Pixel 7A: సరికొత్త ఫీచర్స్‌తో, అద్భుతమైన కెమెరాతో విడుదల సిద్ధంగా 5జీ గూగుల్ స్మార్ట్ ఫోన్

ABN , First Publish Date - 2023-04-25T13:11:56+05:30 IST

గూగుల్ తమ సరికొత్త పిక్సెల్ 7ఏ(Pixel 7A) స్మార్ట్‌ఫోన్‌ను ..

Pixel 7A: సరికొత్త ఫీచర్స్‌తో, అద్భుతమైన కెమెరాతో విడుదల సిద్ధంగా 5జీ గూగుల్ స్మార్ట్ ఫోన్

ప్రముఖ మల్టీనేషనల్ కంపెనీ గూగుల్, పిక్సెల్(Pixel) పేరుతో స్మార్ట్‌‌ఫోన్ల(Smart Phones)ను తయారు చేసి విక్రయిస్తుందనే విషయం మనకు తెలిసిందే. అయితే తాజాగా ఇప్పుడు గూగుల్ తమ సరికొత్త పిక్సెల్ 7ఏ(Pixel 7A) స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేయనుంది. మే10 న జరగనున్న గూగుల్ డెవెలపర్స్ కాన్ఫరెన్స్‌2023 లో విడుదల చేయనుంది. పిక్సెల్ 7ఏ(Pixel 7A) స్మార్ట్‌ఫోన్ ఇంకా విడుదల కానప్పటికీ, దానికి సంబంధించిన ప్రత్యేకతలు మాత్రం ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతున్నాయి. ఆన్‌లైన్‌లో లీక్ అయిన ప్రత్యేకతలు ను ఒకసారి పరిశీలిద్దాం.

గూగుల్ పిక్సెల్ 7ఏ(Pixel 7A) ఫేస్ అన్ లాక్‌తో పాటు ఫింగర్ ప్రింట్ ఆధారిత అన్‌లాక్ (UnLock) రెండు రకాల బయోమెట్రిక్ ఆథెంటికేషన్లను సపోర్ట్ చేస్తుందని ఆన్‌లైన్ నివేదికలు చెబుతున్నాయి. అయితే దీనికంటే ముందు మోడల్ అయిన పిక్సెల్ 6ఏ లో ఫేస్ అన్ లాక్ సపోర్ట్ లేదు. కేవలం ఫింగర్ ప్రింట్ అన్‌లాక్ మాత్రమే అందుబాటులో ఉంది.

ఇక గూగుల్ పిక్సెల్ 7ఏ ధర విషయానికి వస్తే, ఈ ఫోన్ ధర 499 డాలర్లుగా ఉండే అవకాశం ఉందని నివేదికలు తెలిపాయి. ఇది పిక్సెల్ 6ఏ కంటే 50 డాలర్లు ఎక్కువ. అయితే గూగుల్ పిక్సెల్ 7ఏ మన దేశంలో రూ. 45,000 లోపు నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉందని నివేదికలు తెలిపాయి.

గూగుల్ పిక్సెల్ 7ఏ(Pixel 7A) ప్రత్యేకతలు

  • 6.1-inch OLED screen with FHD+ resolution

  • a 90Hz refresh rat

  • టెన్సర్ జీ2 ఎస్ఓసీ ప్రాసెసర్

  • ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టం

  • 8 జీబీ ర్యామ్, 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్

  • సెంట్రల్ హోల్ పంచ్ కెమెరా కట్ అవుట్

  • ముందువైపు సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 8 Mega Pixel Primary Sensor

  • వెనుక వైపు 64 Mega Pixel సోనీ ఐఎంఎక్స్ 787 ప్రైమరీ సెన్సార్ తో పాటు 12 మెగా పిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరాతో కూడిన

  • Dual Camera SetUp

  • On Display Fingerprint Scanners

  • 4500 MAH బ్యాటరీ

  • 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్

  • 5 వాట్ Wireless Charging Support

  • USB Type C Port

Updated Date - 2023-04-25T13:11:56+05:30 IST