టాటా టియోగో విక్రయాలు@ 5 లక్షలు

ABN , First Publish Date - 2023-07-07T01:40:51+05:30 IST

దేశీయ మార్కెట్లో ఎంట్రీ లెవల్‌ కారు అయిన టియాగో విక్రయాలు 5 లక్షల మార్కును అధిగమించాయని టాటా మోటార్స్‌ వెల్లడించింది...

టాటా టియోగో విక్రయాలు@ 5 లక్షలు

న్యూఢిల్లీ: దేశీయ మార్కెట్లో ఎంట్రీ లెవల్‌ కారు అయిన టియాగో విక్రయాలు 5 లక్షల మార్కును అధిగమించాయని టాటా మోటార్స్‌ వెల్లడించింది. కేవలం 15 నెలల వ్యవధిలో లక్ష కార్ల విక్రయ మార్కును చేరుకున్నట్లు తెలిపింది. టియాగో శ్రేణిలో ప్రస్తుతం పెట్రోల్‌, సీఎన్‌జీ, ఎలక్ట్రిక్‌ మోడళ్లున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసిక కాలంలో టియాగో విక్రయాల్లో 45 శాతం పెట్రోల్‌ వేరియంట్స్‌, 42 శాతం ఎలక్ట్రిక్‌ వాహనాలుండగా 13 శాతం సీఎన్‌జీ వేరియంట్స్‌ ఉన్నట్లు టాటా మోటార్స్‌ పేర్కొంది.

Updated Date - 2023-07-07T01:40:51+05:30 IST