Share News

మూడేళ్లలో భారత్‌ నంబర్‌ 3

ABN , First Publish Date - 2023-11-16T03:34:39+05:30 IST

ప్రస్తుత సంక్షుభిత ఆర్థిక ప్రపంచంలో భారత ఆర్థిక వ్యవస్థ వెలు గు చుక్క అని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అన్నారు. 2027 కల్లా భారత ఆర్థిక వ్యవస్థ జపాన్‌, జర్మనీలను...

మూడేళ్లలో భారత్‌ నంబర్‌ 3

  • ఆర్థిక మంత్రి సీతారామన్‌

న్యూఢిల్లీ: ప్రస్తుత సంక్షుభిత ఆర్థిక ప్రపంచంలో భారత ఆర్థిక వ్యవస్థ వెలు గు చుక్క అని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అన్నారు. 2027 కల్లా భారత ఆర్థిక వ్యవస్థ జపాన్‌, జర్మనీలను అధిగమించి ఐదు లక్షల కోట్ల డాలర్లకు పైగా జీడీపీతో ప్రపంచంలో మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగనుందన్నారు. 2047కల్లా అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలన్నది భారత లక్ష్యమన్నారు. ఢిల్లీలో జరుగుతున్న ‘ఇండో-పసిఫిక్‌ రీజినల్‌ డైలాగ్‌’ సదస్సులో ఆమె ఈ విషయం ప్రకటించారు. ప్రతికూల పరిస్థితులున్నా ఈ ఆర్థిక సంవత్సరం భారత జీడీపీ 6.5 శాతం మేర పెరగనుందన్నారు. భారత్‌ తప్ప, మరే ప్రధాన దేశ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం ఈ స్థాయిలో వృద్ధిరేటు సాధించే అవకాశం లేదన్నారు. భారత సముద్ర ఆధారిత రంగంలో అవకాలున్నట్టు నిర్మల తెలిపారు. ఈ రంగం ఇప్పటికే దేశ జీడీపీలో నాలుగు శాతం వాటా కలిగి ఉందన్నారు. దేశంలోని తొమ్మిది రాష్ట్రాలు, నాలుగు కేంద్ర పాలిత ప్రాంతాలు 12 ప్రధాన ఓడ రేవులు, 200కు పైగా చిన్న రేవులతో సముద్ర వాణిజ్యానికి అత్యంత అనువుగా ఉన్న విషయాన్ని గుర్తు చేశారు.

Updated Date - 2023-11-16T03:34:43+05:30 IST