Share News

Gold Price: స్వల్పంగా పెరిగిన బంగారం ధర..

ABN , First Publish Date - 2023-11-26T09:39:02+05:30 IST

అసలే పెళ్లిళ్ల సీజన్.. ఆపై మగువలకు ఎంతో ఇష్టం.. అదేనండీ బంగారం. ఇవాళ బంగారం(Gold Prices) ధరలు స్వల్పంగా పెరిగాయి. ఈ నెల తొలి వారంలో ధరలు పెరుగుతూ వెళ్లాయి.

Gold Price: స్వల్పంగా పెరిగిన బంగారం ధర..

ఢిల్లీ: అసలే పెళ్లిళ్ల సీజన్.. ఆపై మగువలకు ఎంతో ఇష్టం.. అదేనండీ బంగారం. ఇవాళ బంగారం(Gold Prices) ధరలు స్వల్పంగా పెరిగాయి. ఈ నెల తొలి వారంలో ధరలు పెరుగుతూ వెళ్లాయి. నవంబర్ 17 తరువాత 10 గ్రాముల బంగారం ధర రూ.1000 పెరిగింది. ఆ తరువాత స్థిరంగా కొనసాగాయి. నాలుగు రోజుల నుంచి బంగారం ధరల్లో అంతగా పెరుగుదల కనిపించట్లేదు.

ఇవాళ 10 గ్రాముల గోల్డ్ రూ.30 పెరిగింది. హైదరాబాద్(Hyderabad Gold Prices) లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,800 పలుకుతుండగా.. 24 క్యారెట్ల గోల్డ్ ప్రైస్ తులానికి రూ.61,970 పలుకుతోంది. దిల్లీలో 22 క్యారెట్లు రూ.57,250 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ప్రైస్ రూ.62,440 గా ఉంది. ముంబయిలో 22 క్యారెట్ల గోల్డ్ రూ.57,100 కాగా, 24 క్యారెట్ల గోల్డ్ రూ.62,290గా ఉంది.


స్థిరంగా కొనసాగుతున్న సిల్వర్ ధరలు..

సిల్వర్ ధరల్లో(Silver Prices) సైతం పెద్దగా మార్పులు రావట్లేదు. కేజీ వెండి ధర హైదరాబాద్ లో రూ.79,200 పలుకుతుండగా, దేశ రాజధాని దిల్లీ(Delhi)లో రూ.76,200గా ఉంది.

స్థానిక ప్రభుత్వాల ట్యాక్స్ లను బట్టి గోల్డ్, సిల్వర్ ధరల్లో వ్యత్యాసం ఉంటుంది. కరెన్సీ, ప్రభుత్వ విధానాలు, డిమాండ్‌తో సహా పలు అంశాలపై బంగారం ధరలు ఆధారపడి ఉంటాయి. US డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి స్లైడ్ అయితే, బంగారం ధర పెరుగుతుంది.

Updated Date - 2023-11-26T09:45:31+05:30 IST