ఎన్‌సీఎల్ సిమెంట్ ఉత్పత్తి సామర్థ్యం పెంపు
ABN , First Publish Date - 2023-09-29T05:10:25+05:30 IST
ఎన్‌సీఎల్ ఇండస్ట్రీస్ రెండు కొత్త ప్రీమియం బ్రాండ్ సిమెంట్‌లను మార్కెట్లోకి తీసుకువచ్చింది.
రూ.30 కోట్ల పెట్టుబడులు
రెండు కొత్త ప్రీమియం బ్రాండ్స్ విడుదల
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): ఎన్‌సీఎల్ ఇండస్ట్రీస్ రెండు కొత్త ప్రీమియం బ్రాండ్ సిమెంట్‌లను మార్కెట్లోకి తీసుకువచ్చింది. కొత్త బ్రాండ్స్‌ను ప్రవేశపెట్టడడంతో పాటు సిమెంట్ ఉత్పత్తి సామర్థ్యాన్ని కూడా పెంచుతున్నట్లు ఎన్‌సీఎల్ ఇండస్ట్రీస్ ఎండీ కే గౌతమ్ తెలిపారు. విశిష్ఠ, స్టీల్‌క్రీట్ బ్రాండ్లతో రెండు బ్రాండ్స్‌ను విడుదల చేసినట్లు చెప్పారు. ప్రస్తుతం కంపెనీ నెలకు 3.1 లక్షల టన్ను ల సిమెంట్‌ను ఉత్పత్తి చేస్తోంది. రూ.30 కోట్ల పెట్టుబడితో ఉత్పత్తి సామర్థ్యాన్ని కంపెనీ 30 శాతం మేరకు పెంచనుంది. కొత్త ప్రీమియం పోర్ట్‌లాండ్ పాజొలోనా సిమెంట్ (పీపీసీ) పరిశ్రమలో కొత్త ఒరవడిని తీసుకురానుందని పేర్కొంది. స్టీల్‌క్రీట్ ప్రీమియం పోర్ట్‌లాండ్ సిమెంట్ పర్యావరణానికి అనుకూలమని తెలిపింది.