ఎయిర్ ఇండియా.. క్యాబిన్, కాక్‌పిట్ సిబ్బంది కోసం సరికొత్త యూనిఫామ్
ABN , First Publish Date - 2023-12-13T02:55:41+05:30 IST
టాటా గ్రూప్‌నకు చెందిన ఎయిర్ ఇండియా.. క్యాబిన్, కాక్‌పిట్ సిబ్బంది కోసం సరికొత్త యూనిఫామ్‌ను ఆవిష్కరించింది...
టాటా గ్రూప్‌నకు చెందిన ఎయిర్ ఇండియా.. క్యాబిన్, కాక్‌పిట్ సిబ్బంది కోసం సరికొత్త యూనిఫామ్‌ను ఆవిష్కరించింది. ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్రా ఈ యూనిఫామ్‌ను డిజైన్ చేశారు. భారత సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా వీటిని డిజైన్ చేసినట్లు ఎయిర్ ఇండియా తెలిపింది. ఎయిర్ ఇండియాకు చెందిన తొలి ఎయిర్‌బస్ ఏ350 విమాన సర్వీస్‌లో ఈ కొత్త యూనిఫామ్‌తో సిబ్బంది స్వాగతం పలకనున్నారని వెల్లడించింది.