ఇప్పటికే పదిమంది పిల్లలు.. అయినా సరిపోలేదేమో.. భార్య పిల్లలను వద్దనుకుందని ఆ భర్త ఎంత పని చేశాడంటే..
ABN , First Publish Date - 2023-02-19T15:29:26+05:30 IST
నాలుగైదు దశాబ్దాల క్రితం దంపతులు సంతానం విషయంలో పరిమితులు పాటించుకునేవారు కాదు. ఒక్కో జంట పది మందికి పైగానే పిల్లలను కనేవారు. దాంతో జనాభా అపరిమితంగా పెరిగిపోయి దేశ వనరులు సరిపోయేవి కావు.
నాలుగైదు దశాబ్దాల క్రితం దంపతులు సంతానం విషయంలో పరిమితులు పాటించుకునేవారు కాదు. ఒక్కో జంట పది మందికి పైగానే పిల్లలను కనేవారు. దాంతో జనాభా అపరిమితంగా పెరిగిపోయి దేశ వనరులు సరిపోయేవి కావు. ఆ తర్వాత కుటుంబ నియంత్రణను (Family Planning) పాటిస్తూ ఇద్దరు లేదా ముగ్గురు పిల్లలకు మాత్రమే జన్మనివ్వడం మొదలుపెట్టారు. అయితే ఇప్పటికీ కొన్ని గ్రామాల్లో, వెనుకబడిన ప్రాంతాలకు చెందిన దంపతులు కుటుంబ నియంత్రణ పాటించుకుండా పిల్లలను కంటూనే ఉన్నారు.
తాజాగా ఒడిశాకు (Odisha) చెందిన ఓ మహిళ పిల్లలను కనకూడదని నిర్ణయించుకున్నందుకు భర్త దారుణ శిక్ష విధించాడు. కేంఝర్ జిల్లా డిమిరియా గ్రామానికి చెందిన రవి దెహురి, జానకి దంపతులకు పది మంది పిల్లలు. జానకి మరోసారి దర్భం దాల్చి కాన్పునకు వెళ్లింది. అయితే ప్రసవ సమయంలోనే శిశువు చనిపోయింది. విషయం తెలుసుకున్న స్థానిక ఆశా కార్యకర్తలు జానకిని కలుసుకుని కుటుంబ నియంత్రణ ఆపరేషన్ (Tubectomy) చేయించుకోవాలని నచ్చచెప్పారు. వారి చొరవతో జానకి ఇటీవల సర్జరీ చేయించుకుంది.
22 ఏళ్ల ఈ కుర్రాడు.. తనకంటే వయసులో 20 ఏళ్లు పెద్దయిన మహిళను ప్రేమించాడు.. ప్రస్తుతం అతడి పరిస్థితి ఏంటంటే..
విషయం తెలుసుకున్న రవి తన భార్యను వేధించడం ప్రారంభించాడు. ఆమెను ఇంటి నుంచి బయటకు గెంటేశాడు. లోపలకు వస్తే చంపేస్తానంటూ ఇంటి ముందు కత్తి పట్టుకుని కూర్చుంటున్నాడు (Mother of 10 children thrown out by husband ). దీంతో తల్లీ పిల్లలకు ఆశా కార్యకర్తలే ఆహారం అందిస్తున్నారు. ఆరోగ్య శాఖ అధికారులు రవికి నచ్చజెప్పినప్పటికీ అతను పట్టించుకోవడం లేదు. దీంతో తల్లీ పిల్లలను సంరక్షణ కేంద్రానికి తరలించారు. రవిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.