Share News

HYD: పేరుకు ఫార్మా స్యూటికల్‌ పరిశ్రమ.. కానీ.. లోపల మాత్రం...

ABN , First Publish Date - 2023-11-03T07:52:44+05:30 IST

అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో హవాలా, డ్రగ్స్‌, మద్యం సరఫరాపై దృష్టి సారించిన అధికారులు తాజాగా ఫార్మా పరిశ్రమలపై దాడి

HYD: పేరుకు ఫార్మా స్యూటికల్‌ పరిశ్రమ.. కానీ.. లోపల మాత్రం...

- ఫార్మా స్యూటికల్‌ పరిశ్రమలో డ్రగ్స్‌ నిల్వలు

- రూ. 2.37కోట్ల విలువ చేసే మీడాజోలం స్వాధీనం

పేట్‌బషీరాబాద్‌(హైదరాబాద్), (ఆంధ్రజ్యోతి): అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో హవాలా, డ్రగ్స్‌, మద్యం సరఫరాపై దృష్టి సారించిన అధికారులు తాజాగా ఫార్మా పరిశ్రమలపై దాడి చేశారు. రూ. 2.37 కోట్ల విలువైన డ్రగ్స్‌ స్వాధీనం చేసుకున్నారు. ఉంటుందని అధికారులు తెలిపారు. ఎక్సైజ్‌ కమిషనర్‌ జ్యోతి బుద్ధప్రసాద్‌ ఆదేశాల మేరకు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎక్సైజ్‌ పోలీసులు గండిమైసమ్మలోని గ్రాండ్‌ ఫార్మాస్యూటికల్‌ లిమిటెడ్‌ కంపెనీ(Grand Pharmaceutical Limited Company)లో దాడులు నిర్వహించారు. తనిఖీల్లో ఎటువంటి ఆధారాలు లేకుండా డ్రమ్ముల్లో నిల్వ ఉంచిన 103.46 కిలోల డ్రగ్స్‌ (మీడాజోలం)ను స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ మార్కెట్‌లో రూ. 2.37 కోట్లు ఉంటుంది. వాటిని స్వాధీనం చేసుకుని సంస్థ యాజమాన్యంపై కేసు నమోదు చేసి, స్వాధీనం చేసుకున్న డ్రగ్స్‌ను కుత్బుల్లాపూర్‌ ఎక్సైజ్‌ పోలీస్‌ స్టేషన్‌లో అప్పగించారు. ఈ దాడుల్లో రంగారెడ్డి జిల్లా డిప్యూటీ కమిషనర్‌ డేవిడ్‌ రవినాథ్‌, అసిస్టెంట్‌ కమిషనర్‌ ఎ.చంద్రయ్య నేతృత్వంలో మేడ్చల్‌ ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ విజయ్‌ భాస్కర్‌, జీవన్‌కిరణ, మాధవయ్య, సీఐలు, శ్రీనివాస్‌, సుభాష్‌ చందర్‌, నర్శిరెడ్డి, యాదయ్య, ఎస్‌ఐలు కుర్మా, విష్ణువర్దన్‌ పాల్గొన్నారు.

bbb.jpg

Updated Date - 2023-11-03T07:52:45+05:30 IST