Horoscope Today : రాశిఫలాలు
ABN , First Publish Date - 2023-11-12T10:24:48+05:30 IST
షాపింగ్ ఉల్లాసం కలిగిస్తుంది. వేడుకల్లో పాల్గొంటారు. అనుకున్న సమయానికి డబ్బు చేతికి అందుతుంది. ఖర్చులు అధికం. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలి...
మేషం (మార్చి 21 - ఏప్రిల్ 20 మధ్య జన్మించిన వారు)
షాపింగ్ ఉల్లాసం కలిగిస్తుంది. వేడుకల్లో పాల్గొంటారు. అనుకున్న సమయానికి డబ్బు చేతికి అందుతుంది. ఖర్చులు అధికం. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలి. ఆర్థిక విషయాల్లో అనుకోని చిక్కులు ఎదురవుతాయి. మహాలక్ష్మీ అష్టోత్తరనామ పారాయణ శుభప్రదం.
వృషభం ( ఏప్రిల్ 21 - మే 20 మధ్య జన్మించిన వారు)
కుటుంబ సభ్యులతో వేడుకల్లో పాల్గొంటారు. సమావేశాలు, వేడుకల్లో మాటపడాల్సి వస్తుంది. ఖర్చులు అంచనాలు మించే అవకాశం ఉంది. కొత్త స్నేహాల వల్ల అనుకోని చిక్కులు ఎదుర్కొంటారు. లక్ష్మీదేవి ఆరాధన శుభప్రదం.
మిథునం (మే 21-జూన్ 21 మధ్య జన్మించిన వారు)
విందు వినోదాల్లో పాల్గొంటారు. సన్నిహితుల వ్యవహారశైలి ఇబ్బంది కలిగిస్తుంది. పరిశ్రమలు, హోటల్, హాస్టల్ రంగాల వారు లక్ష్య సాధనకు అధికంగా శ్రమించాల్సి వస్తుంది. వైద్యరంగంలోని వారికి శుభప్రదం. ఆదిత్య హృదయపారాయణ మంచిది.
కర్కాటకం (జూన్ 22 - జూలై 23 మధ్య జన్మించిన వారు)
టెలివిజన్, అడ్వర్టయిజ్‌మెంట్, పొదుపు సంస్థలు, క్రీడల రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ప్రియతములతో ఉల్లాసంగా గడుపుతారు. కుటుంబ సభ్యుల కోసం ఖర్చులు అధికం. ఆర్థిక విషయాల్లో తొందరపాటు తగదు. దేవీ ఖడ్గమాలా స్తోత్ర పారాయణ శుభప్రదం.
సింహం (జూలై 24 - ఆగస్టు 23 మధ్య జన్మించిన వారు)
వేడుకలు, విందులు ఉల్లాసం కలిగిస్తాయి. రియల్ ఎస్టేట్, నిర్మాణరంగాలకు చెందిన వారికి కొన్ని అవాంతరాలు ఎదురవుతాయి. తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. కుటుంబ సభ్యులతో సమయం గడిపే ప్రయత్నం చేస్తారు. అమ్మవారి ఆలయాన్ని దర్శించండి.
కన్య (ఆగస్టు 24 - సెప్టెంబరు 23 మధ్య జన్మించిన వారు)
అన్నదమ్ములు, మిత్రులతో ఉ ల్లాసంగా గడుపుతారు. ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించాలి. కాంట్రాక్టులు, అగ్రిమెంట్లకు ఇది సమయం కాదు. రవాణా, బోధన, స్టేషనరీ, ఏజెన్సీ, మార్కెటింగ్ రంగాల వారు జాగ్రత్తలు పాటించాలి. దుర్గామాత ఆలయాన్ని దర్శించండి.
తుల (సెప్టెంబరు 24 - అక్టోబరు 23 మధ్య జన్మించిన వారు)
పెట్టుబడులు, ఆర్థిక లావాదేవీల్లో కొంతమేర లాభాలు గడిస్తారు. ఖర్చులు అదుపుతప్పే అవకాశం ఉంది. ఆర్థిక విషయాల కారణంగా మనస్ఫర్ధలు వస్తాయి. విలువైన వస్తువుల కొనుగోలు చేస్తారు. లక్ష్మీదేవి ఆరాధన శుభప్రదం.
వృశ్చికం (అక్టోబరు 24 - నవంబరు 22 మధ్య జన్మించిన వారు)
అనుకున్న పనులకు ఆటంకాలు ఎదురుకావడంతో మనసు చికాకుగా ఉంటుంది. కొత్త పనుల ప్రారంభానికి ఇది సమయం కాదా. అనవసర విషయాల్లో జోక్యం తగదని గ్రహించండి. మీ ఆలోచనలు సమీక్షించుకుంటారు. దుర్గామాత ఆలయాన్ని దర్శించండి.
ధనుస్సు (నవంబరు 23 - డిసెంబరు 21 మధ్య జన్మించిన వారు)
దూరప్రయాణాలు, వేడుకలకు అనుకూలం. అనవసరమైన అపనిందుల ఎదుర్కోవాల్సి రావచ్చు. సినిమాలు, రాజకీయ రంగాల వారు జాగ్రత్తలు పాటించాలి. దూరంలో ఉన్న బంధుమిత్రులకు సంబంధించిన ఒక సమాచారం అందుకుంటారు.
మకరం (డిసెంబరు 22-జనవరి 20 మధ్య జన్మించిన వారు)
బృందకార్యక్రమాలు ఉ ల్లాసం కలిగిస్తాయి. స్టాక్‌మార్కెట్ లావాదేవీలు, పెట్టుబడుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. రుణప్రయత్నాలు ఫలించకపోవచ్చు. ఆర్థిక విషయాల్లో బంధుమిత్రుల నుంచి మొహమాటం ఎదురయ్యే అవకాశం ఉంది. లలితా అష్టోత్తర నామ స్తోత్ర పారాయణ మంచిది.
కుంభం (జనవరి 21 - ఫిబ్రవరి 19 మధ్య జన్మించిన వారు)
ప్రముఖులను కలుసుకుంటారు. పెద్దల సహకారంతో లక్ష్య సాధనకు ప్రయత్నిస్తారు. మీ గౌరవ మర్యాదలకు భంగం కలిగే అ వకాశం ఉంది. తల్లిదండ్రులుగా చిన్నారుల విషయంలో మీ బాధ్యతలు నిర్వర్తిస్తారు. లక్ష్మీదేవిని ఆరాధించండం.
మీనం (ఫిబ్రవరి 20 - మార్చి 20 మధ్య జన్మించిన వారు)
బంధుమిత్రులతో వేడుకల్లో పాల్గొంటారు. రవాణా, పోలీస్, విద్యారంగాల వారు జాగ్రత్తలు పాటించాలి. పైచదువుల కోసం చేసే ప్రయత్నాల్లో చిన్న పొరపాట్ల దొర్లే అవకాశం ఉంది. ఆదిత్య హృదయ పారాయణ శుభప్రదం.
- బిజుమళ్ళ బిందుమాధవ శర్మ