Natarajan Chandrasekaran : దేశ ఆర్థికాభివృద్ధి సాధనలో వర్సిటీలది కీలక పాత్ర
ABN , First Publish Date - 2023-12-10T03:32:01+05:30 IST
దేశ ఆర్థికాభివృద్ధి సాధనలో విశ్వవిద్యాలయాలు కీలకపాత్ర పోషించాలని, అందుకు అనుగుణంగా సైంటిఫిక్ పరిశోధనలు, నూతన ఆవిష్కరణలు
ఏయూ పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో నటరాజన్ చంద్రశేఖరన్
విశాఖపట్నం, డిసెంబరు 9 (ఆంధ్రజ్యోతి): దేశ ఆర్థికాభివృద్ధి సాధనలో విశ్వవిద్యాలయాలు కీలకపాత్ర పోషించాలని, అందుకు అనుగుణంగా సైంటిఫిక్ పరిశోధనలు, నూతన ఆవిష్కరణలు చేసేలా విద్యార్థులను తీర్చిదిద్దాలని టాటా సన్స్ సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్ పేర్కొన్నారు. ఆంధ్ర యూనివర్సిటీ పూర్వ విద్యార్థుల సమ్మేళనం వేవ్- 2023ను శనివారం సాయంత్రం విశాఖ బీచ్‌రోడ్డులోని ఏయూ కన్వెన్షన్ హాలులో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ దేశంతోపాటు ప్రపంచం ఎదుర్కొంటున్న అనేక సమస్యలను పరిష్కరించేందుకు అనుగుణమైన ఆవిష్కరణలు రావాలన్నారు. భవిష్యత్తులో రెండో అతిపెద్ద ఎకానమీగా భారత్ అభివృద్ధి చెందాలంటే అందుకు అనుగుణంగా పనిచేయాల్సిన అవసరముందన్నారు. దేశంలో 23 శాతం మంది మహిళలు మాత్రమే పనిచేస్తున్నారని, ఈ సంఖ్య 50 శాతానికి పెరగాల్సి ఉందన్నారు. సమావేశంలో ఏయూ ఇన్‌చార్జి వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ కె.సమత, పూర్వ విద్యార్థుల సంఘ చైర్మన్ డాక్టర్ ఈ.శంకరరావు, వైస్ చైర్మన్లు డాక్టర్ కె.కుమార్‌రాజా, ఎ.మన్మోహన్, జాయింట్ సెక్రటరీ ఆకుల చంద్రశేఖర్, సభ్యులు బొమ్మిడాల కృష్ణమూర్తి, బీవీఎన్ రావు, డాక్టర్ ఎస్‌కేఈ అప్పారావు, వర్సిటీ రిజిస్ర్టార్ స్టీఫెన్‌తోపాటు అధ్యాపకులు, పూర్వ విద్యార్థులు, ప్రస్తుత విద్యార్థులు పాల్గొన్నారు.