Viveka Case: వైఎస్ భాస్కర్‌రెడ్డి రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలివే
ABN , First Publish Date - 2023-04-16T20:26:12+05:30 IST
మాజీమంత్రి వివేకానందరెడ్డి (Former Minister Vivekananda Reddy) హత్యకేసులో ఎంపీ అవినాశ్‌రెడ్డి (MP Avinash Reddy) తండ్రి వైఎస్ భాస్కర్‌రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు.
హైదరాబాద్: మాజీమంత్రి వివేకానందరెడ్డి (Former Minister Vivekananda Reddy) హత్యకేసులో ఎంపీ అవినాశ్‌రెడ్డి (MP Avinash Reddy) తండ్రి వైఎస్ భాస్కర్‌రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. ఆదివారం ఉదయం అరెస్ట్ చేసిన అధికారులు.. ఇదే రోజు సాయంత్రం హైదరాబాద్‌లోని న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. భాస్కర్‌రెడ్డి (Bhaskar Reddy)కి జడ్జి 14 రోజుల రిమాండ్ విధించారు. న్యాయమూర్తి ఆదేశాలతో ఆయనను చంచల్‌గూడ జైలుకు తరలించారు. భాస్కర్‌రెడ్డి రిమాండ్ రిపోర్ట్ (Remand Report)లో సీబీఐ కీలక అంశాలను ప్రస్తావించింది. 10 పేజీల రిమాండ్ రిపోర్ట్‌ను సీబీఐ కోర్టుకు సమర్పించింది. వైఎస్ వివేకా హత్య కేసులో భాస్కర్‌రెడ్డి పాత్ర కీలకం ఉందని సీబీఐ అభియోగం పోపింది. హత్యకు ముందు, తర్వాత నిందితులు భాస్కర్‌రెడ్డి ఇంట్లో ఉన్నారని, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి (Devi Reddy Sivashankar Reddy), వైఎస్ భాస్కర్‌రెడ్డి కలిసి పథకం ప్రకారమే వివేకాను హత్య చేయించారని రిమాండ్ రిపోర్టులో సీబీఐ ప్రస్తావించింది. సాక్ష్యాలు తారుమారు చేయడంలో కీలక పాత్ర పోషించారని తెలిపింది. విచారణకు భాస్కర్‌రెడ్డి సహకరించట్లేదని, ఆయన పారిపోయే అవకాశముందనే అరెస్ట్ చేశామని పేర్కొంది. కీలక సాక్షులను ప్రభావితం చేసే అవకాశముందనే అరెస్ట్ చేశామని సీబీఐ (CBI) తెలిపింది.
పథకం ప్రకారమే వివేక హత్య
‘‘పథకం ప్రకారమే దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి వివేకాను హత్య చేయించారు. నిందితులు సునీల్ యాదవ్, ఎర్ర గంగిరెడ్డి, షేక్ దస్తగిరికి పెద్ద మొత్తంలో డబ్బు ఆశ చూపి హత్య చేయించారు. హత్యకు నెల రోజుల ముందే వైఎస్ భాస్కర్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డి హత్యపై చర్చించారు. షేక్ దస్తగి ఏ-4, అప్రూవర్‌గా మారి హత్యకు సంబంధించిన విషయాలన్నీ వెల్లడించాడు. దస్తగిరి వాంగ్మూలం ప్రకారం భాస్కర్‌రెడ్డి పాత్ర కీలకంగా ఉందని దర్యాప్తులో తేలింది. దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి నిందితులకు 40 కోట్ల రూపాయలు ఇస్తానని ఆఫర్ చేశాడు. ఇదే విషయాన్ని (A-1) నిందితుడు ఎర్ర గంగిరెడ్డి కాల్ చేసి షేక్ దస్తగిరి (A-4), అప్రూవర్‌గా సమాచారం ఇచ్చాడు. అడ్వాన్స్‌గా. సునీల్ యాదవ్ (A-2) ద్వారా నగదు బదిలీ అయింది. వివేకాను 2019 మార్చి 15న ఎర్ర గంగి రెడ్డి (A-1) తో పాటు మరో నలుగురు దుండగులు అతి కిరాతకంగా హత్య చేశారు’’ అని సీబీఐ రిమాండ్ రిపోర్టులో పేర్కొంది.