సైయెంట్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్‌గా కృష్ణ బోదనపు
ABN , First Publish Date - 2023-04-04T03:31:09+05:30 IST
సైయెంట్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా కృష్ణ బోదనపు నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన కంపెనీకి ఎండీ, సీఈఓగా ఉన్నారు..
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): సైయెంట్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా కృష్ణ బోదనపు నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన కంపెనీకి ఎండీ, సీఈఓగా ఉన్నారు. ఎగ్జిక్యూటివ్ లీడర్‌షి్‌పలో మార్పుల్లో భాగంగా ఈడీ, సీఓఓగా ఉన్న కార్తిక్ నటరాజన్ ఇక ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తారని సైయెంట్ వెల్లడించింది. ప్రభాకర్ అట్లా ప్రెసిడెంట్, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌గా కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు.