తగ్గిన తాజ్ జీవీకే హోటల్స్ లాభం
ABN , First Publish Date - 2023-08-10T04:18:19+05:30 IST
తాజ్ జీవీకే హోటల్స్ అండ్ రిసార్ట్ లాభం రెండో త్రైమాసికంలో తగ్గింది. గత ఏడాది ఇదే సమయంతో పోల్చితే లాభం...
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): తాజ్ జీవీకే హోటల్స్ అండ్ రిసార్ట్ లాభం రెండో త్రైమాసికంలో తగ్గింది. గత ఏడాది ఇదే సమయంతో పోల్చితే లాభం రూ.15.97 కోట్ల నుంచి రూ.13.21 కోట్లకు పరిమితమైందని కంపెనీ వెల్లడించింది. ఆదాయం మాత్రం రూ.86.47 కోట్ల నుంచి రూ.91.81 కోట్లకు చేరింది. కాగా తాజ్ బంజరా హోటల్ లైసెన్స్ రెన్యూవల్‌కు సంబంధించి హోటల్ బంజారా లిమిటెడ్‌తో జరుగుతున్న చర్చలు ఇంకా ఒక కొలిక్కి రాలేదని తెలిపింది.