పోర్న్ చిత్రాలు చూసి భార్యతో బలవంతంగా అసహజ శృంగారం.. ఆమె నిరాకరించిందని ఎంత పని చేశాడంటే..

ABN , First Publish Date - 2023-01-14T15:07:52+05:30 IST

ఆమెకు నాలుగేళ్ల క్రితం వివాహం జరిగింది.. ఎన్నో ఆశలతో అత్తింట అడుగు పెట్టిన ఆమెకు అడుగడుగునా ఛీత్కారాలే ఎదురయ్యాయి.. ఏసీ, కారు తీసుకురావాలని అత్త వేధించేది.. తను కోరినట్టు శృంగార సుఖం అనుభవించాలని భర్త టార్చర్ పెట్టేవాడు.. ఓ బిడ్డకు జన్మనిచ్చినా ఆమె పరిస్థితిలో మార్పు రాలేదు..

పోర్న్ చిత్రాలు చూసి భార్యతో బలవంతంగా అసహజ శృంగారం.. ఆమె నిరాకరించిందని ఎంత పని చేశాడంటే..

ఆమెకు నాలుగేళ్ల క్రితం వివాహం జరిగింది.. ఎన్నో ఆశలతో అత్తింట అడుగు పెట్టిన ఆమెకు అడుగడుగునా ఛీత్కారాలే ఎదురయ్యాయి.. ఏసీ, కారు తీసుకురావాలని అత్త వేధించేది.. తను కోరినట్టు శృంగార సుఖం అందించాలని భర్త టార్చర్ పెట్టేవాడు.. ఓ బిడ్డకు జన్మనిచ్చినా ఆమె పరిస్థితిలో మార్పు రాలేదు.. తను కోరినట్టు అసహజ శృంగారానికి అంగీకరించలేదని తాజాగా ఆమెను భర్త ఇంటి నుంచి బయటకు గెంటేశాడు.. చేసేది లేక ఆమె పోలీసులను ఆశ్రయించింది (Crime News).

రాజస్థాన్‌లోని (Rajasthan) గ్వాలియర్ పాత కంటోన్మెంట్‌కు చెందిన 24 ఏళ్ల మహిళకు రాధాకృష్ణ కాలనీకి చెందిన యువకుడితో 2019లో వివాహం జరిగింది. పెళ్లి తర్వాత కొన్ని నెలల పాటు అంతా సవ్యంగానే సాగింది. ఆ తర్వాత పుట్టింటి నుంచి కారు, ఏసీ తీసుకురావాలని అత్త, భర్త డిమాండ్ చేయడం ప్రారంభించారు. తల్లి ఒంటరిగా ఉందని, కుట్టుపనితో జీవనం సాగిస్తోందని, ఆమె ఏమీ ఇవ్వలేదని బాధితురాలు చెప్పడంతో ఆమెకు చిత్రహింసలు మొదలయ్యాయి. ఇంతలో ఆమె ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఆ తర్వాత కూడా భర్త ప్రవర్తనలో మార్పు రాలేదు. దానికి తోడు అసహజ శృంగారం (Unnatural act) చేయాలని బలవంతం చేసేవాడు.

రోజూ రాత్రి సమయంలో ఆమె చేతులు, కాళ్లు మంచానికి కట్టేసి శృంగారానికి పాల్పడేవాడు. అలాగే పోర్న్ చిత్రాలు చూసి అలాగే చేయాలని పట్టుబట్టేవాడు. ఆమె అందుకు నిరాకరించడంతో గత బుధవారం ఇంటి నుంచి బయటకు గెంటేశాడు. ఇంటి నుంచి గెంటేసిన తర్వాత బాధితురాలు భర్తతో మాట్లాడేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

Updated Date - 2023-01-14T15:07:54+05:30 IST