Reliance Jio True 5G: ఏపీలో మరో 9 పట్టణాల్లో అందుబాటులోకి జియో 5జీ సేవలు

ABN , First Publish Date - 2023-03-21T21:49:24+05:30 IST

రిలయన్స్ జియో(Reliance Jio) తన ట్రూ 5జీ(Ture 5G) సేవలను

Reliance Jio True 5G: ఏపీలో మరో 9 పట్టణాల్లో అందుబాటులోకి జియో 5జీ సేవలు

ముంబై: రిలయన్స్ జియో(Reliance Jio) తన ట్రూ 5జీ(Ture 5G) సేవలను మరిన్ని పట్టణాలకు విస్తరించింది. దేశవ్యాప్తంగా 16 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 41 నగరాల్లో తాజాగా 5జీ సేవలను ప్రారంభించింది. వీటితో కలుపుకుని దేశవ్యాప్తంగా 406 నగరాలు/ పట్టణాల్లో జియో ట్రూ 5జీ సేవలు అందుబాటులోకి వచ్చినట్టు అయింది. ఇన్ని నగరాల్లో అందుబాటులోకి తీసుకొచ్చిన తొలి సంస్థ తమదేనని జియో పేర్కొంది.

జియో 5జీ సేవలు అందుబాటులోకి వచ్చిన పట్టణాల్లో 9 ఏపీలోనే ఉండడం గమనార్హం. వీటిలో ఆదోని, బద్వేల్‌, చిలకలూరిపేట, గుడివాడ, కదిరి, నరసాపురం, రాయచోటి, శ్రీకాళహస్తి, తాడేపల్లిగూడెం ఉన్నాయి. విజయవాడ, విశాఖపట్టణం, తిరుమల, తిరుపతి, రాజమహేంద్రవరం, చిత్తూరు, కడప, నరసరావుపేట, శ్రీకాకుళం, విజయనగరం, ఏలూరు, కాకినాడ, కర్నూలు, గుంటూరు వంటి నగరాలు/పట్టణాల్లో జియో ట్రూ 5జీ సేవలు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి. జియో వెల్కమ్ ఆఫర్‌లో భాగంగా 1జీబీపీఎస్ వేగంతో అపరిమిత డేటా ఉచితంగా లభిస్తుంది. ఇందుకోసం ఎలాంటి రుసుము చెల్లించాల్సిన పనిలేదు.

Updated Date - 2023-03-21T21:49:24+05:30 IST