Heritage Foods: ఆరెంజ్‌ ఫ్లేవర్డ్‌ ఎనర్జీ డ్రింక్‌ ‘గ్లూకో శక్తి’ని విడుదల చేసిన హెరిటేజ్‌ ఫుడ్స్‌

ABN , First Publish Date - 2023-01-19T20:46:47+05:30 IST

దేశంలో ప్రముఖ డెయిరీల్లో ఒకటైన హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ (Heritage Foods) ఎనర్జీ డ్రింగ్ సెగ్మెంట్‌లోకి ప్రవేశించింది. వే బేస్‌డ్ డ్రింక్

Heritage Foods: ఆరెంజ్‌ ఫ్లేవర్డ్‌ ఎనర్జీ డ్రింక్‌ ‘గ్లూకో శక్తి’ని విడుదల చేసిన హెరిటేజ్‌ ఫుడ్స్‌

హైదరాబాద్: దేశంలో ప్రముఖ డెయిరీల్లో ఒకటైన హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ (Heritage Foods) ఎనర్జీ డ్రింగ్ సెగ్మెంట్‌లోకి ప్రవేశించింది. వే బేస్‌డ్ డ్రింక్ (whey-based drink) ‘గ్లూకో శక్తి’ని విడుదల చేసింది. తక్షణ శక్తి కోసం దీనిని గ్లూకోజ్‌తో ఫోర్టిఫైడ్ చేశారు. అత్యంత సహజసిద్ధమైన మినరల్స్‌ సోడియం, పోటాషియం, పాస్ఫరస్, మెగ్నీషియం మొదలైనవి ఇందులో ఉన్నాయి. ఇతర ఉత్పత్తులతో పోలిస్తే 1.5 శాతం అధిక పొటాషియం ఇందులో ఉన్నట్టు హెరిటేజ్ తెలిపింది.

200 మిల్లీ లీటర్ల పౌచ్ ప్యాక్‌లో రూ. 10 ధరతో లభించే ‘గ్లూకో శక్తి’ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడులో ఇది అందుబాటులో ఉంటుంది. ప్రస్తుతం దీనిని ట్యాంగీ ఆరెంజ్ ఫ్లేవర్‌లో విడుదల చేశారు. జనరల్‌ ట్రేడ్‌ స్టోర్లు, హెరిటేజ్‌ పార్లర్లు, ఎంపిక చేసిన మోడ్రన్ రిటైల్‌ స్టోర్లలో ఇది లభ్యమవుతుంది.

ఈ సందర్భంగా హెరిటేజ్ వైస్ చైర్‌పర్సన్, మేనేజింగ్ డైరెక్టర్ భువనేశ్వరి (Nara Bhuvaneshwari) మాట్లాడుతూ.. ఆరోగ్యవంతమైన, అత్యంత రుచికరమైన ఇన్‌స్టంట్ ఎనర్జీ బూస్టర్‌ గ్లూకోశక్తి అని పేర్కొన్నారు. నీరసం ఆవరించినప్పుడు తక్షణ శక్తిని పొందేందుకు ఇది తోడ్పడుతుందన్నారు. ప్రతి ఒక్కరికీ, ప్రతి రోజూ ఆరోగ్యం, సంతోషం అందిస్తామనే వాగ్దానాన్ని నిలుపుకుంటూ హెరిటేజ్‌ చేసిన మరో మహోన్నత ప్రయత్నం ఇదని పేర్కొన్నారు.

అలాగే, క్రీమీలీషియస్ కర్డ్‌(Creamilicious Curd)ను కూడా హెరిటేజ్ విడుదల చేసింది. ఇందులో 4.5 శాతం ఫ్యాట్ ఉంది. ఈ రుచికరమైన చిక్కటి, క్రీమి పెరుగును ప్రీమియం టబ్స్‌ (1కేజీ), సౌకర్యవంతమైన కప్పులు 200, 400, 500 గ్రాముల్లో లభిస్తాయి. తొలుత ఢిల్లీ ఎన్‌సీఆర్‌లో విడుదల చేసిన ఈ క్రీమిలీషియస్‌ కర్డ్‌ను ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రలలో విడుదల చేశారు. హెరిటేజ్ క్రీమీలీషియస్ కర్డ్ ఎలాంటి మీల్‌ను అయినా ఆరోగ్యవంతమైనదిగా, రుచికరమైనదిగా మారుస్తుందని హెరిటేజ్‌ ఫుడ్స్‌ లిమిటెడ్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ బ్రాహ్మణి నారా (Nara Brahmani) అన్నారు.

Updated Date - 2023-01-19T20:46:49+05:30 IST