యాక్సిస్‌ బ్యాంక్‌ లాభం రూ.5,853 కోట్లు

ABN , First Publish Date - 2023-01-24T04:04:32+05:30 IST

యాక్సిస్‌ బ్యాంక్‌.. డిసెంబరుతో ముగిసిన త్రైమాసికంలో స్టాండ్‌ఎలోన్‌ ప్రాతిపదికన రూ.5,853 కోట్ల నికర లాభాన్ని...

యాక్సిస్‌ బ్యాంక్‌ లాభం రూ.5,853 కోట్లు

న్యూఢిల్లీ: యాక్సిస్‌ బ్యాంక్‌.. డిసెంబరుతో ముగిసిన త్రైమాసికంలో స్టాండ్‌ఎలోన్‌ ప్రాతిపదికన రూ.5,853 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. 2021-22 ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంతో పోల్చితే లాభం 62 శాతం (రూ.3,614 కోట్లు) పెరిగింది. నికర వడ్డీ ఆదాయం పెరగటంతో పాటు మొండి పద్దులు భారీగా తగ్గటంతో అద్భుతమైన ఫలితాలను సాధించగలిగినట్లు యాక్సిస్‌ బ్యాంక్‌ పేర్కొంది. త్రైమాసిక సమీక్షా కాలంలో బ్యాంక్‌ మొత్తం ఆదాయం రూ.21,101 కోట్ల నుంచి రూ.26,892 కోట్లకు పెరిగింది. మరోవైపు నికర వడ్డీ ఆదాయం 32 శాతం వృద్ధి చెంది రూ.11,459 కోట్లుగా ఉంది.

Updated Date - 2023-01-24T04:04:34+05:30 IST