టెక్ వ్యూ 21,500 వద్ద పరీక్ష
ABN , Publish Date - Dec 25 , 2023 | 01:42 AM
నిఫ్టీ గత వారం మైనర్ అప్‌ట్రెండ్‌లో ప్రారంభమై 21,500 వరకు వెళ్లినా రియాక్షన్‌లో పడి 500 పాయింట్ల వరకు నష్టపోయింది. కాని 21,000 వద్ద రికవరీ కూడా సాధించి తక్షణ డౌన్‌ట్రెండ్‌ను నివారించుకుంది...
టెక్ వ్యూ 21,500 వద్ద పరీక్ష
నిఫ్టీ గత వారం మైనర్ అప్‌ట్రెండ్‌లో ప్రారంభమై 21,500 వరకు వెళ్లినా రియాక్షన్‌లో పడి 500 పాయింట్ల వరకు నష్టపోయింది. కాని 21,000 వద్ద రికవరీ కూడా సాధించి తక్షణ డౌన్‌ట్రెండ్‌ను నివారించుకుంది. ఈ కరెక్షన్‌లో స్వల్పకాలిక నిరోధ, మద్దతు స్థాయిలపై కూడా స్పష్టత ఏర్పడింది. గత వారం మొత్తం పరిమిత పరిధిలోనే కదలాడిన ఇండెక్స్ 110 పాయింట్ల స్వల్ప నష్టంతో వారం గరిష్ఠ, కనిష్ఠ స్థాయిల నడుమన క్లోజైంది. ఎనిమిది వారాల ర్యాలీ అనంతరం ఏర్పడిన సాధారణ మైనర్ కరెక్షన్ ఇది. టెక్నికల్‌గా ప్రధాన ట్రెండ్ ఇప్పటికీ పాజిటివ్‌గానే ఉంది. గత వారం మిడ్‌క్యాప్ సూచీ 2,300 పాయింట్ల మేరకు బలమైన కరెక్షన్‌లో పడినా కోలుకుని 500 పాయింట్లకు నష్టాన్ని పరిమితం చేసుకుంది. స్మాల్‌క్యాప్ సూచీ కూడా ఒక దశలో 800 పాయింట్ల మేరకు నష్టపోయినా 40 పాయింట్లకు నష్టం పరిమితం చేసుకుంది. ప్రస్తుతం మార్కెట్ టెక్నికల్‌గా అప్రమత్త ధోరణిలో ఉంది.
బుల్లిష్ స్థాయిలు: పాజిటివ్ ట్రెండ్‌లో ప్రారంభమైతే మరింత అప్‌ట్రెండ్ కోసం ప్రధాన నిరోధం 21,460 కన్నా పైన నిలదొక్కుకోవలసి ఉంది.. మరో ప్రధాన నిరోధం 21,550. ఈ చారిత్రక గరిష్ఠ స్థాయిలోనే గత వారం కరెక్షన్ ఏర్పడింది.
బేరిష్ స్థాయిలు: రియాక్షన్‌లో పడి మైనర్ మద్దతు స్థాయి 21,200 వద్ద నిలదొక్కుకోలేకపోతే మైనర్ బలహీనత మరింతగా కొనసాగుతుంది. ప్రధాన స్వల్పకాలిక మద్దతు స్థాయి 21,000. భద్రత కోసం ఇక్కడ నిలదొక్కుకుని తీరాలి. అంతకన్నా దిగజారితే స్వల్పకాలిక బలహీనతను కొనసాగిస్తుంది.
బ్యాంక్ నిఫ్టీ: గత వారం ఈ సూచీ 48,000, 47,000 పాయింట్ల మధ్యన కదలాడి చివరికి 650 పాయింట్ల నష్టంతో ముగిసింది. అప్‌ట్రెండ్‌ను మరింతగా కొనసాగించాలంటే ప్రధాన నిరోధం 48,200 కన్నా పైన నిలదొక్కుకోవాలి. బలహీనత ప్రదర్శించినా భద్రత కోసం ప్రధాన మద్దతు స్థాయి 46,900 వద్ద నిలదొక్కుకుని తీరాలి. అంతకన్నా దిగజారితే స్వల్పకాలిక బలహీనత మరింతగా కొనసాగుతుంది.
పాటర్న్: మరింత అప్‌ట్రెండ్‌లో పురోగమించాలంటే 21,550 వద్ద ‘‘అడ్డంగా ఏర్పడిన రెసిస్టెన్స్ ట్రెండ్‌లైన్’’ వద్ద బ్రేకౌట్ సాధించాలి. 21,000 వద్ద ‘‘అడ్డంగా ఏర్పడిన సపోర్ట్ ట్రెండ్‌లైన్’’ కన్నా దిగజారితే స్వల్పకాలిక బలహీనత ముప్పు ఉన్నట్టు సంకేతం ఇస్తుంది. మార్కెట్ ప్రస్తుతం 20 డిఎంఏ కన్నా స్వల్పంగా పైన ఉంది.
టైమ్: ఈ సూచీ ప్రకారం గురువారం తదుపరి రివర్సల్ ఉంది.
సోమవారం స్థాయిలు
నిరోధం : 21,400, 21,460
మద్దతు : 21,290, 21,200
వి. సుందర్ రాజా