నారా లోకేష్‌కు బర్త్ డే విషెస్ చెప్పిన విజయసాయిరెడ్డి
ABN , First Publish Date - 2023-01-23T11:46:48+05:30 IST
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శికి రాజకీయ ప్రముఖులంతా పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతున్నారు.

అమరావతి : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శికి రాజకీయ ప్రముఖులంతా పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. టీడీపీ నేతలు, కార్యకర్తలు కేక్ కట్ చేసి మరీ లోకేష్ పుట్టినరోజు వేడుకలను నిర్వహిస్తున్నారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సైతం లోకేష్‌కు ట్విటర్ వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. వెంకటేశ్వర స్వామి ఆయనకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరారు. ‘‘నారా లోకేష్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. వేంకటేశ్వరస్వామి ఆయనకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నా’’ అని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.