Home » Horoscope
మేషం (మార్చి 21 - ఏప్రిల్ 20 మధ్య జన్మించిన వారు) ఆర్థిక విషయాల్లో పెద్దల సహకారం అందుకుంటారు. బ్యాంకులతో లావాదేవీలకు అనుకూలం. యూనియన్ కార్యకలాపాల్లో పాల్గొంటారు. ఊరేగింపులు, ప్రదర్శనల్లో కీలకపాత్ర పోషిస్తారు. వేడుకల్లో ఉ ల్లాసంగా గడుపుతారు.
వృషభం ( ఏప్రిల్ 21 - మే 20 మధ్య జన్మించిన వారు)డ రాజకీయ రంగంలోని వారు ఉన్నత పదవులు అందుకుంటారు. కన్సల్టెన్సీ, రవాణా, బోధన, రక్షణ రంగాల వారికి వృత్తిపరంగా ప్రోత్సాహకరంగా వుంటుంది. ప్రమోషన్లు, గౌరవ పదవుల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. శ్రీ దత్త కవచ పారాయణ శుభప్రదం.
మిథునం (మే 21-జూన్ 21 మధ్య జన్మించిన వారు) కమ్యూనికేషన్లు, ఉన్నత విద్య, ఆడిటింగ్ రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరగా ఉంటుంది. సమావేశాలు, వేడుకల్లో బంధుమిత్రులను కలుసుకుంటారు. చర్చలు, ప్రయాణాల్లో మంచి ఫలితాలు సాధిస్తారు. ప్రయాణాలకు అవసరమైన నిధులు సర్దుబాటవుతాయి.
కర్కాటకం (జూన్ 22 - జూలై 23 మధ్య జన్మించిన వారు) సన్నిహితుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. బీమా, మెడికల్ క్లెయిములకు సంబంధించిన వ్యవహారాలు పరిష్కారం అవుతాయి. ప్రియతముల కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆర్థిక వ్యవహారాలను సమీక్షించుకుంటారు. ఆంజనేయ స్వామిని ఆరాధించండి.
సింహం ( జూలై 24 - ఆగస్టు 23 మధ్య జన్మించిన వారు) సమావేశాలు, వేడుకల్లో కీలకపాత్ర పోషిస్తారు. నూతన భాగస్వామ్యాలకు అనుకూలం. కొత్త పరిచయాలు లక్ష్య సాధనకు ఉపకరిస్తాయి. స్టాక్‌మార్కెట్ లావాదేవీలు, పందాలు, పోటీల్లో నిదానం అవసరం. సన్నిహితులతో విందు వినోదాల్లో పాల్గొంటారు.
కన్య (ఆగస్టు 24 - సెప్టెంబరు 23 మధ్య జన్మించిన వారు) సేవలు, వ్యవసాయం, పరిశ్రమలు, డెయిరీ రంగాల వారు సృజనాత్మకంగా వ్యవహరించి లక్ష్యాలు సాధిస్తారు. ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. ఆహార నియమాలు పాటిస్తారు. చిన్నారులు, ప్రియతములతో విందుల్లో పాల్గొంటారు.
తుల (సెప్టెంబరు 24 - అక్టోబరు 23 మధ్య జన్మించిన వారు) క్రీడలు, సృజనాత్మక రంగాల వారికి అనుకూలమైన రోజు. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవం. చిన్నారులు, విద్యార్థుకు శుభప్రదం. విద్యాసంస్థల్లో ప్రవేశం లభిస్తుంది. పెట్టుబడలపై మంచి ప్రతిఫలాలు అందుకుంటారు.
వృశ్చికం (అక్టోబరు 24 - నవంబరు 22 మధ్య జన్మించిన వారు) రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాల వారికి అనుకూలం. ఇల్లు, స్థలం మార్పునకు సంబంధించిన చర్చలు ఫలిస్తాయి. ఇంటికి అ వసరమైన వస్తువులు సమకూర్చుకుంటారు. అగ్రిమెంట్లకు అనుకూలమైన రోజు. అన్నదమ్ముల వైఖరిలో మార్పు గమనిస్తారు.
ధనుస్సు (నవంబరు 23 - డిసెంబరు 21 మధ్య జన్మించిన వారు) పాఠశాలలు, మార్కెటింగ్, ట్రెయినింగ్, ట్రాన్స్పోర్ట్, స్టేషనరీ రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఫీజులు చెల్లించేందుకు అ వసరమైన నిధులు సమకూర్చుకుంటారు. కాంట్రాక్టులు, అగ్రిమెంట్లకు అనుకూలం. విలువైన పత్రాలు అందుకుంటారు.
మకరం (డిసెంబరు 22-జనవరి 20 మధ్య జన్మించిన వారు) ఆర్థిక వ్యవహారాల్లో అనుకూల ఫలితాలు వస్తాయి. కొత్త ఆదాయ మార్గాలను అన్వేషిస్తారు. పెండింగ్ బిల్లులు మంజూరు అవుతాయి. చిట్ఫండ్లు, ఆర్థిక సంస్థల వారికి ప్రోత్సాహకరంగా వుంటుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.
కుంభం (జనవరి 21 - ఫిబ్రవరి 19 మధ్య జన్మించిన వారు) కొత్త పరిచయాలు లాభిస్తాయి. మనసు ఉల్లాసంగా వుంటుంది. దూర ప్రయాణాలు, ఉన్నత విద్యా విషయాలపై ఒక నిర్ణయానికి వస్తారు. వ్యక్తిగత సౌకర్యాలు గురించి ఆలోచిస్తారు. సంకల్పం ఫలిస్తుంది. శ్రీ దక్షిణామూర్తి స్తోత్ర పారాయణ శుభప్రదం.
మీనం(ఫిబ్రవరి 20 - మార్చి 20 మధ్య జన్మించిన వారు) దూరంలో వుండే బంధుమిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. ప్రయాణాలు, చర్చలు ఉల్లాసం కలిగిస్తాయి. ఉన్నత విద్య, విదేశీ ప్రయాణాలకు అవసరమైన నిధులు సర్దుబాటవుతాయి. గత అనుభవం లక్ష్య సాధనకు తోడ్పడుతుంది. సాయిబాబా ఆలయాన్ని దర్శించండి.
మేషం అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం ఆదాయానికి తగ్గట్టుగా లెక్కలు వేసుకుంటారు. పరిస్థితులు అను కూలిస్తాయి. అవిశ్రాంతంగా శ్రమిస్తారు. పరిచయాలు బలపడతాయి. బుధవారం నాడు అనుకున్న పనులుసాగవు. ఒత్తిడికి గురి కాకుండా చూసుకోండి. ఏ విషయాన్నీ తీవ్రంగా పరిగణించవద్దు. నగదు చెల్లింపుల్లో జాగ్రత్త. ఆరోగ్యం పట్ల అశ్రద్థ తగదు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొం టారు. ఏకాగ్రతతో వాహనం నడపండి.
వృషభం కృత్తిక 2,3,4; రోహిణి, మృగశిర 1,2 పాదాలు ఓర్పు, పట్టుదలతో శ్రమించండి. యత్నాలు విరమించుకోవద్దు. పరిస్థితులు త్వరలో చక్కబడతాయి. రావలసిన ధనం అందుతుంది. ప్రముఖులకు కానుకలు అందిస్తారు. చేపట్టిన పనులు సానుకూలమవుతాయి. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. తరుచూ సన్ని హితులతో సంభాషిస్తుంటారు. అనవసర విష యాల్లో జోక్యం తగదు. శుక్రవారం నాడు కొత్త సమస్యలెదురయ్యే సూచనలున్నాయి.
మిథునం మృగశిర 3,4; ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు ఆర్థికలావాదేవీలు సంతృప్తిని స్తాయి. వ్యవహారాల్లో కీలక నిర్ణయాలు తీసు కుంటారు. కొన్ని ఇబ్బందుల నుంచి బయట పడతారు. ఖర్చులు విపరీతం. పత్రాలు, రశీదులు జాగ్రత్త. పిల్లల భవిష్యత్తుపై దృష్టి పెడతారు. ఏకాగ్రత తగ్గకుండా చూసుకోండి. కొత్త పనులు మొదలెడతారు. శనివారం నాడు ప్రముఖుల సందర్శనం వీలుపడదు. కొందరి రాక ఇబ్బంది కలిగిస్తుంది. దైవదర్శనాలు సంతృప్తినిస్తాయి.
కర్కాటకం పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష కార్యసాధనకు మరింత శ్రమించాలి. పట్టింపులకు పోవద్దు. లౌక్యంగా మెలగండి. అవకాశాలను తక్షణం అంది పుచ్చుకోండి. ఆర్భాటాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. ఆది, సోమవారాల్లో పనులు మందకొడిగా సాగుతాయి. సామ రస్యంగా మెలగండి. చిన్న విషయాన్ని పెద్దది చేసుకోవద్దు. ఆత్మీయులతో సంభాషిస్తారు. పరిచయం లేని వ్యక్తులతో జాగ్రత్త. ఆంతతరంగిక విషయాలు వెల్లడించవద్దు.
సింహం మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం మనోధైర్యంతో మెలగండి. కృషి ఫలించకున్నా శ్రమించామన్న తృప్తి ఉంటుంది. ఏ విషయాన్నీ సమస్యగా భావిం చవద్దు. మనోధైర్యంతో యత్నాలు సాగిం చండి. పరిస్థితులు త్వరలో చక్కబడతాయి. గృహోపకరణాలు, విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు. కీలక పత్రాలు జాగ్రత్త. మంగళవారం నాడు పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. ఫోన్ సందేశాలను నమ్మవద్దు.
కన్య ఉత్తర 2,3,4; హస్త, చిత్త 1,2 పాదాలు నిర్దేశిత ప్రణాళికలతో యత్నాలు సాగిస్తారు, పరిస్థితులు అను కూలిస్తాయి. సమర్థతను చాటుకుంటారు. ఇతరుల కోసం విపరీతంగా వ్యయం చేస్తారు. వాయిదాపడుతూ వస్తున్న పనులు ఎట్టకేలకు పూర్తవుతాయి. గురువారం నాడు అందరితోను మితంగా సంభాషించండి. ఒకరి వద్ద మరొకరి ప్రస్తావన తగదు. మీమాటలు చేరవేేస వారున్నారని గమనించండి. ఆకస్మిక ప్రయాణం తలపెడతారు.
తుల చిత్త 3,4; స్వాతి, విశాఖ 1,2,3 పాదాలు దృఢసంకల్పంతో యత్నాలు సాగిస్తారు. అవకాశాలు కలిసివస్తాయి. ఉల్లాసంగా గడుపుతారు. ఆదాయానికి తగ్గట్టుగా ప్రణాళికలు వేసుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. పరిచయాలు బలపడతాయి. దూరపు బంధువులతో సంభాషిస్తారు. శని వారం నాడు చెల్లింపులు, నగదు స్వీకరణలో జాగ్రత్త. అనవసర జోక్యం తగదు. వేడుక తలపెడతారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.
వృశ్చికం విశాఖ 4వ పాదం; అనూరాధ, జ్యేష్ఠ సంప్రదింపులు కొలిక్కి వస్తాయి. రుణవిముక్తులవుతారు. ఆదాయం సంతృప్తికరం. విలాసాలకు వ్యయం చేస్తారు. గృహంలో స్తబ్థత తొలగుతుంది. చిరకాల మిత్రులను కలుసుకుంటారు. గత సంఘ టనలు అనుభూతినిస్తాయి. ఆది, సోమ వారాల్లో పనులు మందకొడిగా సాగుతాయి. కొత్తవ్యక్తులతో మితంగా సంభాషించండి. ముఖ్యమైన విషయాల్లో ఒత్తిడికి గురికావద్దు. వేడుకలో పాల్గొంటారు.
ధనుస్సు మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం ఈ వారం గ్రహస్థితి అను కూలంగా ఉంది. ేస్నహసంబంధాలు బలపడతాయి. ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. పనులు చురుకుగా సాగు తాయి. వాహనం కొనుగోలు చేస్తారు. కీలక పత్రాలు జాగ్రత్త. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. వేడుక తలపెడతారు. మీ సాయంతో ఒకరికి మేలు జరుగుతుంది. ప్రముఖులకు శుభాకాంక్షలు, కానుకలు అందిస్తారు. వ్యతిరేకులతో జాగ్రత్త.
మకరం ఉత్తరాషాఢ 2,3,4; శ్రవణం, ధనిష్ట 1,2 పాదాలు లక్ష్యాన్ని సాధించే వరకు శ్రమించండి. యత్నాలు విరమించుకోవద్దు. మీ కృషి త్వరలోనే ఫలిస్తుంది. స్వయం కృషితోనే కార్యం సాధిస్తారు. మీ ఓర్పు, పట్టుదలలే విజయానికి దోహదపడతాయి. ఆదాయం బాగుంటుంది. ఖర్చులు భారమని పించవు. ఆపన్నులకు సాయం అందిస్తారు. దూరపు బంధుత్వాలు బలపడతాయి. ఆత్మీ యులతో ఉల్లాసంగా గడపుతారు. ఎదురుచూస్తున్న పత్రాలు అందుతాయి.
కుంభం ధనిష్ట 3,4; శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు వ్యవహారాల్లో ఒత్తిడికి గురికావద్దు. అన్ని విధాలా శుభమే జరుగు తుంది. మనోధైర్యంతో యత్నాలు సాగించండి. ఆత్మీయుల వ్యాఖ్యలు కార్యోన్ముఖులను చేస్తాయి. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. ఆలయాలకు విరాళాలు అందిస్తారు. పనులు హడావుడిగా సాగుతాయి. కీలక పత్రాలు అందుకుంటారు. ఇంటి విషయాలపై దృష్టి పెడతారు. వేడుకల్లో పాల్గొంటారు. కొత్త వ్యక్తులతో మితంగా సంభాషించండి.
మీనం పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి వ్యవహారానుకూలత ఉంది. సమయోచిత నిర్ణయాలు తీసుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. పిల్లల భవిష్యత్తుపై దృష్టిపెడతారు. ధనసమస్యలెదురయ్యే సూచ నలున్నాయి. దుబారా ఖర్చులు తగ్గించుకోండి. ఆది, గురువారాల్లో అప్రమత్తంగా ఉండాలి. మీ విషయాల్లో ఇతరుల జోక్యానికి తావివ్వ వద్దు. పత్రాల రెన్యువల్లో అలక్ష్యం తగదు. చిన్న విషయాన్ని పెద్దది చేసుకోవద్దు. ఆప్తుల తో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది.
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1 పాదం) ఆదాయం: 8, వ్యయం:14, రాజపూజ్యం:4, అవమానం: 3 శ్రీ క్రోది నామ సంవత్సరంలో మేషరాశి వారు గృహ నిర్మాణం, స్థల సేకరణ ప్రయత్నాల్లో విజయం సాధిస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. విదేశీయానానికి అనుకూల సమయం. విద్యార్థుల విజయం సాధిస్తారు. కళలు, న్యాయ రంగాలవారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. వ్యాపారంలోని వారు ఆచితూచి ముందడుగు వేయాలి. ఆర్థిక వ్యవహారాల్లో కొంత నెమ్మదిగా పురోగతిని సాధిస్తారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. ఊహించని ఖర్చులు వస్తాయి. అక్టోబర్-డిసెంబర్ మాసాల మధ్య ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆర్థిక విషయాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఈ ఏడాది మే 1 వరకు గురువు మీ జన్మరాశిలో ఆ తర్వాత వృషభ రాశిలో సంచరిస్తాడు. ఫలితంగా సృజనాత్మక ప్రతిభతో వినూత్నమైన ప్రాజెక్టులు చేపడతారు. ప్రమోషన్లకు అవకాశం ఉంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. బదిలీల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. బాంధవ్యాలు బలపడతాయి. ఉదరం, కండరాలకు సంబంధించిన సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఇంట్లో శుభకార్యం జరుగుతుంది. సంతతి విషయంలో శుభపరిణామాలు సంభవం. విద్య, వైజ్ఞానికి సాంస్కృతిక, రాజకీయరంగాల వారికి పురోగతి కనిపిస్తుంది. కుటుంబం విస్తరిస్తుంది. వ్యాపారంలో తగిన జాగ్రత్తలు తీసుకొని ముందడుగు వేయాలి. గురువు వక్రగమనంలో ఉండే అక్టోబర్ 10 నుంచి డిసెంబర్ చివరి వరకు ఆరోగ్యం మెరుగుపడుతుంది. విద్య పట్ల విద్యార్థులు శ్రద్ధ చూపాలి. ఉద్యోగ వ్యాపారాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. మీ జన్మరాశి నుంచి 11వ స్థానంలో శని సంచారం కారణంగా కోర్టు వ్యవహారాలు పరిష్కారం అవుతాయి. ఉద్యోగ ప్రయత్నాల్లో విజయం సాధిస్తారు. వ్యాపారంలో లాభాలు ఆశించిన స్థాయిలో ఉండకపోవచ్చు. విలాసాలకు ఖర్చులు అధికమవుతాయి. ఆరోగ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపాలి. వృత్తి, వ్యాపారాల్లో ఒత్తిడికి లోనవుతారు. షేర్ల లావాదేవీల్లో జాగ్రత్త అవసరం. రుణబాధలు అధికం. సన్నిహితులతో అపార్థాలు పెరుగుతాయి. జూన్ 30 నుంచి నవంబర్ 16 వరకు ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. వాహనాలు నడిపే సమయంలో జాగ్రత్తలు పాటించాలి. అపార్థాలు, మితి మీరిన కోపం, ఆవేశాల కారణంగా సంబంధాలు దెబ్బతింటాయి. కుటుంబ కలహాలు పెరుగుతాయి. పెట్టుబడుల్లో ఆచితూచి వ్యవహరించాలి. బదిలీల కారణంగా అసౌకర్యానికి లోనవుతారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన శుభప్రదం
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి: మృగశిర 1,2 పాదాలు) ఆదాయం: 2, వ్యయం: 8, రాజపూజ్యం:7, అవమానం: 6 వృషభ రాశి వారు శ్రీ క్రోధి నామ సంవత్సరంలో ఆస్తులు పెంపొందించుకుంటారు. ఉద్యోగ, వ్యాపారాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. విదేశీ గమన ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. కళాకారులు, పత్రికలు, టెలివిజన్ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంది. కోర్టు కేసులు వాయిదాపడతాయి. తోబుట్టువుల మధ్య అపార్థాలు పెరిగే అవకాశం ఉంది. అక్టోబర్ - డిసెంబర్ మాసాల మధ్య ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. సంకల్పం నెరవేరుతుంది. గౌరవ, మర్యాదలు పెంపొందుతాయి. ఆరోగ్యం మెరుగవుతుంది. గురువు ఈ ఏడాది మే 1 వరకు వ్యయ స్థానంలో ఆ తర్వాత జన్మరాశిలో సంచారం చేస్తారు. ఫలితంగా విలాసాలకు, దూరప్రయాణాలకు ఎక్కువ సమయాన్ని కేటాయిస్తారు. కీర్తి ప్రతిష్ఠలకు భంగం కలిగే ప్రమాదం ఉంది. అవసరమైన విషయాల్లో తలదూర్చి మాటపడాల్సి రావొచ్చు. పెద్దలు, పైఅధికారుల నుంచి మాటపడాల్సి వస్తుంది. మోకాళ్లు, పాదాలకు సంబంధించిన సమస్యలు తలెత్తుతాయి. అక్టోబర్ 10 నుంచి డిసెంబర్ చివరి వరకు సినీ, రాజకీయ రంగాలవారికి అనుకూలం. ఉన్నత పదవులు అందుకుంటారు. కొత్త ప్రాజెక్టులు చేపట్టి విజయం సాధిస్తారు. టెక్స్‌లైల్స్, కన్సల్టెన్సీ, విదేశీ ప్రాజెక్టులు, ఎగుమతులు, రవాణా, ఉన్నత విద్యారంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. స్నేహబాంధవ్యాలు పెంపొందుతాయి. ఈ ఏడాది మీ జన్మరాశి నుంచి 10వ స్థానంలో శని సంచారం జరుగుతున్నందున ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ప్రమోషన్లు లభిస్తాయి. పైఅధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవం. కోర్టు వ్యవహారాలు పరిష్కారం అవుతాయి. నూనెలు, ద్రవ్యాలు, ఖనిజాలు, చర్మ వ్యాపారులకు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ, వ్యాపారాల్లో ఒత్తిళ్లు అధికం అవుతాయి. వ్యవసాయ రంగంలోని వారికి నష్టం వాటిల్లే అవకాశం ఉంది. భూమి క్రమ విక్రయాల్లో చికాకులు తలెత్తే అవకాశం ఉంది. జూన్ 30-నవంబర్ 15వ తేదీల మధ్య శని వక్రించిన కారణంగా స్వయంకృషి, కార్యదీక్ష, ఓరిమి, ఏకాగ్రత, పట్టుదలతో అవరోధాలు అధిగమిస్తారు. ఈ ఏడాది 11-5 స్థానాల్లో రాహు కేతువుల సంచారం కారణంగా అనవసర ఖర్చలు పెరుగుతాయి. మనసు చికాకుగా ఉంటుంది. ఉన్నత విద్యకై చేసే ప్రయత్నాలు వాయిదా వేసుకోవడం మంచిది. స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీలలో జాగ్రత్త వహించాలి. కొత్త స్నేహాలకు దూరంగా ఉండాలి. ప్రేమ వ్యవహారాల్లో చికాకులు తలెత్తుతాయి. షేర్లు, భాగస్వామ్యాల్లో చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంది. సన్నిహితుల ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది. శ్రీ దుర్గామాత ఆరాధన వల్ల మేలు జరుగుతుంది
మిథునం (మృగశిర 3,4: ఆరుద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) ఆదాయం:5, వ్యయం:5, రాజపూజ్యం:3, అవమానం:6 శ్రీ క్రోధి నామ సంవత్సరంలో మిథున రాశివారికి ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధి కనిపిస్తుంది. కొత్త వ్యాపారాలు ప్రారంభించి విజయం సాధిస్తారు. ప్రముఖులతో పరిచయాలు లాభిస్తాయి. గౌరవ, ప్రతిష్ఠలు పెంపొందుతాయి. కార్యసిద్ధి కలుగుతుంది. వ్యాపారరంగంలోని వారు లాభాలు అందుకుంటారు. ఆర్థిక విషయాల్లో పురోగతి సాధిస్తారు. శుభకార్యాలు జరుగుతాయి. దంపతులు అన్యోన్యంగా ఉంటారు. అక్టోబర్ - డిసెంబర్ మాసాల మధ్య ఆర్థిక వ్యవహారాల్లో కొంత నిరుత్సాహంగా ఉంటుంది. విద్యార్థులకు చదువుల పట్ల శ్రద్ధ లోపిస్తుంది. ప్రయాణాల్లో శ్రమాధిక్యం తప్పకపోవచ్చు. గురువు ఈ ఏడాది 11, 12 స్థానాల్లో సంచరిస్తున్న ఫలితంగా ఆదాయం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో పురోగతి సాధిస్తారు. విద్య, ప్రచురణలు, ప్రకటనలు, బోధన, న్యాయ, సినీ, రాజకీయరంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహం లభిస్తుంది. జూన్ 30 నుంచి వస్త్ర పరిశ్రమ, చలన చిత్రాలు, మత్స్య, రవాణా, టైల్స్, ఫొటోగ్రఫీ, కలప రంగల వారికి అనుకూలం. ఉద్యోగంలో స్థిరత్వం సాధిస్తారు. విదేశాలలో ఉన్నత చదువుల యత్నాలకు ఆటంకాలు ఎదురైనా చివరకు విజయం లభిస్తుంది. గౌరవ, మన్ననలు అందుకుంటారు. శత్రువులు మిత్రులుగా మారతారు. తప్పులు సరిద్దికుని, మీ నడవడికను మార్చుకొని అన్ని రంగాల్లో విజయం సాధిస్తారు. అక్టోబర్ 10 నుంచి డిసెంబర్ చివరి వరకు ఆర్థిక వ్యవహారాల్లో అప్రమత్తంగా వ్యవహరించాలి. కోర్టు వ్యవహారాల వల్ల అసౌకర్యం కలుగుతుంది. విద్యార్థులు చదువల పట్ల శ్రద్ధ చూపాలి. ఈ సంవత్సరం శని 9వ స్థానంలో సంచరిస్తున్న ఫలితంగా శుభకార్యాలకు విఘ్నాలు ఏర్పడుతాయి. పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. భాగస్వామి, పిల్లల విషంయలో చికాకులు పెరుగుతాయి. ధనలాభం కనిపించినా ఖర్చులు అధికం. జూన్ 30 నుంచి నవంబర్ 15 వరకు శని వక్రగమనంలో ఉన్న సమయంలో పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆర్థిక పరిస్థితి కొంత మెరుగుపడుతుంది. స్నేహబాంధవ్యాలు విస్తరిస్తాయి. ఉన్నత విద్యకై చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. శుభకార్యాలు జరుగుతాయి. ఈ ఏడాది 10, 4 స్థానాల్లో రాహు కేతువుల సంచారం ఫలితంగా ప్రయాణాల్లో ఇబ్బందులు ఎదురవుతాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. గృహ నిర్మాణానికి ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. భూముల క్రయవిక్రయాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఉద్యోగ ప్రయత్నాలకు ఆటంకాలు ఎదురవుతాయి. పట్టుదలతో ప్రయత్నించి చివరకు విజయం సాధిస్తారు. ఒత్తిళ్లు ఎదురవుతాయి. శ్రీరామచంద్రమూర్తి ఆధారన శుభాలనిస్తుంది.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష) ఆదాయం: 14, వ్యయం:2, రాజపూజ్య:6, అవమానం:6 కర్కాటక రాశి వారికి శ్రీ క్రోధి నామ సంవత్సరంలో గృహయోగం కలుగుతుంది. ఆస్తులు పెంపొందించుకుంటారు. ఔషధాలు, వైద్యం, ఇన్సూరెన్స్ రంగాల వారు ఆర్థికంగా పురోగతి సాధిస్తారు. వారసత్వం సమస్యలు పరిష్కారం అవుతాయి. కోర్టు వివాదాల్లో విజయం సాధిస్తారు. రాజకీయ, ప్రభుత్వ, సహకార రంగాలకు చెందిన వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. వ్యాపారరంగంలోని వారు లక్ష్యాలు సాధిస్తారు. గురుగ్రహం ఈ ఏడాది జన్మ రాశి నుంచి 10, 11 స్థానాల్లో సంచరిస్తుంది. ఫలితంగా ఉద్యోగ, వ్యాపారాలలో కొన్ని చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఆస్తినష్టం వాటిల్లుతుంది. గౌరవ, మర్యాదలకు భంగం కలిగే ప్రమాదం ఉంది. శతృబాధ అధికం, ఉద్యోగులు పైఅధికారుల నుంచి మాటపడాల్సిన వస్తుంది. అనవసర ఖర్చులు పెరుగుతాయి. కొత్త వ్యాపార ప్రయత్నాలు వాయిదా వేసుకోవడం మంచిది. పెద్దల ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఉంది. అక్టోబర్ 10 నుంచి డిసెంబర్ చివరి వరకు ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. అదనపు ఆదాయం కోసం చేసే యత్నాలు ఫలిస్తాయి. వ్యాపార రంగంలోని వారు లాభాలు అందుకుంటారు. అధికారం, హోదా, గౌరవ ప్రతిష్ఠలు పెరుగుతాయి. రాజకీయరంగం వారు ఉన్నత పదవులు అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. ఈ ఏడాది అష్టమ శని సంచారం పలితంగా ఆరోగ్యం మందగిస్తుంది. అన్ని పనుల్లో ఆటంకాలు, ఆలస్యాలు చికాకు పెడతాయి. డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఖర్చులు అంచనాలు మించుతాయి. రుణ భారం పెరుగుతుంది. అపనిందలు ఎదుర్కోవాల్సి రావొచ్చు. గౌరవ, మర్యాదలకు భంగం కలిగే అవకాశం ఉంది. పెట్టుబడుల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. వ్యాపారంలో ఆర్థికపరంగా ఒడిదుడుకులు ఎదుర్కొంటారు. క్రయ విక్రయాల్లో నిదానం అవసరం. విద్యార్థులకు చదువుల్లో ఆటంకాలు ఏర్పడుతాయి. జూన్ 30 నుంచి నవంబర్ 15 తేదీల మధ్య ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. భూమి లేదా ఇల్లు కొనుగోలు చేస్తారు. ప్రమోషన్ అందుకుంటారు. పాత బకాయిలు వసూలవుతాయి. రుణ యత్నాలు ఫలిస్తాయి. వ్యాపారంలో పురోగతి కనిపిస్తుంది. ఈ ఏడాది 9-3 స్థానాల్లో రాహుకేతువుల సంచారం కారణంగా వాహనాలు నడిపే సమయంలో జాగ్రత్త వహించాలి. విదేశీ ప్రయత్నాలకు ఆటంకాలు ఎదురవుతాయి. ఉద్యగ, వ్యాపారాల్లో చికాకులు అధికం. బదిలీలు, మార్పులు అసౌకర్యం కలిగిస్తాయి. కుటుంబ వ్యవహారాలు అశాంతిని కలిగిస్తాయి. అనవసర ఖర్చులు పెరుగుతాయి. తోబుట్టువులు, బంధుమిత్రులతో సఖ్యత లోపిస్తుంది. శ్రీ ఈశ్వరుడి ఆరాధన శుభ ఫలితాలన్నిస్తుంది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1 పాదం) ఆదాయం: 2, వ్యయం: 14, రాజపూజ్యం:2, అవమానం:2 శ్రీ కోది నామ సంవత్సరంలో సింహ రాశి వారికి వ్యాపారం, ఉద్యోగాల్లో అభివృద్ధి కనిపిస్తుంది. ఇల్లు లేదా స్థిరాస్తి సమకూర్చుకుంటారు. రుణాలు తీర్చే యత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యం మెరుగవుతుంది. విదేవీ గమన యత్నాలు ఫలిస్తాయి. వాహనం కొనుగోలు చేస్తారు. గృహ నిర్మాణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉన్నత పదవులు అందుకుంటారు. షేర్ల లావాదేవీల్లో లాభాలు గడిస్తారు. అక్టోబర్ - డిసెంబర్ మధ్య కాలంలో ఆందోళనలు అధికమవుతాయి. వృత్తిపరమైన ఒత్తిడులకు లోనవుతారు. న్యాయ, ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. గురువు 9, 10 స్థానాల్లో సంచారం చేయడం వల్ల ఉన్నత విద్య, విదేశీ వ్యవహారాలకు అనుకూలం. వృత్తి, వ్యాపారాల్లో శుభపరిణామాలు సంభవం. ప్రమోషన్లు సాధిస్తారు. వ్యాపార విస్తరణకు అనుకూలం. న్యాయ, ఆధ్యాత్మిక, బోధన, పత్రికలు, పోలీసులు, మిలిటరీ, కన్సల్టెన్సీ ఆడిటింగ్, కళారంగాల వారికి ప్రోత్సాహకరం. సంతానప్రాప్తికి అనుకూలం. ఉన్నత విద్య, విదేశీ వ్యవహారాలు, రవాణా, ప్లానింగ్, శిక్షణ రంగల వారు లక్ష్యాలు సాధిస్తారు. రాజకీయ రంగంలోని వారికి ఉన్నత పదవులు లభిస్తాయి. పెద్దల సహకారంతో అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. అక్టోబర్ 10 నుంచి డిసెంబర్ చివరి దాకా మీ పురోగతి చూసి అసూయపడేవారు పెరుగుతారు. పెట్టుబడుల్లో జాగ్రత్త వహించాలి. ఈ ఊడాది సప్తమ స్థానంలో శని సంచారం ఫలితంగా వ్యాపార విస్తరణ యత్నాలు నెమ్మదిగా ఫలిస్తాయి. సంకల్ప సాధనలో ఆలస్యమైనా చివరకు ఫలితం సాధిస్తారు. వైవాహిక జీవితంలో చికాకులు ఎదురయ్యే అవకాశం ఉంది. అనుకోని బాధ్యతలు భూజానికి ఎత్తుకోవాల్సి రావొచ్చు. పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. వాహనాలు నడిపే సమయంలో జాగ్రత్తగా ఉండాలి. షేర్ మార్కెట్ లావాదేవీల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. విలాసాలకు, చెడు స్నేహాలకు దూరంగా ఉండాలి. బంధు, మిత్రుల నుంచి మాటపడాల్సి వస్తుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం, వివాహ ప్రయత్నాలకు ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. జూన్ 30 - నవంబర్ 15 మధ్య వేడుకలు, శుభకార్యాలకు అవకాశం ఉంది. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. స్పెక్యులేషన్లు లాభిస్తాయి. జనసంబంధాలు విస్తారిస్తాయి. 8-2 స్థానాల్లో రాహు, కేతువుల సంచారం కారణంగా అనవసర ఖర్చులు పెరుగుతాయి. అపనిందలకు గురికావాల్సి వస్తుంది. అన్ని విషయాల్లో దూకుడు తగ్గించాలి. ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలి. ఆర్థిక విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు తగవు. క్రయవిక్రయాలకు అనుకూలం కాదు. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. ఆహార నియమాలు పాటించాలి. శ్రీ సుబ్రహ్మణ్యస్వామి ఆరాధనతో శుభం కలుగుతుంది.
కన్య(ఉత్తర 2,3,4; హస్త; చిత్త 1,2 పాదాలు) ఆదాయం: 5, వ్యయం:5 రాజపూజ్యం:5, అవమానం: 2 కన్యా రాశి వారు శ్రీ క్రోధి నామ సంవత్సరంలో ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తారు. ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధి పిస్తుంది. పై చదువులు చదివేందుకు, విదేశీ గమనానికి అనుకూలం గృహనిర్మాణ ప్రయత్నాలు ఫలిస్తాయి. వివాహయత్నాలు సఫలమవుతాయి. వైద్యం, పార్మా, ప్రకటనలు, కన్సల్టెన్సీలు, ఏజెన్సీలు, రాజకీయ, కళా, సినీ, రక్షణ, విద్య ఐ.టి. రంగాల వారికి ప్రోత్సాహకరం, రుణ యత్నాలు ఫలిస్తాయి. అనుకున్న పనులు పరిమితో పూర్తి చేస్తారు. అక్టోబరు -డిసెంబరు మాసాల మధ్య ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఆరోగ్యంపై శ్రద్ధ చూపించాలి. విలువైన వస్తువులు కోల్పోవచ్చు. ఈ సంవత్సరం గురువు 2. 9 స్థానాల్లో సంచరిస్తున్న ఫలితంగా ఆరోగ్యం మెరుగుపడుతుంది. రుణదాతల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. మీ గౌరవ ప్రతిష్ఠలకు భంగం కలిగే అవకాశం ఉంది. మే 1 నుంచి ఉన్నత చదువుల కోసు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. అయితే అందు కోసం ఖర్చులు అధికమవుతాయి. న్యాయ వివాదాల్లో విజయం సాధిస్తారు. విద్యార్థులకు అనుకూలం. ఆస్తి వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. అక్టోబర్ 10 నుంచి డిసెంబరు చివరి వరకు విద్యార్థుల చదువులు మందకొడిగా సాగుతాయి. గౌరవ మర్యాదలు అందుకుంటారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. వైద్యం, ఔషధ రంగాల వారు ఆచితూచి వ్యవహరించాలి. బంధుమిత్రుల నుంచి మాటపడాల్సి రావచ్చు. శని ఈ సంవత్సరం 6వ స్థానంలో సంచరిస్తున్న ఫలితంగా వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన పురోగతి సాధిస్తారు శ్రమకు తగిన ప్రతిఫలం అందుకుంటారు. వివాహ యత్నాలు ఫలిస్తాయి. ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తారు. వ్యాపార విస్తరణకు అవకాశం ఉంది. కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. వైద్యం, పార్మా రంగాల వారికి ప్రోత్సాహకరం. గృహనిర్మాణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆస్తి వ్యవహారాల్లో పెద్దలు సలహాలు తీసుకుని ముందడుగు వేసి విజయం సాధిస్తారు. జూన్ 30 నుంచి నవంబరు 15 వరకు శని వక్రగమనంలో ఉన్న ఫలితంగా పెట్టుబడుల్లో నష్టం సంభవించే అవకాశం ఉంది. రుణ బాధలు అధికం అవుతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ చూపించాలి. ఉద్యోగులు అదనపు బాధ్యతలు భుజానికి ఎత్తుకోవాల్సివస్తుంది. ఆస్తి కొనుగోలు వ్యవహారాలు వాయిదా వేయడం మంచిది. ఈ ఏడాది 7-1 స్థానాల్లో రాహు కేతువుల సంచారం కారణంగా ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలి. వివాహ యత్నాలకు ఆటంకాలు ఎదురవుతాయి. స్పెక్యులేషన్లలో నెమ్మది పాటించాలి. ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం. వివాహ సంబంధాల్లో ఒడిదుదుకులు ఎదురవుతాయి. ప్రేమానుబంధాలు బెడిసి కొట్టి అవకాశం ఉంది. ఏ విషయం మీదా దృష్టి -కేంద్రీకరించలేకపోతారు. శ్రీ ఆంజనేయస్వామి ఆరాధన సత్ఫలితాలను ఇస్తుంది.
తుల రాశి (చిత్త 3.4; స్వాతి; విశాఖ 1,2,3 పాదాలు) ఆదాయం: 2, వ్యయం:8 రాజపూజ్యం: 1, అవమానం:5 శ్రీ క్రోధి నామ సంవత్సరంలో తులారాశి వారు ఆస్తి పాస్తులు పెంపొందించుకుంటారు. సంకల్పం సిద్ధిస్తుంది. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధి కనిపిస్తుంది. వివాహాది శుభకార్యాలు జరుగుతాయి. ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. ఆరోగ్యం 'మెరుగుపడుతుంది. వాహనం కొనుగోలు చేస్తారు. బ్యాంకు డిపాజిట్లు, షేర్ల లావాదేవీలపై మంచి ప్రతిఫలాలు అందుకుంటారు. కొత్త పరిచయాలు వల్ల లబ్ధి పొందుతారు. అక్టోబరు - డిసెం బరు మాసాల మధ్య ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. పోటీలు, షేర్ల లావాదేవీల్లో జాగ్రత్త అవసరం. ఈ ఏడాది 7, 8 స్థానాల్లో గురుసంచారం ఫలితంగా వివాహాది శుభకార్యాలు జరుగుతాయి. వ్యాపార విస్తరణ యత్నాలు ఫలిస్తాయి. శ్రీవారు, శ్రీమతి విషయాలలో పురోగతి కనిపిస్తుంది. స్నేహితులు, బంధువులు లక్ష్య సాధనలో సహకరిస్తారు. స్పెక్యులేషన్లు, షేర్ల లావాదేవీల్లో లాభాలు గడిస్తారు. రుణాలు తీర్చగలుగుతారు. ఉమ్మడి వ్యాపారం కలిసివస్తుంది. విద్యార్థులకు శుభప్రదమైన కాలం. విదేశీ ప్రయాణాలు చేస్తారు. ప్రకటనలు, ఏజెన్సీ రంగాల వారికి అనుకూలం. రాజకీయ, సినీ, రవాణా, విద్య, ఐ.టి. రంగాల వారికి ప్రోత్సాహకరం. గురువు వక్ర గమనంలో ఉన్న అక్టోబరు 10 నుంచి డిసెంబరు చివరి వరకు వైవాహిక జీవితంలో చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంది. వ్యాపారంలో ఇబ్బందులు ఎదురవుతాయి. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు అవసరం. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. ఈ ఏడాది 5వ స్థానంలో శని సంచారం కారణంగా ప్రేమ వ్యవహారాలు, చిన్నారులకు సంబంధించిన చికాకులు పెరుగుతాయి. విద్యార్థులు అశ్రద్ధ కారణంగా నష్టపోతారు. వ్యాపారాల విస్తరణకు, కొత్త ప్రాజెక్టుల ప్రారంభానికి అనుకూలం కాదు. రావలసిన డబ్బు సకాలంలో చేతికి అందదు. ప్రియతములతో భేదాభిప్రాయాలు తలెత్తుతాయి. వాహనాలు నడిపే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. పెద్దల ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అవసరం. శని వక్రగమనంలో ఉన్న జూన్ 30 . నవంబర్ 15 తేదీల మధ్య వృత్తి, వ్యాపారాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఫార్మా, వైద్యం, రిటైల్, హోటల్ రంగాల వారికి శుభప్రదం. క్రీడాకారులకు అనుకూలం. ఈ ఏడాది 6 - 12 స్థానాల్లో రాహుకేతువుల సంచారం కారణంగా స్నేహ బాంధవ్యాల్లో సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. వైవాహిక జీవితంలో చిక్కులు ఎదురవుతాయి. తీవ్రమైన ఒత్తిడికి లోనవుతారు. ఆరోగ్యంపై శ్రద్ధ చూపించాలి. రుణబాధలు అధికమవుతాయి. తొందరపాటు నిర్ణయాలతో ఆరికంగా నషం వచ్చే ప్రమాదం ఉంది. ఉదర సంబంధమైన సమస్యలు ఎదుర్కొంటారు. శ్రీ పార్వతీదేవి ఆరాధన శుభ ఫలితాలనిస్తుంది.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ఠ) ఆదాయం : 8, వ్యయం: 14; రాజపూజ్యం : 4, అవమానం : 5 శ్రీ క్రోధి నామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారు ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధి సాధిస్తారు. కష్టానికి తగిన ప్రతిఫలం అందుకుంటారు. భూమి కొనుగోలు చేస్తారు. పెద్దలు, ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. వివాహయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులకు శుభప్రదం. బ్యాంకింగ్, షేర్ మార్కెట్ రంగాల వారికి ప్రోత్సాహకరం. అక్టోబరు - డిసెంబరు మాసాల మధ్య ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలి. పెట్టుబడుల్లో ఆచితూచి ముందడుగు వేయాలి. ఉన్నత చదువుల కోసం చేసే ప్రయత్నాలకు ఆటంకాలు ఎదురవుతాయి. ఈ ఏడాది మీ జన్మరాశి నుంచి 6, 7 స్థానాల్లో గురు సంచారం ఫలితంగా ఉద్యోగ, వృత్తి, వ్యాపారాల్లో పురోగతి కనిపిస్తుంది. ఆత్మవిశ్వాసంతో చేసే యత్నాలు సఫలమవుతాయి. వ్యవసాయం, పరిశ్రమల రంగాల వారికి అనుకూలం. హోటల్, ఆహార ఉత్పత్తులు, ఔషధాలు, ఆస్పత్రులు, కేటరింగ్, నిత్యావసరాలు రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలి. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. న్యాయ వివాదాలు పరిష్కారం అవుతాయి. ఉమ్మడి వ్యాపారం లాభిస్తుంది. కుటుంబ సమస్యలు ఒక కొలిక్కి వస్తాయి. సంతానప్రాప్తికి అవకాశం ఉంది. ఉన్నత చదు వుల్లో విజయం సాధిస్తారు. స్నేహ బాంధవ్యాలు పెరుగుతాయి. రుణాలు తీరుస్తారు. అక్టోబరు 10 నుంచి డిసెంబరు చివరి వరకు ఆరోగ్యం మెరుగుపడుతుంది. పెట్టుబడుల నుంచి మంచి ప్రతిఫలం అందుకుంటారు. ఈ ఏడాది 4వ స్థానంలో శని గ్రహ సంచారం ఫలితంగా అనుకున్న చోటికి బదిలీ అవుతారు. ప్రమోషన్లు అందుకుంటారు. ఉద్యోగ యత్నాలు ఫలిస్తాయి. తోబుట్టువుల మధ్య ఉన్న అపోహలు తొలగిపోతాయి. రియల్ ఎస్టేట్ రంగం వారికి ప్రోత్సాహకరం. హార్డ్‌వేర్, కలప, ఫర్నిచర్ వ్యాపారులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. శని వక్రించిన జూన్ 30 - నవంబర్ 15 తేదీల మధ్య ప్రతి పనిలో ఆలస్యం, ఆటంకాలు ఎదురవుతాయి. చదువుల పట్ల అశ్రద్ధ చూపే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాల్లో ఓరిమితో అందరినీ ఒప్పించేందుకు యత్నిస్తారు. ఉన్నత విద్య కోసం చేసే యత్నాలు నెమ్మదిగా ఫలిస్తాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆచితూచి వ్యవహరించాలి. ఈ ఏడాది 5-11 స్థానాల్లో రాహు కేతువుల సంచారం వల్ల వ్యాపారంలో పురోగతి కనిపిస్తుంది. కొన్ని విషయాల ద్వారా లాభపడతారు. సంతానం నుంచి లబ్ధి పొందుతారు. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. అయితే స్నేహాలు తగ్గించుకోవాల్సి ఉంటుంది. విద్యార్థులు లక్ష్య సాధన కోసం అధికంగా శ్రమించాల్సి రావచ్చు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. క్రయవిక్రయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఒత్తిళ్లు అధికమౌతాయి. శ్రీ దత్తాత్రేయస్వామి ఆరాధన శుభ ఫలితాలనిస్తుంది.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పాదం) ఆదాయం : 11, వ్యయం: 5; రాజపూజ్యం 7, అవమానం : 1 ధనుస్సు రాశి వారు శ్రీ క్రోధి నామ సంవత్సరంలో ఉద్యోగ, వ్యాపారాల్లో సత్ఫలితాలు సాధిస్తారు. ఉద్యోగ యత్నాలు ఫలిస్తాయి. భూమి కొనుగోలు చేస్తారు. బదిలీలకు ఆనుకూలం. పెద్దలతో పరిచయాలు ఏర్పడతాయి. వారి సహకారంతో లక్ష్యాలు సాధిస్తారు. వివాహాది శుభకార్యాలు జరుగుతాయి. సంతానప్రాప్తికి అనుకూలం. ఆరోగ్యం మెరుగుపడుతుంది. అక్టోబరు డిసెంబరు మాసాల మధ్యకాలంలో ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలి. వ్యవసాయం, పరిశ్రమల రంగాల వారికి ఆటంకాలు ఎదురవుతాయి. ఉద్యోగులు, వ్యాపారులు అప్రమత్తంగా వ్యవహరించాలి. 5-6 స్థానాల్లో గురువు సంచారం కారణంగా ఈ ఏడాది ఉన్నత విద్యాయత్నాలు ఫలిస్తాయి. వాయిదాపడుతున్న పనులు పూర్తి చేస్తారు. ఆర్థిక విషయాల్లో పట్టుదలతో వ్యవహరించి లక్ష్యాలు సాధిస్తారు. మీ ప్రతిభకు తగిన అవకాశాలు లభిస్తాయి. శాస్త్ర, విజ్ఞానరంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. పిల్లల విద్య, వృత్తి, వివాహ విషయాలలో అభివృద్ధి కనిపిస్తుంది. పెద్దలతో పరిచయాలు లాభిస్తాయి. బాకీలు తీర్చగలుగుతారు. స్నేహానుబంధాలు బలపడతాయి. బ్యాంకింగ్, ఫైనాన్స్, విద్యాసంస్థలు, సినిమాలు, ప్రకటనలు, టెలివిజన్, క్రీడలు, సృజనాత్మక రంగాల వారు సత్ఫలితాలు సాధిస్తారు. గురువు పక్ర గమనంలో ఉన్న అక్టోబరు 10 నుంచి డిసెంబరు చివరి వరకు విద్య, ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలి. ఉదర సంబంధమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. మీ జన్మరాశి నుంచి 3వ స్థానంలో శని సంచారం ఫలితంగా బదిలీలు, సీట్ల మార్పిడి ప్రయత్నాల్లో విజయం సాధిస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇల్లు, స్థలం కొనుగోలు చేస్తారు. కొత్త ప్రాజెక్టులు చేపట్టేందుకు ప్రయత్నిస్తారు. తోబుట్టువులు, సన్నిహితులతో విభేదాలు పరిష్కారం అవుతాయి. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు అందుకుంటారు. ఆరోగ్యం మెరుగవుతుంది. శని వక్ర గమనంలో ఉన్న జూన్ 30 - నవంబర్ 15 తేదీల మధ్య కుటుంబ విషయాల్లో చికాకులు అధికం. సంతానం విషయాలు ఆందోళన కలిగిస్తాయి. విద్యార్థులకు చదువుల పట్ల అశ్రద్ధ పెరుగుతుంది. విలాసాలకు వెచ్చిస్తారు. ఆస్తి సమస్యలు తలెత్తుతాయి. ఇంట్లో, కార్యాలయంలో బాధ్యతలు అధికం. కండరాలకు సంబంధించిన సమస్యలు బాధిస్తాయి. ఈ ఏడాది 4 - 10 స్థానాల్లో రాహుకేతువుల సంచార ఫలితంగా వాహనయోగం కలుగుతుంది. ఉద్యోగంలో పురోగతి కనిపిస్తుంది. ఉద్యోగ, వ్యాపారాల్లో స్వల్ప ఒత్తిడి ఎదురైనా పెద్దల సహకారంతో లక్ష్యాలు సాధిస్తారు. ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. ఇల్లు, స్థల సేకరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. పిల్లల విషయంలో శ్రద్ధ చూపాల్సిన అవసరం ఉంది. శ్రీ సరస్వతీ మాత ఆరాధనతో పురోగతి సాధిస్తారు.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4; శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) ఆదాయం 14, వ్యయం: 14; రాజపూజ్యం: 3, అవమానం : 1 శ్రీ క్రోధి నామ సంవత్సరంలో మకర రాశి వారు ఆస్తిపాస్తులు సమకూర్చుకుంటారు. స్థల సేకరణ, గృహ నిర్మాణ ప్రయత్నాల్లో విజయం సాధిస్తారు. గృహ నిర్మాణం, 'రియల్ ఎస్టేట్, నిర్మాణ సామగ్రి వ్యాపారులు పురోగతి సాధిస్తారు. కుటుంబ 'విషయాలు ఉల్లాసం కలిగిస్తాయి. ఉద్యోగంలో పురోగతి సాధిస్తారు. ఉన్నత విద్యాభ్యాసానికి అనుకూలం. వాహనం కొనుగోలు చేస్తారు. పెద్దల ఆరోగ్యం మెరుగవుతుంది. పెద్దల సహకారంతో లక్ష్యాలు సాధిస్తారు. అక్టోబరు నుంచి డిసెంబరు చివరి వరకు ఖర్చులు అధికమవుతాయి. ఆస్తుల క్రయవిక్రయాల్లో చిక్కులు ఎదురవుతాయి. కుటుంబసభ్యుల ఆరోగ్యంపై శ్రద్ధ చూపించాలి. ఈ ఏడాది 4, 5 స్థానాల్లో బృహస్పతి సంచరిస్తున్న ఫలితంగా విలువైన వస్తువులు, ఆభరణాలు, స్థిరచరాస్తులు సమకూర్చుకుంటారు. ఇంట్లో వేడుకలు, వివాహాది శుభకార్యాలు జరుగుతాయి. పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది. స్థల సేకరణ, గృహ నిర్మాణానికి అనుకూలం. స్టీలు, సిమెంట్ ఇతర నిర్మాణ సామగ్రి వ్యాపారులు, ఫర్నిచర్ రంగాల వారు లాభాలు అందుకుంటారు. పైచదువుల కోసం చేసే యత్నాలు ఫలిస్తాయి. న్యాయ పోరాటాల్లో విజయం సాధిస్తారు. గురువు వక్రగమనంలో ఉండే అక్టోబరు 15 నుంచి డిసెంబరు చివరి వరకు రియల్ ఎస్టేట్, గృహనిర్మాణ రంగాల వారు ఆచితూచి వ్యవహరించాలి. ఆర్థిక విషయాల్లో ప్రతికూలత కనిపిస్తుంది. కుటుంబసభ్యుల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. న్యాయపరమైన సమస్యలు తలెత్తవచ్చు. పై అధికారుల నుంచి ఒత్తిళ్లు పెరుగుతాయి. పిల్లల వ్యవహారాల్లో కొన్ని సమస్యలు ఎదురవుతాయి. జన్మరాశి నుంచి 2వ స్థానంలో శని సంచారం ఫలితంగా అనవసరమైన ఖర్చులు చేయాల్సి రావచ్చు. అకారణంగా కలహాలు పెరుగుతాయి. ఫలితంగా కష్టాలు ఎదుర్కొంటారు. శ్రమకు తగిన ఫలితం కనిపించకపోవడంతో నిరుత్సాహానికి గురవుతారు. రుణదాతల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. సన్నిహితులతో విరోధం ఏర్పడే ప్రమాదం ఉంది. ఉద్యోగ, వ్యాపారాల్లో కొన్ని చిక్కులు ఎదురవుతాయి. జూన్ - నవంబర్ మధ్య ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. ప్రమోషన్లు అందుకుంటారు. వ్యాపారంలో మొదట ఇబ్బందులు ఎదురైనా చివరకు మంచి ఫలితాలు సాధిస్తారు. ఆర్థిక విషయాల్లో పురోగతి కనిపిస్తుంది. ఈ ఏడాది 3 - 9 స్థానాల్లో రాహుకేతువుల సంచారం కారణంగా ఆస్తినష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. ఇంట్లో చికాకులు పెరుగుతాయి. ఊహించని ఖర్చులు వస్తాయి. డ్రైవింగ్‌లో నిదానం పాటించాలి. బంధుమిత్రుల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. ఉద్యోగ వ్యాపారాల్లో ఆటంకాలు ఎదురుకావడం చికాకు కలిగిస్తుంది. శ్రీ శీతలాదేవి ఆరాధన శుభాలను అందిస్తుంది.
కుంభ రాశి(ధనిష్ఠ 3, 4; శతబిషం; పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు) ఆదాయం : 14, వ్యయం 14, రాజపూజ్యం : 6, అవమానం : 1 కుంభ రాశి వారికి శ్రీ క్రోధి నామ సంవత్సరంలో ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధి కనిపిస్తుంది. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆస్తులు సమకూర్చుకుంటారు. కీర్తిప్రతిష్ఠలు పెంపొందుతాయి. విదేశాలకు వెళ్లే యత్నాలు ఫలిస్తాయి. ప్రచురణ, మార్కెటింగ్, రవాణా, స్టేషనరీ, విద్యారంగంలోని వారికి ప్రోత్సాహకరం. విద్యార్థులు లక్ష్యాలు సాధిస్తారు. కాంట్రాక్టులు, ఒప్పందాలు లాభిస్తాయి. అక్టోబర్-డిసెంబర్ మాసాల మధ్య విద్యార్థుల్లో అశ్రద్ధ పెరుగుతుంది. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త వహించాలి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలి. గురువు 3 - 4 స్థానాలలో సంచరిస్తున్న ఫలితంగా వృత్తి, వ్యాపారల్లో శుభపరిణామాలుంటాయి. బంధు మిత్రుల సహకారంతో లక్ష్యాలు సాధిస్తారు. స్టేషనరీ, రవాణా, పాఠశాలలు, మార్కెటింగ్ రంగాల వారికి ప్రోత్సాహకరం. దూర ప్రయాణాలకు అనుకూలం. ఉద్యోగ, వ్యాపారాల్లో చిన్నపాటి మార్పులు చేస్తారు. పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది. స్థిరాస్తులు సమకూర్చుకుంటారు. ఉద్యోగం చేస్తూ పై చదువులు చదివేందుకు అనుకూలం. ఊహించని ఖర్చులు పెరుగుతాయి. ధార్మిక కార్యక్రమాల కోసం ఖర్చు చేస్తారు. రుణ బాధలు ఒక కొలిక్కి వస్తాయి. గురువు వక్రగమనంలో ఉన్న అక్టోబర్ 15 నుంచి డిసెంబర్ చివరి వరకు వృత్తి, వ్యాపారల్లో కొంత నిరుత్సాహకరంగా ఉంటుంది. ఉద్యోగ యత్నాలకు ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. గౌరవ మర్యాదలకు భంగం కలుగుతుంది. వాగ్వివాదాలకు దూరంగా ఉండాలి. జన్మరాశిలో శని సంచారం వల్ల ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. అన్ని పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. మనసు చంచలంగా ఉంటుంది. ఏ విషయంలోనూ ఒక స్థిరమైన నిర్ణయానికి రాలేకపోతారు. విద్యార్థులు అశ్రద్ధ కారణంగా నష్టపోతారు. ఆర్థిక విషయాల్లో వివాదాలు తలెత్తే అవకాశం ఉంది. మంచికి పోతే చెడు ఎదురవుతుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. ఇతరుల ఆర్థిక విషయాలలో తల దూర్చి చిక్కులో పడతారు. జూన్ 30 నుంచి నవంబర్ 15 వరకు ఆలస్యాలను, వైఫల్యాలను లెక్కచేయకుండా ప్రయత్నాలు కొనసాగించి అనుకున్న లక్ష్యాలను సాధిస్తారు. 2-8 స్థానాల్లో రాహు కేతువుల సంచారం కారణంగా ఉద్యోగం మారే ఆలోచన ఉంటే దాన్ని వాయిదా వేయడం మంచిది. వ్యాపారంలో ప్రయోగాలకు తగిన సమయం కాదు. ఆస్తిపరమన వివాదాలు తలెత్తే అవకాశం ఉంది. ఆర్థిక వ్యవహారాల్లో చిక్కులు ఎదురవుతాయి. వాహనాలు నడిపే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఆస్తుల కొనుగోలు విషయంలో అనుభవం ఉన్న వారి సలహాల మేరకు నడుచుకోవాలి. వివాదాల జోలికి వెళ్లవద్దు. శ్రీకృష్ణుడి ఆరాధన వల్ల శుభం కలుగుతుంది.
మీనం(పూర్వాభాద్ర4;ఉత్తరాభాద్ర, రేవతి) ఆదాయం : 11, వ్యయం 5; రాజపూజ్యం : 2, అవమానం 4 మీనరాశి వారికి సంవత్సరంలో సంకల్పం నెరవేరుతుంది. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఉద్యోగంలో బదిలీలు, ప్రమోషన్లకు అవకాశం ఉంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారం విస్తరిస్తారు. కీర్తి ప్రతిష్ఠలు పొందుతారు. ఆస్తి, వ్యాపారాలు, ఒక కొలిక్కి వస్తాయి. పెట్టుబడులు లాభిస్తాయి. ఆరోగ్యం మెరుగవుతుంది. శుభకార్యాలు జరుగుతాయి. అక్టోబర్ - డిసెంబర్ మాసాల మధ్య తొందరపాటు నిర్ణయాల వల్ల ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. అనవసర ప్రయాణాలు, వాగ్వివాదాల కారణంగా చిక్కులు ఎదుర్కొంటారు. మీ జన్మరాశి నుంచి 2, 3 స్థానాల్లో గురుగ్రహ సంచారం కారణంగా స్థిరచరాస్తులు, విలువైన వస్తువులు సమకూర్చుకుంటారు. వ్యాపారాల్లో లాభాలకు, ఉద్యోగంలో పురోగతికి అవకాశం ఉంది. పై అధికారుల ప్రశంసలు అందుకుంటారు. ప్రస్తుతం చేస్తున్న వ్యాపారంలో చిన్నపాటి మార్పులు చేయడం వల్ల లాభాలు ఆర్జిస్తారు. కుటంబ విషయాలు ఆనందం కలిగిస్తాయి. విద్యార్థులు లక్ష్యాలు సాధిస్తారు. తోబుట్టువుల వ్యవహారాల్లో శుభ పరిణామాలు సంభవిస్తాయి. అనుబంధాలు బలపడతాయి. సోదరులు, సన్నిహితులతో సదవగాహన ఏర్పడుతుంది. విద్యాసంస్థలు, కన్సల్టెన్సీ, ఏజెన్సీల వారికి శుభప్రదం. ఉద్యోగం చేస్తూ చదువుకునేందుకు అనుకూలం. అక్టోబర్ 15 నుంచి డిసెంబర్ చివరి వరకు గురువు వక్రించిన కారణంగా ఆర్థిక విషయాల్లో తొందరపాటు తగదు. వృత్తి, వ్యాపారాల్లో నిదానం పాటించాలి. రవాణా, కన్సల్టెన్సీ, విద్యారంగాల వారు జాగ్రత్తగా ముందడుగు వేయాలి. డ్రైవింగ్‌లో జాగ్రత్తలు తీసుకోవాలి. 12వ స్థానంలో శని సంచారం ఫలితంగా అన్ని విషయాల్లో జాగ్రత్తలు పాటించడం అవసరం. మానసిక ఆందోళనలు, చికాకులు పెరుగుతాయి. అనవసర ఖర్చులు పెరుగుతాయి. కుటుంబంలో, ఉద్యోగ, వ్యాపారాల్లో బాధ్యతలు అధికమవుతాయి. అపార్థాలు పెరుగుతాయి. అనవసర వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం వల్ల నష్టపోతారు. జూన్ 30 నుంచి నవంబర్ 15 వరకు ఆర్థిక పరిస్థితి కొంత మెరుగుపడుతుంది. పెద్దల ఆరోగ్యం మెరుగవుతుంది. విదేశీ గమన ప్రయత్నాలు ఫలించినా అందుకు భారీగా ఖర్చు చేయాల్సి వస్తుంది. ఈ ఏడాది 1-7 స్థానాల్లో రాహు కేతు సంచారం ఫలితంగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. ఉద్యోగ, వ్యాపారాలకు సంబంధించిన నిర్ణయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. శత్రుబాధ అధికంగా ఉంటుంది. వివాహం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఉన్నత పదవులు లభించే అవకాశం ఉంది. విద్యార్థులు అనుకూల ఫలితాలు సాధిస్తారు. పెట్టుబడుల్లో ఆచితూచి వ్యవహరించాలి. శ్రీ మహాలక్ష్మీదేవి ఆరాధనతో సత్ఫలితాలు సాధిస్తారు.