Eluru: లారీ డ్రైవర్ భార్య.. భర్త ఫ్రెండ్‌తోనే పసుపుతాడు కట్టించుకుని మరీ వివాహేతర సంబంధం.. చివరకు..
ABN , First Publish Date - 2023-08-29T17:55:22+05:30 IST
భర్త స్నేహితుడే ఆమెకు ప్రియుడు. భర్తపై లేనిపోని మాటలు చెప్పి వివాహేతర సంబంధాన్ని కొనసాగించింది. ప్రియుడిని సరిగా పట్టించుకోకపోవడంతో ఆమెపై కక్ష పెంచుకున్నాడు. తనను అన్ని విధాలా వాడుకుని మోసం చేసిందని భావించిన ప్రియుడు ప్రణాళిక ప్రకారం ఆమెను తన ఇంటికి రప్పించి చాకుతో పొడిచి హతమార్చాడు.
ప్రియుడే కాల యముడు!
స్నేహితుడి భార్యతో వివాహేతర సంబంధం
దూరం పెడుతుందన్న పగతో హత్య.. ఆపై ఆత్మహత్య
ఏలూరు: భర్త స్నేహితుడే ఆమెకు ప్రియుడు. భర్తపై లేనిపోని మాటలు చెప్పి వివాహేతర సంబంధాన్ని కొనసాగించింది. ప్రియుడిని సరిగా పట్టించుకోకపోవడంతో ఆమెపై కక్ష పెంచుకున్నాడు. తనను అన్ని విధాలా వాడుకుని మోసం చేసిందని భావించిన ప్రియుడు ప్రణాళిక ప్రకారం ఆమెను తన ఇంటికి రప్పించి చాకుతో పొడిచి హతమార్చాడు. తాను కూడా ఆత్మహత్య చేసుకుంటున్నట్లుగా సూసైడ్ నోటు రాశాడు. అక్కడ నుంచి స్కూటరుపై నేరుగా నూజివీడు సమీపంలోని రైలు పట్టాల వద్దకు వెళ్లి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన ఇంటి అడ్రస్సు రాసి ఉండడంతో సమాచారం బంధువులకు తెలిసింది. వారు ఇంటి తాళం పగల గొట్టడంతో రక్తపుమడుగులో ఆ యువతి శవం కనిపించడంతో హడలిపోయారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ ఘటన జిల్లా కేంద్రమైన ఏలూరు నగరంలో జరిగింది.
ఇలా స్నేహితులయ్యారు..
శనివారపుపేట గాలిగోపురం ప్రాంతానికి చెందిన ఉడతా వసంతరావుకు భార్య సుజాత (30) రెండో తరగతి చదివే జ్వాయల్‌రాజు, ఎల్‌కెజీ చదివే జశ్విన్‌రాజు అనే ఇద్దరు కుమారులు. సుజాత సెయింట్ ఆన్స్ బిల్లింగ్ విభాగంలో పనిచేస్తుంది. వసంతరావు లారీ డ్రైవర్‌గా పనిచేస్తూ ఇతర రాష్ట్రాలకు వెళ్లి రోజుల తరబడి ఉండి వస్తూ ఉంటాడు. అతడి స్నేహితుడైన ఏలూరు దక్షిణపువీధి మున్సిపల్ స్కూలు ఎదురుగా నివాసం ఉంటున్న దిమ్మటి సత్యనారాయణ (36) పెయింట్ పనులు చేస్తూ ఉంటాడు. తరచుగా వసంతరావు ఇంటికి వస్తుంటాడు. నాలుగు సంవత్సరాల క్రితం సత్యనారాయణ తన భార్యతో గొడవ పడి విడాకులు తీసుకుని అప్పటి నుంచి ఒంటరిగానే ఉంటున్నాడు.
సుజాతతో పరిచయాన్ని పెంచుకుని వివాహేతర సంబంధం కొనసాగించాడు. వసంత రావు ఇతర రాష్ట్రాలకు వెళ్లినప్పుడు ఆమె ఇంటి వద్దే ఉంటున్నాడు. ఆమె కూడా సత్యనారాయణ ఇంటి వద్దకు వస్తూ ఉంటుంది. ఆమె మెడలో పసుపుతాడును సత్యనారాయణ కట్టేశాడు. అప్పటి నుంచి వీరిద్దరు భార్యాభర్తలుగానే సమాజానికి తెలియకుండానే కొనసాగుతున్నారు. ఆర్ధికంగా ఆమెకు సహాయం చేశాడు. కొద్ది రోజుల నుంచి ఆమె సత్యనారాయణను దూరం పెడుతుండడంతో జీర్ణించుకోలేకపోయాడు. తనను భార్య మోసం చేసిందని, ప్రేమించిన సుజాత కూడా మోసం చేస్తుందని ఆగ్రహానికి గురై ప్రణాళిక ప్రకారం పథకం వేసుకున్నాడు. ఈ నెల 25న వసంతరావు రాజస్థాన్ కిరాయికి వెళ్లడంతో 27న మధ్యాహ్నం సుజాతను తన ఇంటికి సత్యనారాయణ తీసుకువెళ్లాడు. అర్ధరాత్రి సమయంలో చాకుతో ఆమె మెడపై పొడిచి హతమార్చాడు. సూసైడ్ నోటు రాసి ఇంట్లో పెట్టి స్కూటర్ వేసుకుని నేరుగా నూజివీడు యార్డు సమీపంలో స్కూటర్‌ను పార్కింగ్ చేసి రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
రైలు పట్టాలపై మృతదేహం ఉందని ఏలూరు రైల్వే పోలీసులకు సమాచారం అందడంతో ఎస్‌ఐ నరసింహారావు సిబ్బందితో సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. దిమ్మటి సత్యనారాయణ, ఏలూరు 11వ డివిజన్, దక్షిణపువీధి అని రాసి పెట్టుకున్నాడు. సమాచారాన్ని రైల్వే పోలీసులు ఆ ప్రాంతంలోని ప్రజలకు తెలియజేయడంతో సత్యనారాయణ మేనల్లుడు గొల్ల మణికంఠ తన స్నేహితులతో కలిసి సత్యనారాయణ ఇంటికి వెళ్లి చూశాడు. సోమవారం మధ్యాహ్నం తాళాన్ని పగులగొట్టి తలుపులు తీయగా ఎదురుగా రక్తపు మడుగులో ఆ యువతి శవం కనిపించింది. దీంతో వారు హడలిపోయి వెంటనే వన్‌టౌన్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఏలూరు డీఎస్పీ శ్రీనివాసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. వన్‌టౌన్ ఎస్‌ఐ రామకృష్ణ కేసు నమోదు చేశారు. మృత దే హాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలిం చారు. ప్రస్తుతం సుజాత భర్త రాజస్థాన్‌లో ఉన్నాడు. భర్త వచ్చిన తరువాత పోస్టుమార్టం నిర్వహించి అప్పగించనున్నారు. సత్యనారాయణ మృతి కేసును ఏలూరు రైల్వే ఎస్‌ఐ డి. నరసింహారావు దర్యాప్తు చేస్తున్నారు. సుజాత హత్య కేసును వన్‌టౌన్ ఎస్‌ఐ రామకృష్ణ నమోదు చేయగా సీఐ ఎన్. రాజశేఖర్ దర్యాప్తు చేస్తున్నారు.