెంకటరాముడును కలిశారు. సీసీ నివాసానికి వెళ్లిన తారకరత్న నియోజకవర్గ రాజకీయ పరిస్థితులపై చర్చించారు. ఈ సందర్భంగా తారకరత్నను ఘనంగా సత్కరించారు. పరిటాల రవి 18వ వర్ధంతి రామగిరి మండలంలోని వెంకటాపురం గ్రామంలో జరగ్గా.. పరిటాల ఘాట్‌కు వెళ్లి నివాళులర్పించారు.
ఇదిలా ఉండగా.. తనకు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశం ఉందని తారక రత్న చెప్పడంతో.. ఆయనకు టీడీపీ అధినేత చంద్రబాబు ఆ సీటు కేటాయించనున్నారు, ఈ అసెంబ్లీ స్థానం నుంచి పోటీకి నిలపనున్నారని తారకరత్న గురించి పలు రకాల ఊహాగానాలు, ప్రచారాలు ఇటీవల సోషల్ మీడియా వేదికగా జోరుగా జరిగాయి. తారకరత్న టీడీపీ తరపున గతంలో ప్రచారం కూడా చేశారు. ఆయన పోటీ చేయాలని డిసైడ్ అవ్వాలే గానీ అసెంబ్లీ సీటు కేటాయించేందుకు టీడీపీ అధిష్టానం కూడా సుముఖంగానే ఉంది. అయితే.. తారకరత్నకు ఎమ్మెల్యే టికెట్ ఏ స్థానం నుంచి కేటాయిస్తారనే అంశం ఆసక్తికరంగా మారింది. తారకరత్న కోలుకుని క్షేమంగా తిరిగిరావాలని, ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలని టీడీపీ శ్రేణులు, అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.