Share News

ISMA : ఐఎస్‌ఎంఏ అధ్యక్షుడిగా మండవ ప్రభాకర్‌ రావు

ABN , Publish Date - Dec 27 , 2023 | 04:59 AM

ఇండియన్‌ షుగర్‌ మ్యానుఫ్యాక్చరర్స్‌ అసోసియేషన్‌ (ఐఎ్‌సఎంఏ) అధ్యక్షుడిగా నూజివీడు సీడ్స్‌ గ్రూప్‌, ఎన్‌ఎ్‌సఎల్‌ షుగర్స్‌ చైర్మన్‌ మండవ ప్రభాకర్‌ రావు

ISMA : ఐఎస్‌ఎంఏ అధ్యక్షుడిగా మండవ ప్రభాకర్‌ రావు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): ఇండియన్‌ షుగర్‌ మ్యానుఫ్యాక్చరర్స్‌ అసోసియేషన్‌ (ఐఎ్‌సఎంఏ) అధ్యక్షుడిగా నూజివీడు సీడ్స్‌ గ్రూప్‌, ఎన్‌ఎ్‌సఎల్‌ షుగర్స్‌ చైర్మన్‌ మండవ ప్రభాకర్‌ రావు ఎన్నికయ్యారు. ఢిల్లీలో జరిగిన వార్షిక సర్వసభ్య సమావేశంలో ఐఎస్‌ఎంఏ సభ్యులు ప్రభాకర్‌ రావును అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. ఇదే సమావేశంలో అసోసియేషన్‌ పేరును ఇండియన్‌ షుగర్‌ అండ్‌ బయో ఎనర్జీ మ్యానుఫ్యాక్చరర్స్‌ అసోసియేషన్‌గా మార్చారు. ఎన్‌ఎ్‌సఎల్‌ షుగర్స్‌కు కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణల్లో రోజుకు 40 వేల టన్నుల సామర్థ్యం కలిగిన షుగర్‌ తయారీ యూనిట్లు ఉన్నాయి.

Updated Date - Dec 27 , 2023 | 04:59 AM