మోదీన బీ మరణానికి కారణమేమిటి..?

ABN , First Publish Date - 2023-09-03T00:03:35+05:30 IST

గరంలోని చంద్ర ఆస్పత్రిలో ఇటీవల సంతాన సాఫల్య చికిత్స పొందుతూ మోదీన బీ మృతిచెందడానికి కారణాలపై వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఆరా తీస్తున్నారు.

మోదీన బీ మరణానికి కారణమేమిటి..?

నిపుణుల కమిటీని ఆరాతీసిన డీఎంహెచఓ

అనంతపురం టౌన, సెప్టెంబరు 2: నగరంలోని చంద్ర ఆస్పత్రిలో ఇటీవల సంతాన సాఫల్య చికిత్స పొందుతూ మోదీన బీ మృతిచెందడానికి కారణాలపై వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ ఘటనపై ఎక్స్‌పర్ట్‌ కమిటీ విచారిస్తోంది. ఈ నేపథ్యంలో డీఎంహెచఓ డాక్టర్‌ భ్రమరాంబ దేవి శుక్రవారం చంద్ర ఆస్పత్రిలోని మాత్రికాస్‌ సెంటర్‌ను తనిఖీ చేశారు. అక్కడి వైద్యులను విచారించారు. జిల్లా ఆస్పత్రిలో ఎక్స్‌పర్ట్‌ కమిటీ సభ్యులను శనివారం ఆమె కలిశారు. మోదీన బీ మరణానికి కారణమేమిటని అనస్థీషియా హెచఓడీ డాక్టర్‌ నవీనకుమార్‌ను అడిగారు. గర్భసంచికి గాయమై ఉండొచ్చని, పోస్టుమార్టం నివేదిక వస్తే మరణానికి కారణమేమిటో తెలుస్తుందని ఆయన డీఎంహెచఓతో అన్నారు. జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ వెంకటేశ్వరరావు, ఆర్‌ఎంఓలు డాక్టర్‌ పద్మజ, డాక్టర్‌ శివకుమార్‌, డీఐఓ డాక్టర్‌ యుగంధర్‌ తదితరులు మోదీన బీ మరణం గురించి చర్చించారు.

Updated Date - 2023-09-03T00:03:35+05:30 IST