Punch CNG : టాటా మోటార్స్ ‘పంచ్ సీఎన్‌జీ’
ABN , First Publish Date - 2023-08-05T04:09:33+05:30 IST
టాటా మోటార్స్.. మైక్రో ఎస్‌యూవీ పంచ్ సీఎన్‌జీ వెర్షన్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. దీని ధర రూ.7.1 లక్షల నుంచి రూ.9.68 లక్షల (ఢిల్లీ ఎక్స్‌షోరూమ్) మధ్యన ఉన్నాయి. కంపెనీ ప్రొపైటరీ
ప్రారంభ ధర రూ.7.1లక్షలు
న్యూఢిల్లీ: టాటా మోటార్స్.. మైక్రో ఎస్‌యూవీ పంచ్ సీఎన్‌జీ వెర్షన్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. దీని ధర రూ.7.1 లక్షల నుంచి రూ.9.68 లక్షల (ఢిల్లీ ఎక్స్‌షోరూమ్) మధ్యన ఉన్నాయి. కంపెనీ ప్రొపైటరీ ట్విన్ సిలిండర్ టెక్నాలజీతో పంచ్ ఐసీఎన్‌జీని అందుబాటులోకి తెచ్చింది. వాయిస్ అసిస్టెడ్ ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, ఆటోమెటిక్ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, 16 అంగుళాల డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్ ఈ మైక్రో ఎస్‌యూవీ ప్రత్యకతలు.