ఇండియా ఎనర్జీ వీక్‌లో రిలయన్స్ హైడ్రోజన్ ట్రక్
ABN , First Publish Date - 2023-02-07T02:47:28+05:30 IST
ఎలాంటి కాలుష్యానికి తావు లేని హైడ్రోజన్ ఇంధనంతో నడిచే ట్రక్కును రిలయన్స్ ఇండస్ర్టీస్ బెంగళూరులో జరుగుతున్న ఇండియా ఎనర్జీ వీక్‌లో..
ముంబై/బెంగళూరు : ఎలాంటి కాలుష్యానికి తావు లేని హైడ్రోజన్ ఇంధనంతో నడిచే ట్రక్కును రిలయన్స్ ఇండస్ర్టీస్ బెంగళూరులో జరుగుతున్న ఇండియా ఎనర్జీ వీక్‌లో ప్రదర్శించింది. రెండు భారీ హైడ్రోజన్ సిలిండర్లు అమర్చిన అశోక్ లేలాండ్ తయారుచేసిన ఈ ట్రక్కును ప్రదర్శనకు ఉంచారు. దేశంలో హెచ్21సీఈ టెక్నాలజీతో నడిచే తొలి ట్రక్కు ఇదే. ఈ ట్రక్కు పనితీరు డీజిల్ ఐసీఈ ట్రక్కు పనితీరుకు సమానంగానే ఉన్నదని ప్రకటించారు.