కళాత్మక వినిర్మాణం సుంకర గోపాల్ కవిత్వం
ABN , First Publish Date - 2023-09-11T00:22:56+05:30 IST
సాదారణ దృష్టిలో ప్రపంచీకరణ అనేది ఓ గొప్ప వృద్ధికారకం. ప్రపంచాన్ని ఓ కుగ్రామంలా మార్చేసి చప్పున అరచేతిలో పెట్టే మంత్రదండం. ఓ గొప్ప నిర్మాణ కార్యక్రమం. కానీ నిజానికది నిర్మాణం కాదు గాలిబుడగ. మాటిమాటికీ పేలిపోతుంటుంది....
సాదారణ దృష్టిలో ప్రపంచీకరణ అనేది ఓ గొప్ప వృద్ధికారకం. ప్రపంచాన్ని ఓ కుగ్రామంలా మార్చేసి చప్పున అరచేతిలో పెట్టే మంత్రదండం. ఓ గొప్ప నిర్మాణ కార్యక్రమం. కానీ నిజానికది నిర్మాణం కాదు గాలిబుడగ. మాటిమాటికీ పేలిపోతుంటుంది. పచ్చని కాపురాల్ని ఊడ్చి నడిబజార్లో పారబో స్తుంటుంది. ఒకపక్క జాతీయ రహదార్లు, ఫ్లైఓవర్లూ, ఎయిర్పోర్టులు, రైల్వేట్రాక్లు, శక్తి ఉత్పత్తి కేంద్రాలు, సెజ్‌లు, పెద్ద పెద్ద నిర్మాణాల్లాంటివి పైకి లేస్తుంటాయి. కానీ వాటికోసం జరిగే భూసేకరణల్లో సార వంతమైన పంటభూములు మాయమైపోతాయి. అడవులు కొండలు విరూపమైపోతాయి. భూమి డొల్లైపోతుంది. లోపలి విలువలు అంతరించి మనిషీ డొల్లైపోతాడు. డబ్బు అతనితో ఏ అకృత్యమైనా చేయిస్తుంది. ప్రపంచీకరణ మానవ సంబంధాలను ధ్వంసం చేస్తుంది. ఆరోగ్యకరమైన విలువలన్నిటినీ మంటగలి పేస్తుంది. అది చేస్తున్న విధ్వంసాన్ని మాన్పి వినిర్మాణం చెయ్యాలి. అందుకోసం పాటుబడు తున్న కవుల బృందంలోకి ‘మా నాయిన పాట’ కావ్యంతో సుంకర గోపాల్ వచ్చిచేరాడు.
ప్రపంచీకరణ మన జీవితాల్లోకి రాకముందు మనిషి నెమ్మదిగా ఉండేవాడు. చుట్టూ ఉన్న వాళ్ళకి ఆసరాగా నిలబడేవాడు. ఇప్పుడు పక్కవాళ్ళని పలకరించే తీరిక కూడా లేక, ‘‘మనిషితనం అకౌంట్ క్లోజ్ చేసి’’ సామాజిక మాధ్యమాల్లో వ్యక్తిత్వాన్ని విసిరేసు కుంటున్నాడు అంటాడు గోపాల్. ‘‘మానవత్వం సన్నగిల్లి మనీ తత్వం ఒంటబట్టాక/ మనిషిపుడు కాలం కీతో నడిచే మరబొమ్మ/ మనిషి మనస్సును/ మరమ్మత్తు చేసే పనిముట్టేదో కనిపెట్టాలి/ ఒక పునర్నిర్మాణం జరగాలి’’ అని అంటాడు గోపాల్. ప్రపంచీకరణ వల్ల గ్రామాల్లో ఉపాధి మృగ్యమైంది. ఉన్నచోట ఊతం లేక జనం డొక్కలు నింపుకోడానికి రెక్కలు కట్టుకుని నగరాలకు వలసెళ్లిపోయారు. ఒకపక్క సామాజిక మాధ్యమాలు పిల్లల్ని చీకటి గదుల్లో కట్టిపడేశాయి. ఫలితంగా ఒకప్పుడు సందడిగా ఉండిన పల్లెల్లో వీధులు మరుభూముల్లా వెలవెలబోతున్నాయని చింతిస్తాడు గోపాల్.
ప్రగతిశీలవాద కవికి తన వాదం ఎక్కడ పాఠకుని చేరకుండాపోతుందోనన్న ఆందోళన ఉంటుంది. దాన్ని మరింత స్పష్టం చేయాలని ప్రయత్నిస్తుంటాడు. ఈ ఆత్రుతలో అతడు వదరుబోతుగా కూడా కనబడవచ్చు. కానీ గోపాల్‌కు ఆ బలహీనత లేదు. ప్రపంచీకరణ చేస్తున్న ఆగడాలను గోపాల్ చాలా కవితాత్మకంగా కళాత్మకంగా ఎండగట్టాలని ప్రయత్నిస్తాడు. తను మనిషినీ మాటనీ ప్రేమిస్తాడు. ఇప్పుడు ఏ వంక చూసినా వినిపిస్తున్న మలినపరిచే మాటలు కాకుండా, మనిషిని శుభ్రపరిచే మిణుగురుల్లాంటి మాటలు కావాలని కోరుకుంటాడు. ‘కూలిన శ్వాస’, ‘బైరాగి పాట’ పద్యాల్లో చెట్టుతో తనకూ ఊరికీ ఉన్న అనుబంధాన్ని, దానితోటి లాభాల్ని కవితాత్మకంగా నెమరువేసుకుంటాడు. చెట్టు జీవిత తత్వాన్ని బోధించే బోధిసత్వుడని అంటాడు. ఇక్కడ గోపాల్ బోధిసత్వుడినే ప్రతీకగా ఎందుకు చెప్పాడో, చెట్టు ఏం బోధిస్తుందో మనమే ఆలోచించుకోవాలి. మార్కెట్, వస్తు వ్యామోహం, పచ్చనోట్ల మాయలు జీవితాల్లోకి ప్రవేశిస్తే మానవ సంబంధాలు ధ్వంసమై ఇల్లు కూలిపోతుందని, ఆ మాయని చేధించి ఇంటిని నిలబెట్టాలని, మనిషితనాన్ని పుట్లకొద్దీ పండించాలని ఆరాటపడతాడు గోపాల్.
కవిత్వ ప్రతీకల్ని వైవిధ్యమైన దృష్టితో చూసే అలవాటుంది గోపాల్‌కి. చీకటిని అజ్ఞానానికి ప్రతీకగా చూడ్డం కవుల అలవాటు. కానీ చీకటిని అణగారిన వర్గాలకు, పోరాటస్ఫూర్తికి ప్రతీకగా చూస్తాడు తను. ‘చీకటి/ ఆత్మజ్ఞాన ప్రబోధగీత’ అంటాడు. చీకటి అంటే అణగారినతనం, అది మనిషిని తనని తాను వెతుక్కునేలా చేస్తుందని భావిస్తాడు. చల్లకొచ్చి ముంత దాస్తే అది కవిత్వం అవుతుంది. దాన్నే డొంకతిరుగుడుతనం అంటారు. కప్పిచెప్పడం అంటారు. అలాంటి కవిత్వభాష గోపాల్‌కి బాగా వంటబట్టింది. కథావస్తువు కోసం జనాల్లో వెతుకుతాను అనడానికి గోపాల్ ఏమంటాడో చూడండి: ‘‘ఒక అద్భుత కళాఖండానికి/ మూలకణాల కోసం/ అక్కడికెళ్తాను/ పొగచూరిన బతుకుల్లో/ కొత్త సత్యం కనుగొంటాను’’ ఇలా వస్తువుని కవిత్వీకరిస్తాడు గోపాల్. అది అతనికి హృదయకోమలత్వం వల్ల అబ్బింది. ఇటుకబట్టీ కాలుతుంటే అతనికి ఆ బట్టీ కార్మికుల జీవితం కాలుతున్న పచ్చివాసన వస్తుంది. నిర్మాణంలో జరుగుతున్న విధ్వంసాన్ని పసిగట్టే కళ్ళున్నాయి తనకి. ‘‘ఒక సామూహిక దుఃఖం/ ఉద్యమానికి ఊపిరి’’ అని హెచ్చరిస్తాడు.
శీర్షిక పద్యం ‘మా నాయిన పాట’. అది ఒక నాయన పాట కాదు. ఒక మనిషి గుండె ఘోష కాదు. నాగరికత పొడుగునా అన్యాయానికి గురైన అనేకమైన జాతుల పాట. అనాగరిక వలసజాతులు వచ్చి స్థానిక నాగరిక జాతుల భూమి నీరు గాలి ఆకాశాలను, వాళ్ళ చరిత్రను సంస్కృతిని కాజేసిన వైనాన్ని కథనం చేసే పాట. అది ఒక కుటుంబగాథ కాదు. అనాదిగా ఆధిపత్య వర్గాల చేతుల్లో దోపిడీకి గురైన అనేకమైన కుటుంబాల గాథ. యుద్ధాలు చెయ్యాలంటే గదలక్కర్లేదు గడ్డిపరకలు చాలని చరిత్ర పొడుగునా ఎన్నోసార్లు నిరూపించిన పోరాటాల పాట. గోపాల్ కళాత్మక అభివ్యక్తికి మచ్చుతునక లాంటిది ఈ పద్యం. ‘ఎడమ పాదం’ పద్యంలో గతంలో పల్లెలో ఏమి ఉండేవో, అక్కడ రియల్ ఎస్టేట్ కాలు మోపాక పల్లె ఏం కోల్పోతోందో గోపాల్ చెప్పిన వాక్యాల్లో దేన్నని ఉదహరించగలం! రియలెస్టేట్ వ్యాపారం వల్ల విత్తనం వెయ్యకుండానే డబ్బు విరగపండే వైపరీత్యం దాపురించింది. ‘‘తేనెపట్టు లాంటి మా ఊరి మట్టి/ పాడి ఆవు లాంటి మా ఊరి మట్టి/ నల్లదనాన్ని దాచే పేటిక కావడమేంటి?’’ అని నిలదీస్తున్న కవికి ఏం సమాధానం చెప్పగలం?
గోపాల్‌ని చదువుతుంటే కవిత్వం ఆలోచనామృతం అనే మాట తప్పకుండా గుర్తుకొస్తుంది. ఒక కవి ఉన్నతశ్రేణి కవి అనిపించుకోడానికి ఆ ఒక్క గుణం చాలు. గోపాల్‌లో అదనంగా ఉన్న ప్రజాపక్షపాతం పువ్వుకి అబ్బిన తావి లాంటిది. సీనియర్ కవులు సెలవు తీసుకుంటూ తరం మారిపోతున్న తరుణంలో తెలుగు కవిత్వపు భవిష్యత్తు భద్రంగానే ఉంటుందని, ఆ మాటకు వస్తే మునుపటికన్నా ఒక మెట్టు ఉన్నతంగానే ఉంటుందని భరోసా ఇచ్చాడు సుంకర గోపాల్.
కళాత్మక వినిర్మాణం సుంకర గోపాల్ కవిత్వం సాదారణ దృష్టిలో ప్రపంచీకరణ అనేది ఓ గొప్ప వృద్ధికారకం. ప్రపంచాన్ని ఓ కుగ్రామంలా మార్చేసి చప్పున అరచేతిలో పెట్టే మంత్రదండం. ఓ గొప్ప నిర్మాణ కార్యక్రమం. కానీ నిజానికది నిర్మాణం కాదు గాలిబుడగ. మాటిమాటికీ పేలిపోతుంటుంది. పచ్చని కాపురాల్ని ఊడ్చి నడిబజార్లో పారబో స్తుంటుంది. ఒకపక్క జాతీయ రహదార్లు, ఫ్లైఓవర్లూ, ఎయిర్పోర్టులు, రైల్వేట్రాక్లు, శక్తి ఉత్పత్తి కేంద్రాలు, సెజ్‌లు, పెద్ద పెద్ద నిర్మాణాల్లాంటివి పైకి లేస్తుంటాయి. కానీ వాటికోసం జరిగే భూసేకరణల్లో సార వంతమైన పంటభూములు మాయమైపోతాయి. అడవులు కొండలు విరూపమైపోతాయి. భూమి డొల్లైపోతుంది. లోపలి విలువలు అంతరించి మనిషీ డొల్లైపోతాడు. డబ్బు అతనితో ఏ అకృత్యమైనా చేయిస్తుంది. ప్రపంచీకరణ మానవ సంబంధాలను ధ్వంసం చేస్తుంది. ఆరోగ్యకరమైన విలువలన్నిటినీ మంటగలి పేస్తుంది. అది చేస్తున్న విధ్వంసాన్ని మాన్పి వినిర్మాణం చెయ్యాలి. అందుకోసం పాటుబడు తున్న కవుల బృందంలోకి ‘మా నాయిన పాట’ కావ్యంతో సుంకర గోపాల్ వచ్చిచేరాడు.
ప్రపంచీకరణ మన జీవితాల్లోకి రాకముందు మనిషి నెమ్మదిగా ఉండేవాడు. చుట్టూ ఉన్న వాళ్ళకి ఆసరాగా నిలబడేవాడు. ఇప్పుడు పక్కవాళ్ళని పలకరించే తీరిక కూడా లేక, ‘‘మనిషితనం అకౌంట్ క్లోజ్ చేసి’’ సామాజిక మాధ్యమాల్లో వ్యక్తిత్వాన్ని విసిరేసు కుంటున్నాడు అంటాడు గోపాల్. ‘‘మానవత్వం సన్నగిల్లి మనీ తత్వం ఒంటబట్టాక/ మనిషిపుడు కాలం కీతో నడిచే మరబొమ్మ/ మనిషి మనస్సును/ మరమ్మత్తు చేసే పనిముట్టేదో కనిపెట్టాలి/ ఒక పునర్నిర్మాణం జరగాలి’’ అని అంటాడు గోపాల్. ప్రపంచీకరణ వల్ల గ్రామాల్లో ఉపాధి మృగ్యమైంది. ఉన్నచోట ఊతం లేక జనం డొక్కలు నింపుకోడానికి రెక్కలు కట్టుకుని నగరాలకు వలసెళ్లిపోయారు. ఒకపక్క సామాజిక మాధ్యమాలు పిల్లల్ని చీకటి గదుల్లో కట్టిపడేశాయి. ఫలితంగా ఒకప్పుడు సందడిగా ఉండిన పల్లెల్లో వీధులు మరుభూముల్లా వెలవెలబోతున్నాయని చింతిస్తాడు గోపాల్.
ప్రగతిశీలవాద కవికి తన వాదం ఎక్కడ పాఠకుని చేరకుండాపోతుందోనన్న ఆందోళన ఉంటుంది. దాన్ని మరింత స్పష్టం చేయాలని ప్రయత్నిస్తుంటాడు. ఈ ఆత్రుతలో అతడు వదరుబోతుగా కూడా కనబడవచ్చు. కానీ గోపాల్‌కు ఆ బలహీనత లేదు. ప్రపంచీకరణ చేస్తున్న ఆగడాలను గోపాల్ చాలా కవితాత్మకంగా కళాత్మకంగా ఎండగట్టాలని ప్రయత్నిస్తాడు. తను మనిషినీ మాటనీ ప్రేమిస్తాడు. ఇప్పుడు ఏ వంక చూసినా వినిపిస్తున్న మలినపరిచే మాటలు కాకుండా, మనిషిని శుభ్రపరిచే మిణుగురుల్లాంటి మాటలు కావాలని కోరుకుంటాడు. ‘కూలిన శ్వాస’, ‘బైరాగి పాట’ పద్యాల్లో చెట్టుతో తనకూ ఊరికీ ఉన్న అనుబంధాన్ని, దానితోటి లాభాల్ని కవితాత్మకంగా నెమరువేసుకుంటాడు. చెట్టు జీవిత తత్వాన్ని బోధించే బోధిసత్వుడని అంటాడు. ఇక్కడ గోపాల్ బోధిసత్వుడినే ప్రతీకగా ఎందుకు చెప్పాడో, చెట్టు ఏం బోధిస్తుందో మనమే ఆలోచించుకోవాలి. మార్కెట్, వస్తు వ్యామోహం, పచ్చనోట్ల మాయలు జీవితాల్లోకి ప్రవేశిస్తే మానవ సంబంధాలు ధ్వంసమై ఇల్లు కూలిపోతుందని, ఆ మాయని చేధించి ఇంటిని నిలబెట్టాలని, మనిషితనాన్ని పుట్లకొద్దీ పండించాలని ఆరాటపడతాడు గోపాల్.
కవిత్వ ప్రతీకల్ని వైవిధ్యమైన దృష్టితో చూసే అలవాటుంది గోపాల్‌కి. చీకటిని అజ్ఞానానికి ప్రతీకగా చూడ్డం కవుల అలవాటు. కానీ చీకటిని అణగారిన వర్గాలకు, పోరాటస్ఫూర్తికి ప్రతీకగా చూస్తాడు తను. ‘చీకటి/ ఆత్మజ్ఞాన ప్రబోధగీత’ అంటాడు. చీకటి అంటే అణగారినతనం, అది మనిషిని తనని తాను వెతుక్కునేలా చేస్తుందని భావిస్తాడు. చల్లకొచ్చి ముంత దాస్తే అది కవిత్వం అవుతుంది. దాన్నే డొంకతిరుగుడుతనం అంటారు. కప్పిచెప్పడం అంటారు. అలాంటి కవిత్వభాష గోపాల్‌కి బాగా వంటబట్టింది. కథావస్తువు కోసం జనాల్లో వెతుకుతాను అనడానికి గోపాల్ ఏమంటాడో చూడండి: ‘‘ఒక అద్భుత కళాఖండానికి/ మూలకణాల కోసం/ అక్కడికెళ్తాను/ పొగచూరిన బతుకుల్లో/ కొత్త సత్యం కనుగొంటాను’’ ఇలా వస్తువుని కవిత్వీకరిస్తాడు గోపాల్. అది అతనికి హృదయకోమలత్వం వల్ల అబ్బింది. ఇటుకబట్టీ కాలుతుంటే అతనికి ఆ బట్టీ కార్మికుల జీవితం కాలుతున్న పచ్చివాసన వస్తుంది. నిర్మాణంలో జరుగుతున్న విధ్వంసాన్ని పసిగట్టే కళ్ళున్నాయి తనకి. ‘‘ఒక సామూహిక దుఃఖం/ ఉద్యమానికి ఊపిరి’’ అని హెచ్చరిస్తాడు.
శీర్షిక పద్యం ‘మా నాయిన పాట’. అది ఒక నాయన పాట కాదు. ఒక మనిషి గుండె ఘోష కాదు. నాగరికత పొడుగునా అన్యాయానికి గురైన అనేకమైన జాతుల పాట. అనాగరిక వలసజాతులు వచ్చి స్థానిక నాగరిక జాతుల భూమి నీరు గాలి ఆకాశాలను, వాళ్ళ చరిత్రను సంస్కృతిని కాజేసిన వైనాన్ని కథనం చేసే పాట. అది ఒక కుటుంబగాథ కాదు. అనాదిగా ఆధిపత్య వర్గాల చేతుల్లో దోపిడీకి గురైన అనేకమైన కుటుంబాల గాథ. యుద్ధాలు చెయ్యాలంటే గదలక్కర్లేదు గడ్డిపరకలు చాలని చరిత్ర పొడుగునా ఎన్నోసార్లు నిరూపించిన పోరాటాల పాట. గోపాల్ కళాత్మక అభివ్యక్తికి మచ్చుతునక లాంటిది ఈ పద్యం. ‘ఎడమ పాదం’ పద్యంలో గతంలో పల్లెలో ఏమి ఉండేవో, అక్కడ రియల్ ఎస్టేట్ కాలు మోపాక పల్లె ఏం కోల్పోతోందో గోపాల్ చెప్పిన వాక్యాల్లో దేన్నని ఉదహరించగలం! రియలెస్టేట్ వ్యాపారం వల్ల విత్తనం వెయ్యకుండానే డబ్బు విరగపండే వైపరీత్యం దాపురించింది. ‘‘తేనెపట్టు లాంటి మా ఊరి మట్టి/ పాడి ఆవు లాంటి మా ఊరి మట్టి/ నల్లదనాన్ని దాచే పేటిక కావడమేంటి?’’ అని నిలదీస్తున్న కవికి ఏం సమాధానం చెప్పగలం?
గోపాల్‌ని చదువుతుంటే కవిత్వం ఆలోచనామృతం అనే మాట తప్పకుండా గుర్తుకొస్తుంది. ఒక కవి ఉన్నతశ్రేణి కవి అనిపించుకోడానికి ఆ ఒక్క గుణం చాలు. గోపాల్‌లో అదనంగా ఉన్న ప్రజాపక్షపాతం పువ్వుకి అబ్బిన తావి లాంటిది. సీనియర్ కవులు సెలవు తీసుకుంటూ తరం మారిపోతున్న తరుణంలో తెలుగు కవిత్వపు భవిష్యత్తు భద్రంగానే ఉంటుందని, ఆ మాటకు వస్తే మునుపటికన్నా ఒక మెట్టు ఉన్నతంగానే ఉంటుందని భరోసా ఇచ్చాడు సుంకర గోపాల్.
కవితశ్రీ
94946 96990