Share News

టెక్‌ వ్యూ 21000 వద్ద పరీక్ష

ABN , First Publish Date - 2023-12-11T04:19:36+05:30 IST

నిఫ్టీ గత వారం బుల్లి్‌షగా ప్రారంభమై 21000 వరకు వెళ్లి చివరికి అదే స్థాయిలో ముగిసింది. చివరి మూడు ట్రేడింగ్‌ సెషన్లలో కన్సాలిడేషన్‌, సైడ్‌వేస్‌ ధోరణిని ప్రదర్శించినా చివరికి సుమారు 700...

టెక్‌ వ్యూ 21000 వద్ద పరీక్ష

టెక్‌ వ్యూ 21000 వద్ద పరీక్ష

నిఫ్టీ గత వారం బుల్లి్‌షగా ప్రారంభమై 21000 వరకు వెళ్లి చివరికి అదే స్థాయిలో ముగిసింది. చివరి మూడు ట్రేడింగ్‌ సెషన్లలో కన్సాలిడేషన్‌, సైడ్‌వేస్‌ ధోరణిని ప్రదర్శించినా చివరికి సుమారు 700 పాయింట్ల లాభంతో వారం గరిష్ఠ స్థాయిలో క్లోజయింది. టెక్నికల్‌గా మార్కెట్‌ 18800 నుంచి ప్రారంభమైన అప్‌ట్రెండ్‌ను కొనసాగిస్తూ గత ఆరు వారాల్లో అన్ని నిరోధాలను ఛేదించుకుంటూ 2200 పాయింట్ల వరకు లాభపడింది. మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ ఇండెక్స్‌లు కూడా మంచి లాభాలు సాధించినా చివరిలో రియాక్షన్‌ ఏర్పడడం గరిష్ఠ స్థాయిల్లో అప్రమత్తంగా ఉండాలనేందుకు సంకేతం. మంగళవారం వెలువడే ద్రవ్యోల్బణ గణాంకాలకు మార్కెట్‌ ఏ విధంగా స్పందిస్తుందనేదే తదుపరి ఆసక్తికర అంశం. అలాగే ట్రెండ్‌ పాజిటివ్‌గానే ఉన్నా మానసిక అవధి 21000కి సమీపంలో ఉంది.

బుల్లిష్‌ స్థాయిలు : పాజిటివ్‌ ట్రెండ్‌ ప్రదర్శించినట్టయితే మరింత అప్‌ట్రెండ్‌ కోసం 21000 కన్నా పైన నిలదొక్కుకోవాలి. తదుపరి మానసిక అవధి 21500.

బేరిష్‌ స్థాయిలు : బలహీనపడినా గత వారం బాటమ్‌ 20800 వద్ద నిలదొక్కుకోవాలి. విఫలమైతే మైనర్‌ బలహీనతలో పడుతుంది. ప్రధాన స్వల్పకాలిక మద్దతు స్థాయి 20500. ఇక్కడ కూడా విఫలమైతే స్వల్పకాలిక బలహీనత ఏర్పడుతుంది.

బ్యాంక్‌ నిఫ్టీ : గత వారం ఈ సూచీ 2500 పాయింట్ల వరకు లాభపడి 47260 వద్ద క్లోజయింది. పాజిటివ్‌ ట్రెండ్‌ ప్రదర్శించినట్టయితే మరింత అప్‌ట్రెండ్‌ కోసం 47300 కన్నా పైన నిలదొక్కుకోవాలి. దిగువన 46500 వద్ద మద్దతు ఉంది. అంతకన్నా దిగజారితే స్వల్పకాలిక బలహీనతలో పడుతుంది.

పాటర్న్‌ : ఆర్‌ఎ్‌సఐ సూచీల ప్రకారం మార్కెట్‌ 90 డిగ్రీల కోణంలో ఓవర్‌ బాట్‌ స్థితిలో ఉంది. గరిష్ఠ స్థాయిల్లో స్వల్పకాలిక ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండాలి. 20800 వద్ద ‘‘అడ్డంగా ఏర్పడిన సపోర్ట్‌ ట్రెండ్‌లైన్‌’’ కన్నా దిగజారితే స్వల్పకాలిక బలహీనత తప్పదు.

టైమ్‌ : ఈ సూచీ ప్రకారం మంగళవారం తదుపరి రివర్సల్‌ ఉంది.

సోమవారం స్థాయిలు

నిరోధం : 21,050 : 21,130

మద్దతు : 20,900 : 20,840

వి. సుందర్‌ రాజా

Updated Date - 2023-12-11T04:19:38+05:30 IST