మార్కెట్లోకి కొత్త బొలెరో మ్యాక్స్ పికప్
ABN , First Publish Date - 2023-04-26T00:36:23+05:30 IST
మహీంద్రా అండ్ మహీంద్రా (ఎం అండ్ ఎం) దేశీయ మార్కెట్లోకి కొత్త బొలెరో మ్యాక్స్ పికప్ వాహనాన్ని హైదరాబాద్‌లో విడుదల చేసింది.
ప్రారంభ ధర రూ.7.85 లక్షలు
మార్కెట్లోకి కొత్త బొలెరో మ్యాక్స్ పికప్
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): మహీంద్రా అండ్ మహీంద్రా (ఎం అండ్ ఎం) దేశీయ మార్కెట్లోకి కొత్త బొలెరో మ్యాక్స్ పికప్ వాహనాన్ని హైదరాబాద్‌లో విడుదల చేసింది. ఐమ్యాక్స్ కనెక్టెడ్ సొల్యూషన్ వంటి సదుపాయాలను కొత్తగా చేర్చినట్లు ఎం అండ్ ఎం దక్షిణ ప్రాంత జోనల్ అధిపతి ఏ రాయ్ తెలిపారు. దీని ప్రారంభ ధర రూ.7.85 లక్షలు (ఎక్స్‌షోరూమ్). పేలోడ్ సామర్థ్యం 1.3 టన్నుల నుంచి 2 టన్నులు ఉంటుంది. ఈ శ్రేణి పికప్ వాహనాల విభాగంలో కొత్త బొలెరో మ్యాక్స్ సరికొత్త ప్రమాణాలను సృష్టించనుందని చెప్పారు. రూ.24,999 డౌన్ పేమెంట్ చేసి కొత్త బొలెరో మ్యాక్స్‌ను బుక్ చేసుకోవచ్చు. ఇప్పటి వరకూ మహీంద్రా 20 లక్షల బొలెరో మ్యాక్స్ పికప్ వాహనాలను విక్రయించింది.
కన్స్యూమర్ టెక్ సంస్థ ఉడ్‌చలో.. మార్కెట్లోకి ఎలక్ట్రిక్ సైకిల్ ‘వీర్‌బైక్’ విడుదల చేసింది. ఆర్మీ ఆలివ్ గ్రీన్, నేవల్ వైట్, ఎయిర్‌ఫోర్స్ బ్లూ, కమాండో బ్లాక్, ఇన్ ఫ్యాంట్రీ గ్రే రంగుల్లో ఈ సైకిల్ అందుబాటులో ఉండనుంది. సాయుధ బలగాలకు ఈ సైకిల్ రూ.25,995కే అందుబాటులో ఉండనుండగా ఇతరులకు మాత్రం రూ.27,995 ధరకు అందించనున్నట్లు ఉడ్‌చలో తెలిపింది.