నాట్కో ఫార్మా డివిడెండ్‌ 350%

ABN , First Publish Date - 2023-08-10T04:16:54+05:30 IST

నాట్కో ఫార్మా ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి తొలి మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించింది. రూ.2 ముఖ విలువ కలిగిన ఒక్కో షేర్‌పై రూ.7 డివిడెండ్‌ (350%)ను చెల్లించాలని...

నాట్కో ఫార్మా డివిడెండ్‌ 350%

  • యూకేలో అనుబంధ కంపెనీ ఏర్పాటు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): నాట్కో ఫార్మా ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి తొలి మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించింది. రూ.2 ముఖ విలువ కలిగిన ఒక్కో షేర్‌పై రూ.7 డివిడెండ్‌ (350%)ను చెల్లించాలని కంపెనీ బోర్డు నిర్ణయించింది. డివిడెండ్‌ చెల్లింపునకు రికార్డు తేదీ ఆగస్టు 22. బ్రిటన్‌లో (యూకే) అనుబంధ కంపెనీని నాట్కో ఏర్పాటు చేయనుంది. ఇందుకు దాదాపు రూ.24 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. కాగా జూన్‌తో ముగిసిన త్రైమాసికానికి ఏకీకృత ప్రాతిపదికన రూ.420.3 కోట్ల నికర లాభాన్ని కంపెనీ ప్రకటించింది. ఏడాది క్రితం ఇదే కాలం లాభం రూ.320.4 కోట్లతో పోలిస్తే ఇది 31.2 శాతం అధికం. ఆదాయం కూడా 26.3 శాతం వృద్ధితో రూ.918.9 కోట్ల నుంచి రూ.1,160.2 కోట్లకు చేరింది. పేటెంట్ల ఉల్లంఘన కేసులకు అయ్యే వ్యయాల కోసం రూ.51 కోట్లు కేటాయించినట్లు కంపెనీ పేర్కొంది.

Updated Date - 2023-08-10T04:16:54+05:30 IST