Savings vs Current accounts: సేవింగ్స్ ఖాతా అంటే ఏమిటి..? కరెంట్ అకౌంట్ అంటే ఏంటి..? రెండిటికీ మధ్య అసలు తేడాలేంటంటే..!
ABN , First Publish Date - 2023-08-31T17:21:27+05:30 IST
కరెంట్ అకౌంట్, సేవింగ్స్ అకౌంట్ అనే మాటలు తరచుగా వింటూనే ఉంటాం. చాలామందికి ఈ రెండించి మధ్య తేడా తెలియదు. పని జరిగిపోతోంది కదా అని పట్టించుకోరు కూడా. కానీ..
ఇప్పట్లో ప్రతి ఒక్కరికీ బ్యాంక్ అకౌంట్ తప్పనిసరిగా ఉంటోంది. ఎన్నో ఆర్థిక లావాదేవిలు బ్యాంక్ అకౌంట్ నుండే జరుగుతాయి. అయితే చాలామంది కరెంట్ అకౌంట్ అని సేవింగ్స్ అకౌంట్ అనే పేర్లు తరచూ వింటూ ఉంటారు. బ్యాంక్ అకౌంట్లు తెరవడం, ఏటియం లేదా ఆన్లైన్ ద్వారా ఆర్థిక లావాదేవిలు జరపడమే తప్ప, ఎన్నో యేళ్ళ నుండి బ్యాంక్ ఖాతాలు ఉపయోగిస్తున్నవారికి కూడా ఈ కరెంట్ అకౌంట్ సేవింగ్స్ అకౌంట్ గురించి తెలియదు. ఈ రెండు ఖాతాల్లోను నగదు డిపాజిట్లు, నగదు లావాదేవి లు జరిగినా రెండింటికి మధ్య తేడా ఉంది. ఈ తేడా ఏంటో తెలుసుకుంటే ఏ ఖాతా మంచిదనే విషయం సులువుగా అర్థమవుతుంది. ఏది లాభమో కూడా అర్థమవుతుంది. దీని గురించి పూర్తీగా తెలుసుకుంటే..
సాధారణంగా బ్యాంక్ ఖాతాలు రెండు రకాలు ఉంటాయి(two types bank accounts). వీటిలో సేవింగ్స్ ఖాతా(savings account) ఒకటైతే, కరెంట్ అకౌంట్(current account) మరొకటి. కరెంట్ ఖాతా అనేది ఎప్పుడూ పెద్ద మొత్తంలో లావాదేవి లు నిర్వహించే వారి కోసం జారీచేయబడుతుంది. సంస్థలు, స్టార్టప్ లు, పార్టనర్ షిప్ సంస్థలు, ప్రైవెట్ లిమిటెడ్ కంపెనీలు, ఫైనాన్స్ వంటివి కరెంట్ ఖాతా ఉపయోగిస్తాయి. ఇక సేవింగ్స్ ఖాతా ఉపయోగించేవారికి అకౌంట్ లో ఉండే సొమ్ముకు వడ్డీ ఇవ్వడం జరుగుతుంది. సేవింగ్స్ అకౌంట్ అనేది నగదు డిపాజిట్లు, పొదుపు కోసం జారీ చేయబడుతుంది.
Viral Video: ఇలాంటి వెర్రి వేషాలే వద్దనేది.. పుట్టినరోజు సంబరంలో ఓ యువతి ఏకంగా అపార్టమ్మెంట్ కిటికి ఎక్కి మరీ డాన్స్.. ఆ తరువాత ఏం జరిగిందంటే..
సేవింగ్స్ అకౌంట్ అయినా, కరెంట్ అకౌంట్ అయినా అకౌంట్ లో మినిమం బ్యాలెన్స్ ఉండాలి. ఒకవేళ సేవింగ్స్ అకౌంట్ లో మినిమం బ్యాలెన్స్ లేకపోయినా పెద్ద సమస్య ఉండదు. కానీ కరెంట్ అకౌంట్ లో మాత్రం మినిమం బ్యాలెన్స్ ఉండాలి. ఇంకా చెప్పాలి అంటే సేవింగ్స్ అకౌంట్ కంటే కరెంట్ అకౌంట్ లో మినిమం బ్యాలెన్స్ ఎక్కువ ఉంటుంది.
కరెంట్ అకౌంట్ లో లావాదేవి చేయడం కుదరకపోతే కేవలం ఒకనెలలో మాత్రమే సేవింగ్స్ అకౌంట్ నుండి లావాదేవి లు చేయడం కుదురుతుంది. ఆ తరువాత ఈ లావాదేవిలు చేయడం కుదరదు. ఇకపోతే సేవింగ్స్ అకౌంట్ లో ఎక్కువ మొత్తం డబ్బు ఉంచడానికి బ్యాంక్ ఒక లిమిట్ నిర్ణయించి ఉంటుంది. కానీ కరెంట్ అకౌంట్ లో ఈ లిమిట్ నియమం లేదు, కావలసినంత డబ్బు ఉంచుకోవచ్చు.
సేవింగ్స్ అకౌంట్ లో డిపాజిట్ చేసిన ఎంత డబ్బు అయినా ఆదాయపు పన్ను కిందకు రాకపోతే ఆ డబ్బుకు బ్యాంకు వడ్డీ చెల్లిస్తుంది. అయితే కరెంట్ అకౌంట్ లో ఈ వెసులుబాటు ఉండదు. ఎంత డబ్బు ఉన్నా దీనికి ఒక్క రూపాయి కూడా వడ్డీ లభించదు.