సిప్లా నుంచి ‘సిప్ పాయింట్’
ABN , First Publish Date - 2023-01-19T01:48:08+05:30 IST
హృద్రోగం, మధుమేహం, ఇన్ఫెక్షన్లు, థైరాయిడ్ గ్రంథి పనితీరు సహా వివిధ రకాల వ్యాధులను గుర్తించే ఒక పరికరాన్ని ఫార్మా దిగ్గజం సిప్లా మార్కెట్లో...
న్యూఢిల్లీ : హృద్రోగం, మధుమేహం, ఇన్ఫెక్షన్లు, థైరాయిడ్ గ్రంథి పనితీరు సహా వివిధ రకాల వ్యాధులను గుర్తించే ఒక పరికరాన్ని ఫార్మా దిగ్గజం సిప్లా మార్కెట్లో విడుదల చేసింది. ‘సిప్ పాయింట్’గా వ్యవహరించే ఈ పరికరం ఆరోగ్యరక్షణ రంగంలోని వృత్తినిపుణులకు 3 నుంచి 15 నిముషాల వ్యవధిలోనే రోగి ఆరోగ్య స్థితిని తెలియచేస్తుంది. దీన్ని మొబైల్ వ్యాన్లు, గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లో కూడా తేలిగ్గా వినియోగించుకునే వెసులుబాటు ఉంటుందని కంపెనీ తెలిపింది.