Share News

సరికొత్త సఫారీ, హారియర్‌ ఎస్‌యూవీ

ABN , First Publish Date - 2023-10-18T04:13:42+05:30 IST

దేశీయ వాహన ఉత్పత్తి దిగ్గజం టాటా మోటార్స్‌.. మార్కెట్లోకి అప్‌గ్రేడెడ్‌ స్పోర్ట్స్‌ యుటిలిటీ వెహికల్‌ (ఎస్‌యూవీ) ‘సఫారీ’, ప్రీమియం ఎస్‌యూవీ ‘హారియర్‌’ విడుదల చేసింది...

సరికొత్త సఫారీ, హారియర్‌ ఎస్‌యూవీ

మార్కెట్లోకి టాటా మోటార్స్‌

పరిచయ ధర రూ.16.19- 15.49 లక్షలు

న్యూఢిల్లీ: దేశీయ వాహన ఉత్పత్తి దిగ్గజం టాటా మోటార్స్‌.. మార్కెట్లోకి అప్‌గ్రేడెడ్‌ స్పోర్ట్స్‌ యుటిలిటీ వెహికల్‌ (ఎస్‌యూవీ) ‘సఫారీ’, ప్రీమియం ఎస్‌యూవీ ‘హారియర్‌’ విడుదల చేసింది. ఏడు ఎయిర్‌బ్యాగ్స్‌ సహా పలు కొత్త ఫీచర్లతో వీటిని తీసుకువచ్చినట్లు టాటా మోటార్స్‌ ఎండీ (ప్యాసింజర్‌ వెహికల్స్‌) శైలేష్‌ చంద్ర తెలిపారు. ఈ ఎస్‌యూవీల పరిచయ ధర వరుసగా రూ.16.19 లక్షలు, రూ.15.49 లక్షలుగా ఉన్నాయి. ప్రస్తుత ఆటోమొబైల్‌ పరిశ్రమ ప్రమాణాలకు తగ్గట్టుగా అత్యుత్తమ రక్షణ ఫీచర్లు సహా జీఎన్‌సీఏపీ 5-స్టార్‌ రేటింగ్‌తో సఫారీ, హారియర్‌ ఎస్‌యూవీలను తీసుకువచ్చినట్లు చంద్ర తెలిపారు.

Updated Date - 2023-10-18T04:13:42+05:30 IST