బిగ్ సి.. దీపావళి ధమాకా ఆఫర్లు
ABN , First Publish Date - 2023-11-07T03:52:08+05:30 IST
ప్రముఖ మొబైల్స్ విక్రయ సంస్థ బిగ్ సి.. దీపావళి సందర్భంగా ధమాకా ఆఫర్లను ప్రకటించింది.
హైదరాబాద్: ప్రముఖ మొబైల్స్ విక్రయ సంస్థ బిగ్ సి.. దీపావళి సందర్భంగా ధమాకా ఆఫర్లను ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో 250కి పైగా స్టోర్లతో కార్యకలాపాలు సాగిస్తూ వస్తున్న బిగ్ సి.. దీపావళి పండగను పురస్కరించుకుని వినియోగదారులకు ఆకర్షణీయమైన ఆఫర్లను అందుబాటులోకి తీసుకువచ్చిందని సంస్థ వ్యవస్థాపకుడు, సీఎండీ యం బాలు చౌదరి తెలిపారు. ఈ ధమాకా ఆఫర్స్‌లో భాగంగా ప్రతి స్మార్ట్ ఫోన్ కొనుగోలుపై రూ.10,000 వరకు ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్‌తో పాటు రూ.4,000 వరకు విలువ గల కచ్చితమైన బహుమతిని అందించనున్నట్లు చెప్పారు. అంతేకాకుండా స్మార్ట్ వాచీ ఆఫర్, లాయల్టీ పాయింట్స్ ఆఫర్, స్మార్ట్ టీవీ ఆఫర్, 1+1 ఎక్స్‌టెండెడ్ వారంటీ ఆఫర్ వంటి ఆఫర్లు ఉన్నాయని బాలు చౌదరి తెలిపారు. బజాజ్ ఫైనాన్స్ ద్వారా మొబైల్స్ కొనుగోలు చేస్తే రూ.9,000 వరకు ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్, ఎస్‌బీఐ ద్వారా కొనుగోలు చేసే ప్రతి మొబైల్, స్మార్ట్ టీవీ, ల్యాప్‌ట్యా్‌పలపై రూ.3,000 వరకు ఇన్‌స్టంట్‌గా డిస్కౌంట్‌ను అందిస్తున్నట్లు బిగ్ సి తెలిపింది. ఐడీఎ్‌ఫసీ ద్వారా కొనుగోలు చేస్తే రూ.7,500 వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్‌ను అందించనున్నట్లు పేర్కొంది.
ఐఫోన్స్ కొనుగోలుపై రూ.7,000 వరకు ప్రయోజనాలతో పాటు ఎంపిక చేయబడిన మొబైల్స్ కొనుగోలుపై రూ.5,000 విలువ గల ఫైర్ బోల్ట్ స్మార్ట్ వాచీని కేవలం రూ.499కి అందిస్తోంది. అంతేకాకుండా ఏటీఎం కార్డుపై ఎలాంటి వడ్డీ, డౌన్ పేమెంట్ లేకుండానే మొబైల్, స్మార్ట్ టీవీ, ల్యాప్‌టాప్, ఎయిర్ కండీషనర్స్ కొనుగోలు చేసే అవకాశం ఉందని బాలు చౌదరి తెలిపారు.