Share News

పోస్టాఫీసుల్లో డిజిటల్‌ పార్సిల్‌ లాకర్‌

ABN , First Publish Date - 2023-11-21T01:28:50+05:30 IST

ఇండియా పోస్ట్‌తో ఎక్స్‌ప్రెస్‌ లాజిస్టిక్‌ సేవలందించే బ్లూ డార్ట్‌ భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంది. ఈ భాగస్వామ్యం కింద బ్లూ డార్ట్‌ కోసం ఇండియా పోస్ట్‌ ఎంపిక చేసిన...

పోస్టాఫీసుల్లో డిజిటల్‌ పార్సిల్‌ లాకర్‌

ఇండియా పోస్ట్‌తో బ్లూ డార్ట్‌ భాగస్వామ్యం

న్యూఢిల్లీ: ఇండియా పోస్ట్‌తో ఎక్స్‌ప్రెస్‌ లాజిస్టిక్‌ సేవలందించే బ్లూ డార్ట్‌ భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంది. ఈ భాగస్వామ్యం కింద బ్లూ డార్ట్‌ కోసం ఇండియా పోస్ట్‌ ఎంపిక చేసిన పోస్టాఫీసుల్లో ఆటోమేటెడ్‌ డిజిటల్‌ పార్సిల్‌ లాకర్‌ను ప్రారంభిస్తుంది. దీని వల్ల కన్‌సైనీలు (పార్సిల్‌ అందుకునే వ్యక్తులు) ప్యాకేజీ అందుకునేందుకు సంతకం చేయాల్సిన లేదా తమ గుర్తింపును ధ్రువీకరించాల్సిన అవసరం ఉండ దు. వారికి వచ్చిన పార్సిల్స్‌ ఈ డిజిటల్‌ లాకర్లలో భద్రపరిచి, తేలిగ్గా అందుబాటులో ఉంచుతారు. కన్‌సైనీలు నేరుగా తమకు ఇచ్చిన కోడ్‌ను ఎంటర్‌ చేసి లాకర్‌ తెరవడం ద్వారా పార్సిల్‌ను తీసుకోవచ్చు. తమ అవకాశాన్ని బట్టి ఏ సమయంలో అయినా తమంత తాముగా దాన్ని తీసుకోవచ్చు లేదా తమ అధికారిక ఏజెంట్‌ ద్వారా సేకరించవచ్చు.

Updated Date - 2023-11-21T01:28:53+05:30 IST