జీఓసీఎల్‌కు రూ.766 కోట్ల ఆర్డర్
ABN , First Publish Date - 2023-10-10T01:50:45+05:30 IST
జీఓసీఎల్ కార్పొ రేషన్ (జీఓసీఎల్) అనుబంధ కంపెనీ ఐడీఎల్ ఎక్స్‌ప్లో జివ్స్ లిమిటెడ్‌కు రూ.766 కోట్ల ఆర్డర్ లభించింది. బల్క్ ఎక్స్‌ప్లోజివ్స్‌ను సరఫరా చేయడానికి...
కోల్ ఇండియాకు ఎక్స్‌ప్లోజివ్స్ సరఫరా
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): జీఓసీఎల్ కార్పొ రేషన్ (జీఓసీఎల్) అనుబంధ కంపెనీ ఐడీఎల్ ఎక్స్‌ప్లో జివ్స్ లిమిటెడ్‌కు రూ.766 కోట్ల ఆర్డర్ లభించింది. బల్క్ ఎక్స్‌ప్లోజివ్స్‌ను సరఫరా చేయడానికి కోల్ ఇండియా (సీఐఎల్) నుంచి ఈ ఆర్డర్ లభించిందని.. ఇప్పటి వరకూ జీఓసీఎల్‌కు లభించిన అతిపెద్ద ఆర్డర్ ఇదేనని సంస్థ ఎండీ పంకజ్ తెలిపారు. వచ్చే రెండేళ్లలో ఈ ఆర్డర్‌ను పూర్తి చేయాల్సి ఉంటుంది. మైనింగ్, మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల కోసం జీఓసీఎల్ ప్రత్యేకంగా రూపొందించిన ప్యాక్డ్, బల్క్ ఎక్స్‌ప్లోజివ్స్‌ను తయారు చేస్తోంది. దేశ, విదేశాల్లోని మైనింగ్ రంగంలోని కంపెనీ లకు సరఫరా చేస్తోందని పంకజ్ వివరించారు.