గ్రాన్యూల్స్‌ రూపంలో కాయం చూర్ణ అడ్వాన్స్‌

ABN , First Publish Date - 2023-05-21T01:53:40+05:30 IST

పొట్టను శుభ్రం చేయడంలో పేరొందిన ‘కాయం చూర్ణ’ కొత్త రూపంలో మార్కెట్లోకి విడులైంది. ఈ కొత్త మలబద్దక నివారణ ఔషధాన్ని...

గ్రాన్యూల్స్‌ రూపంలో కాయం చూర్ణ అడ్వాన్స్‌

హైదరాబాద్‌: పొట్టను శుభ్రం చేయడంలో పేరొందిన ‘కాయం చూర్ణ’ కొత్త రూపంలో మార్కెట్లోకి విడులైంది. ఈ కొత్త మలబద్దక నివారణ ఔషధాన్ని కొత్త ఫార్ములాతో ‘కాయం చూర్ణ అడ్వాన్స్‌’ పేరుతో మార్కెట్లోకి విడుదల చేసినట్లు సేథ్‌ బ్రదర్స్‌ వెల్లడించింది. గుజరాత్‌లోని భావ్‌నగర్‌ కేంద్రంగా కంపెనీ కార్యకలాపాలు సాగిస్తోంది. గ్రాన్యూల్స్‌ రూపంలో జీలకర్ర రుచితో ఉండే ఈ కొత్త ఔషధం గొంతుకు అతుక్కోకుండా వెంటనే పొట్టలోకి వెళ్లి, మరింత సమర్ధవంతంగా పని చేస్తుందని పేర్కొంది. కాయం చూర్ణ అడ్వాన్స్‌లోనూ గులాబీ రేకులు, ఆముదం కలిసి ఉంటాయి.

Updated Date - 2023-05-21T01:53:40+05:30 IST