హైదరాబాద్‌లో రెండు టవర్ల నిర్మాణానికి ఎల్‌ అండ్‌ టీకి కాంట్రాక్టు

ABN , First Publish Date - 2023-01-17T03:03:59+05:30 IST

హైదరాబాద్‌లో రెండు వాణిజ్య, ఆఫీస్‌ స్పేస్‌ టవర్లను నిర్మించడానికి ఎల్‌ అండ్‌ టీ కన్‌స్ట్రక్షన్‌కు చెందిన బిల్డింగ్స్‌ అండ్‌ ఫ్యాక్టరీస్‌...

హైదరాబాద్‌లో రెండు టవర్ల నిర్మాణానికి ఎల్‌ అండ్‌ టీకి కాంట్రాక్టు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): హైదరాబాద్‌లో రెండు వాణిజ్య, ఆఫీస్‌ స్పేస్‌ టవర్లను నిర్మించడానికి ఎల్‌ అండ్‌ టీ కన్‌స్ట్రక్షన్‌కు చెందిన బిల్డింగ్స్‌ అండ్‌ ఫ్యాక్టరీస్‌ (బీ అండ్‌ ఎఫ్‌) ఫాస్ట్‌ బిజినెస్‌ విభాగానికి ఆర్డర్లు లభించాయి. ఈ రెండు టవర్ల ఆఫీస్‌ స్పేస్‌ విస్తీర్ణం 28.91 లక్షల చదరపు అడుగులు, 28.53 లక్షల చదరపు అడుగులు ఉంటుందని కంపెనీ వెల్లడించింది. ఈ ప్రాజెక్టుల విలువ రూ.1000-2,500 కోట్ల మధ్య ఉండొచ్చని అంచనా. ఏడాదిన్నరలో ఈ రెండు టవర్లను నిర్మించాల్సి ఉంటుందని.. ప్రముఖ కమర్షియల్‌ డెవలపర్‌, ఆపరేటర్ల నుంచి ఈ ప్రాజెక్టును పొందినట్లు తెలిపింది.

మార్కెట్లోకి పర్యావరణ అనుకూల కాంక్రీట్‌: అదానీ సిమెంట్‌కు చెందిన ఏసీసీ లిమిటెడ్‌ హైదరాబాద్‌ మార్కెట్లోకి పర్యావరణ అనుకూల కాంక్రీట్‌ ఏసీసీ ఎకోమ్యాక్స్‌’ అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ కాంక్రీట్‌ ఇప్పటికే ముంబై, కోల్‌కతా, చెన్నై నగరాల్లో లభిస్తోంది.

Updated Date - 2023-01-17T03:04:03+05:30 IST