ఏయూ వీసీ కోడ్‌ ఉల్లంఘన

ABN , First Publish Date - 2023-02-27T03:15:11+05:30 IST

ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించిన ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రసాదరెడ్డి వ్యవహారంపై సీఐడీతో విచారణ జరిపించాలని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు డిమాండ్‌ చేశారు.

ఏయూ వీసీ కోడ్‌ ఉల్లంఘన

సీఐడీతో విచారణ చేయాలి.. లేకుంటే గవర్నర్‌కు ఫిర్యాదు: అయ్యన్న

నర్సీపట్నం, ఫిబ్రవరి 26: ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించిన ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రసాదరెడ్డి వ్యవహారంపై సీఐడీతో విచారణ జరిపించాలని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు డిమాండ్‌ చేశారు. ఆదివారం ఆయన స్థానిక మీడియాకు వీడియో సందేశం విడుదల చేశారు. వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించాలని కోరుతూ ఓ హోటల్‌లో జరిగిన సమావేశంలో ఏయూ వీసీ పాల్గొన్న ఘటనపై విశాఖపట్నం ఆర్డీవో హుస్సేన్‌ సాహెబ్‌ మొక్కుబడి విచారణ చేశారని ఆరోపించారు. సమావేశంలో వీసీ ప్రసాదరెడ్డి పాల్గొనలేదని నివేదికివ్వడంపై అనుమానాలు వ్యక్తం చేశారు. పత్రికల్లో ప్రచురితమైన ఫొటోల్లో స్పష్టత లేకపోతే ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపించి ఉండాల్సిందన్నారు. ఈ వ్యవహారంపై సీఐడీతో వారం రోజుల్లో విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. లేకపోతే గవర్నర్‌కి ఫిర్యాదు చేస్తామని అయ్యన్న స్పష్టం చేశారు.

Updated Date - 2023-02-27T03:15:12+05:30 IST