Varahi Yatra : రేపటి నుంచి వారాహి యాత్ర

ABN , First Publish Date - 2023-09-30T05:12:27+05:30 IST

జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ నిర్వహించే నాలుగో విడత వారాహి యాత్రకు ఆ పార్టీ నాయకులు సర్వ సిద్ధం చేశారు. ఆదివారం

 Varahi Yatra : రేపటి నుంచి వారాహి యాత్ర

అవనిగడ్డలో బహిరంగ సభతో నాలుగో విడత ప్రారంభం

అమరావతి, సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి): జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ నిర్వహించే నాలుగో విడత వారాహి యాత్రకు ఆ పార్టీ నాయకులు సర్వ సిద్ధం చేశారు. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు అవనిగడ్డలోని వీణాదేవి ప్రభుత్వ డిగ్రీ కాలేజీ క్రీడా ప్రాంగణంలో బహిరంగ సభతో యాత్ర ప్రారంభమవుతుంది. నాల్గవ దశ యాత్ర 5రోజుల పాటు కొనసాగుతుంది. సభ అనంతరం పవన్‌ మచిలీపట్నం చేరుకుని 2,3 తేదీల్లో అక్కడే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. 2న కృష్ణా జిల్లా జనసేన నాయకులతో సమావేశమవుతారు. 3న జనవాణి కార్యక్రమంలో ప్రజా సమస్యలపై ఆర్జీలను స్వీకరిస్తారు. 4న పెడన, 5న కైకలూరు నియోజకవర్గాల్లో పవన్‌ పర్యటిస్తారు. ఇదిలాఉండగా, ఐదో విడత వారాహి యాత్రకు అవనిగడ్డ నియోజకవర్గానికి పోతిన మహేష్‌, తాతంశెట్టి నాగేంద్ర, పెడన నియోజకవర్గానికి బోనబోయిన శ్రీనివాస్‌, అమ్మిశెట్టి వాసు, కైకలూరు నియోజకవర్గానికి ముత్తా శశిధర్‌, చనమల్ల చంద్రశేఖర్‌లను సమన్వయకర్తలుగా నియమించారు.

Updated Date - 2023-09-30T05:12:27+05:30 IST