Share News

Tirupati: భారీగా ఎర్రచందనం స్వాధీనం

ABN , Publish Date - Dec 19 , 2023 | 12:22 PM

సత్యవేడు మండలంలో ఓ ప్రైవేటు లైసెన్సుడు ఎర్ర చందనం గోడౌన్‌లో ప్రవేశించి దుంగలు తీసుకెళ్తున్న స్మగ్లర్ల ముఠాపై తిరుపతి టాస్క్‌ఫోర్స్‌, స్థానిక పోలీసు అధికా రులు

Tirupati: భారీగా ఎర్రచందనం స్వాధీనం

- పోలీసుల అదుపులో 16 మంది తమిళ స్మగర్లు

సత్యవేడు(తిరుపతి): సత్యవేడు మండలంలో ఓ ప్రైవేటు లైసెన్సుడు ఎర్ర చందనం గోడౌన్‌లో ప్రవేశించి దుంగలు తీసుకెళ్తున్న స్మగ్లర్ల ముఠాపై తిరుపతి టాస్క్‌ఫోర్స్‌, స్థానిక పోలీసు అధికారులు సంయుక్తంగా నిర్వ హించిన ఆపరేషన్‌లో 16 మంది స్మగ్లర్లు ముఠా పట్టుపడగా, ఎర్రచందనం తరలిస్తున్న మినీ లారీ, రెండు కార్లు స్వాధీనం చేసుకుని సత్యవేడు పోలీస్‌స్టేషన్‌(Satyavedu Police Station)కు తరలించారు. ఈ సంఘటన ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. సత్యవేడు మండలం కొత్తమారి కుప్పం పంచాయతీ ఇందిరానగర్‌ సమీపంలోని చెన్నైకి చెందిన రామచంద్రనాయుడు మామిడి తోటలో ఎర్రచందనం గోడౌన్‌ ఉంది. దీనిపై తమిళనాడుకు చెందిన ఎర్రచందనం స్మగ్లర్లు కొందరు కన్నేశారు. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి గోడౌన్‌ వద్దకు చేరుకుని అక్కడ మామిడి తోట కాపలాదారులను తాడుతో కట్టివేశారు. గోడౌన్‌లోకి ప్రవేశించి దుంగలను లోడ్‌ చేసుకుని వెళుతుండగా సమాచారం అందుకున్న టాస్క్‌ఫోర్స్‌ అధికారులు అప్పటికే మాటు వేశారు. ఈ నేపథ్యంలో సినీ ఫక్కిలో వెంబడించారు. దీంతో రెడ్‌హిల్స్‌ చెక్‌పోస్టు వద్ద వారిని అదుపులోకి తీసుకుని దుంగలు స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడుల్లో 16 మంది స్మగ్లర్లను అదుపులో తీసుకున్నట్లు సమాచారం. స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం రెండున్నర టన్నులు ఉంటుందని సమాచారం. వీటి విలువ కోటి రూపాయలు పైనే ఉంటుందని అంచనా. టాస్క్‌ఫోర్స్‌ అధికారులు వీటిని స్థానిక పోలీసు అధికారులకు అప్పగించారు. స్మగ్లర్‌ ముఠాలో తమిళనాడుకు చెందిన ఒక ప్రభుత్వ ఉద్యోగి కూడా ఉన్నట్లు సమాచారం. దీనిపై కేసు నమోదు చేసినట్లు తెలిసింది. పోలీసులు వివరాలను వెల్లడించాల్సి ఉంది.

nani5.2.jpg

Updated Date - Dec 19 , 2023 | 12:22 PM