TDP: చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై కోర్టును ఆశ్రయించాలని టీడీపీ నిర్ణయం
ABN , First Publish Date - 2023-10-14T19:10:05+05:30 IST
రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు (Chandrababu) ఆరోగ్య పరిస్థితిపై కోర్టును ఆశ్రయించాలని టీడీపీ (TDP) నిర్ణయం తీసుకుంది.
రాజమండ్రి: రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు (Chandrababu) ఆరోగ్య పరిస్థితిపై కోర్టును ఆశ్రయించాలని టీడీపీ (TDP) నిర్ణయం తీసుకుంది.
విజయవాడ ఏసీబీ కోర్టులో పిటిషన్ వేసేందుకు న్యాయవాదులు సిద్ధమయ్యారు. వైద్యులు ఇచ్చిన నివేదికను కోర్టుకు అందించి.. చంద్రబాబుకు మెరుగైన వైద్యం అందించాలని న్యాయవాదులు కోరనున్నారు. చంద్రబాబు తరపు న్యాయవాదులు పిటిషన్ సిద్ధం చేస్తున్నారు. ములాఖత్‌కు వెళ్లి వచ్చిన అనంతరం రాజమండ్రిలో న్యాయవాదులతో లోకేష్ సమావేశమయ్యారు. న్యాయవాదులు, వ్యక్తిగత వైద్యుల సూచనల మేరకు చంద్రబాబుకు మెరుగైన వైద్యం అందించాలని పిటిషన్‌లో న్యాయవాదులు కోరనున్నారు. కోర్టుకు ఈరోజు, రేపు సెలవులు కావడంతో ఏం చేయాలనే అంశంపై న్యాయవాదులు చర్చలు జరుపుతున్నారు. విజయవాడ ఏసీబీ కోర్టు వద్ద ఎవ్వరూ లేకపోవడంతో కోర్టు సిబ్బందిని కాంటాక్ట్ చేసేందుకు న్యాయవాదులు సిద్దమవుతున్నారు.