Poco X5 5G: రూ. 20 వేల లోపు మంచి 5జీ ఫోన్ కోసం వెతుకుతున్నారా?.. ఈ కొత్త ఫోన్‌పై ఓ లుక్కేయండి!

ABN , First Publish Date - 2023-03-09T16:24:16+05:30 IST

మంచి ఫీచర్లతో కూడిన 5జీ ఫోన్ కోసం వెతుకుతున్నారా? అయితే, మీలాంటి వారి కోసం

 Poco X5 5G: రూ. 20 వేల లోపు మంచి 5జీ ఫోన్ కోసం వెతుకుతున్నారా?.. ఈ కొత్త ఫోన్‌పై ఓ లుక్కేయండి!

న్యూఢిల్లీ: మంచి ఫీచర్లతో కూడిన 5జీ ఫోన్ కోసం వెతుకుతున్నారా? అయితే, మీలాంటి వారి కోసం చైనీస్ మొబైల్ మేకర్ పోకో(Poco) సరికొత్త మొబైల్‌‌తో వచ్చేస్తోంది. పోకో ఎక్స్ సిరీస్‌లో ‘పోకో ఎక్స్5 5జీ’(Poco X5 5G)ఈ నెల 14న ఇది భారత మార్కెట్లో విడుదల చేస్తోంది. ట్విట్టర్ టీజర్ ద్వారా కంపెనీ ఈ విషయాన్ని నిర్ధారించింది. ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఈ మొబైల్ వినియోగదారులకు అందుబాటులో ఉండనుంది. పోకో ఎక్స్ సిరీస్‌లోని ఈ నయా స్మార్ట్‌ఫోన్ మూడు వేర్వేరు కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఎంపిక చేసిన మార్కెట్లలో గత నెలలోనే ఇది అందుబాటులోకి వచ్చింది. స్నాప్‌డ్రాగన్ 695 ఎస్ఓసీ, 48 ఎంపీ ప్రధాన సెన్సార్‌తో ట్రిపుల్ రియర్ కెమెరా, 6.67 అంగుళాల హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 33 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ వంటివి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

పోకో ఎక్స్5 5జీ గత నెలలో గ్లోబల్ మార్కెట్లో విడుదలైంది. టాప్ ఎండ్ మోడల్ అయిన 8జీబీ+256జీబీ స్టోరేజీ వేరియంట్ ధర 289 డాలర్లు (దాదాపు రూ. 24,700). బ్లాక్, బ్లూ, గ్రీన్ రంగుల్లో అందుబాటులో ఉన్న ఈ స్మార్ట్‌ఫోన్ ధర భారత మార్కెట్లో రూ. 20 వేలు ఉండే అవకాశం ఉంది.

స్పెసిఫికేషన్లు: పోకో ఎక్స్5 5జీలో ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఎంఐయూఐ 13ను ఉపయోగించారు. 6.67 అంగుళాల అమోలెడ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 120Hz రీఫ్రెష్ రేట్, హోల్‌పంచ్ కట్ అవుట్ డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 695 చిప్‌సెట్, 8జీబీ ర్యామ్, 48 ఎంపీ ప్రధాన సెన్సార్‌తో వెనకవైపు మూడు కెమెరాలు, సెల్ఫీల కోసం ముందువైపు 16 ఎంపీ కెమెరా, 256జీబీ స్టోరేజీ, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ వంటి ఫీచర్లు ఉన్న ఈ ఫోన్‌లో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీని ఉపోగించారు. ఇది 33 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.

Updated Date - 2023-03-09T16:24:16+05:30 IST